జోగిని (ధారావాహిక ) – శాంతి ప్రబోధ

shanthi prabodha

shanthi prabodha

ఇక జానారెడ్డికి తండ్రి ప్రతాపరెడ్డికున్నంత పలుకుబడి లేదు. ఆయన ఎక్కువ హైదరాబాద్‌లో ఉంటాడు కుటుంబంతో. పిల్లల చదువుకోసం, అందునా ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు. ఊర్లో ఇంత మంది ఆడవాళ్ళు ఉండగా తన భార్యనే నిలబెట్టాడు . అంటే తానే అధికారం చలాయిద్దామని, కాబట్టి  ప్రత్యర్థిలోని ప్రతీ అంశాన్ని ప్రచార అస్త్రంగా చేసి సునాయాసంగా గెలువ వచ్చు. అధికార పార్టీలో తన పలుకుబడి పెంచుకోవడానికి తిరిగి గ్రామపంచాయతీలో అధికారం చేపట్టడానికి ఇది సువర్ణావకాశం. తాను చేయాల్సిందల్లా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు తండ్రి పేరుతోనో, పెద్దకులం బలంతోనో, ప్రజల్లో ఉన్న సానుభూతితోనో తన భార్యను గెలిపించాలనుకున్న జానారెడ్డిని గట్టిగా  ఎదుర్కోవడమే…

కనీసం జోగు పోశవ్వని సంప్రదించనైనా సంప్రదించకుండానే ఆమెతో ఒక్క మాట కూడా చెప్పకుండానే, తను చెప్తే ఊరి సర్పంచ్‌ను చేస్తానంటే ఎవరు కాదంటారు ? అన్న నమ్మకంతోనో లేక అహంకారంతోనో తన పార్టీ అభ్యర్థిగా పోశవ్వను ప్రకటించాడు . సుంకర సాయిలు ద్వారా విషయం తెల్సిన పోశవ్వ గాబరా పడిపోయింది. భయపడిపోయింది. తనేమి సర్పంచ్‌గా నిలబడుడేమి? తన వల్ల కాదంది. తాను నిలబడలేనంది. విషయం తెల్సుకున్న రాజాగౌడ్‌ ఆమెకు కబురంపాడు.
”నీ బాంచన్‌ కాల్మొక్త.. కబరంపిన్రు” వంగి దండాలు పెడ్తూ పోశవ్వ.

”నిన్ను సర్పంచ్‌ చేసెతందుకు” నెమ్మదిగా సుంకర సాయిలు.”నేనేంది? సర్పంచ్‌ ఏంది? దిమాకున్నదా…?” సాయిల్ని చూస్తూ. ”ఏయ్‌ ఏందే నోర్ముయ్‌ బగ్గ మ్లాడుతున్నావ్‌” అని కోపంగా అధికారయుతంగా అన్న రాజాగౌడ్‌, మళ్ళీ తానే
” నీ గురించి నాకు జెప్పాల్నా? నాకు తెల్వదాయె, ఎవర్ని నిలబెట్టాల్నో నువ్వేం ఫికర్‌బడకు, నువ్వు సర్పంచ్‌ అవుతవ్‌, నీ వెనక నేనున్నా గదా, అంతా నేను జూసుకుందా ‘ అంటూ సముదాయించాడు. భరోసా యిచ్చాడు. అందువల్లనో రాజాగౌడ్‌, అంటే ఉన్న భయంతోనో కోపంతోనో కానీ పోశవ్వ మరి మాట్లాడలేదు. రాజాగౌడ్‌, అతని అనుచరులు దర్పంగా, హుందాగా తామే అసలు అభ్యర్థులమన్నంత ధీమాగా వెళ్ళి కుర్చీలో కూర్చుని నామినేషన్‌ పత్రాలు నింపుతూ ఉంటే అసలు అభ్యర్థి అయిన పోశవ్వ మాత్రం తలుపు వెనుక నిలబడి వాళ్ళేం చేస్తున్నారని భయం భయంగా చూస్తూ వాళ్ళు చూపిన చోట నిశానీ వేసింది.

జోగుపోశవ్వ అభ్యర్థి కావడం ఆ ఊర్లోనే కాకుండా చుట్టు పక్కల ఊర్లలోనేకాదు జిల్లాలోనే సంచలన వార్త అయ్యింది. జనరల్‌ మహిళపై జోగినీ మహిళ అంటూ ఫోటో తో  సహా పత్రికలు ప్రచురించాయి. ఆసక్తికరంగా కథనాలు వెలువడ్డాయి.

