నెలద (ధారావాహిక ) -సుమన కోడూరి

అంతేకాదు రాజుగారి మరణానంతరం తాను ధైర్యంగా పాలనాధికారాన్ని వహించటమే కాక అన్ని పాలనాపరమైన విషయాలపై పట్టు బిగించినట్లు అనిపిస్తోంది . తన వర్గం ఒకటి సృష్టించుకున్నది . పాత సలహాదారులు , నమ్మకస్తులు రాజుగారితో ఎంతో జీవితాన్ని కలిసి గడిపిన వారందరికీ ఉద్వాసన పలికింది . ఆమె కుటుంబీకులు అన్నలు , తమ్ముళ్లూ తన మేనమామలు వంటి బంధు వర్గాన్ని రాజ ప్రసాదంతో రాచరికపు ఉద్యోగులుగా నియమించుకున్నది . సుధేష్ణా దేవి కనుసన్నలలోనే ధాన్య కటకం ,విజయ వాటి , కృష్ణా తీరమంతా ప్రస్తుతం నడుస్తున్నది .అదే సమయంలో సైన్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తో అధిక సంఖ్యలో యుద్ధ శిక్షణలు ఇస్తోందట . రధ , గజ , తురగ, పదాతి దళాలను పెంపొందించుకుని రాబోయే కాలంలో ఎటువంటి దాడులనైనా ఎదుర్కొనే విధంగా వ్యూహాన్ని రచించుకుని సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది . యువరాజు వివాహ వయస్సు వచ్చినప్పటికీ ఎందుకో ఆ ప్రయత్నాలేం చేయటం లేదని ప్రజలను కుంటున్నారు . యువరాజు రాజ్యంలో లేరనీ దేశాటన వెళ్లారని కొందరు నమ్మకస్థులు తెలిపారు .

ఆలయానికి ప్రతి శనివారమూ విచ్చేయటం శ్రీకాకుళాంద్ర మహా విష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించటంలో మాత్రం ఆమెకామే సాటి ఆలయ నిర్వహణలో ఏ ఇబ్బంది రాకూడదని చిన్ని సమస్య అయినా తనని తప్పక సంప్రదించమని సమయం కేటాయించారు .

ఆ విషయం మీదే ఈ వైశాఖ పూర్ణిమ నుంచి జరిపే ఉత్సవాల వివరించేందుకు వెళ్లాను అపుడు మీరు రాజు గారి పక్షపాతి రాజువారి ఆంతరంగిక విషయాలు ఎరిగిన వారు అంటూ పరుషంగా మాటాడారు .

నేను రాజ పురోహితుల వంశీకునిగా మీ క్షేమం ధ్యేయంగా జీవిస్తున్నాను . ఆంతరంగిక విషయాల్లో జోక్యం నేనెపుడూ చేసుకోలేదని సున్నితంగా వివరించాను . శాంతించినట్లు కన్పించినా సందేహిస్తున్నట్లు కూడా అన్పించింది . నాపై కూడా వేగులను నియమించిందే మోనని చాలా కంగారు పడ్డాను కానీ కొంత