ఆప్ట్రాల్‌ ఒక జోగుది నా భార్యతో పోటో  పడడమా ఒక వేళ ఆమె చేతిలో ఓడిపోతే అమ్మో తన పరువు ప్రతిష్టలేం కాను, గౌరవ మర్యాదలేం కాను? ఎంత ఖర్చు అయినా సరే తన భార్య వకుళాదేవిని సర్పంచ్‌గా గెలిపించాలి అనుకున్న జానారెడ్డి హైదరాబాద్‌లో ఉండే వకుళాదేవిని పిలిపించాడు. మకాం ఇక్కడే వేయించాడు. ఇంటికి  తిరిగి బొట్టు పెట్టించి  ఆమెతో ఓట్లు వేయమని అడిగించాడు. కులాల వారీగా ఆయా కుల పెద్దలతో మీటింగ్ లు . ఆయా కులసంఘాలకు కొంత డొనేషన్లు ఇచ్చాడు. ఆయా కులాలఓట్లు తమకు అనుకూలంగా వేయాలని హామీలు తీసుకున్నాడు.

రాజాగౌడ్‌ ప్రచారం మరో రకంగా సాగింది. తను తనకోసం కాదని, తను కావాలనుకుంటే తన కుటుంబ సభ్యులో తన బంధువులో నిలబెట్టేవాడిననీ, అణగారిన, అట్టడుగు వర్గాల మహిళలను  దించి ఖర్చంతా తాను భరిస్తున్నానంటే తన మంచితనాన్ని, మహిళల పట్ల తనకున్న ప్రత్యేక భావాన్ని, నిస్వార్ధపరత్వాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాడు. వకుళాదేవి పెద్దిం ఆడపడుచే కావచ్చు. ఆమె పట్నం లోనే ఉండవచ్చు. ఆమె చదువుకున్నదే కావచ్చు. ఆమెకు చాలా విషయాలు తెల్సి ఉండవచ్చు. కానీ ఎప్పుడూ పట్నంలో ఉండే ఆమెకు మన పల్లె ప్రజల సమస్యలేమిటో  అసలే తెలీదు. ఎప్పుడూ తెల్సుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడామే గెలిచినా పట్నంలో ఉంటుంది. ఆమె పేరు మీద అప్పుడప్పుడూ చుట్టం చూపుగా వచ్చే జానారెడ్డి సర్పంచుగిరీ వెలగబెడతానాండు. మనకు అందుబాటులో ఉండని జానారెడ్డి కుటుంబాన్ని గెల్పిస్తారా..? లేకపోతే, ఎప్పుడూ మనకు అందుబాటులో ఉండే పోశవ్వను గెలిపిస్తారో… మీ ఇష్టం. మీరు అనుకోవచ్చు. పోశవ్వకేం తెల్సు. ఆ మాదిగదానికి సర్పంచ్‌గిరి ఏమిటని, నిజమే, ఆమెకి ఏమీ తెలియదు.

అయితే ఆమె వెనుక నేనున్నాను. గ్రామం మంచి చెడూ తెల్సిన వాడిని కదా… పోశవ్వకి ఓటు వేశారంటే, అది నాకు వేసినట్టే, నన్ను గెల్పించినట్లే అనుకోండి. ప్రజలను ఏ విధంగా కన్విన్స్‌ చేయాలో, ఎవరితో ఏ విధంగా మ్లాడి ఓట్లు రాల్చుకోవాలో రాజాగౌడ్‌కి తెల్సినంతగా జానారెడ్డికి తెలియదు.

ఎలక్షన్‌కి నాలుగు రోజులముందు నుండి కల్లు, సారా ప్రవహింపజేశాడు. తాగిన వాళ్ళకు తాగినంత.
ఓ రోజు, ఎలక్షన్‌ రెండు రోజులుందనగా, ప్రచారం ఉధృతంగా జరుగుతున్న సమయంలో అనుకోని విధంగా జరిగిందా సంఘటన.
”ఓసే జోగు పోశా… జోగుసాయా….” అంటూ వచ్చారు మాల పెద్దలు లస్మయ్య, ఎల్లయ్య. ”మంచిగా రానీన్రి మాట” నిదానంగా అన్నా స్పష్టంగా చెప్పింది పోశవ్వ. జోగు పోశవ్వ, జోగు సాయవ్వ అని అనడంతో.
”ఏందే గిట్లచ్చిన్రు” మర్యాదగా సాయవ్వ పలకరింపు.

– శాంతి ప్రబోధ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)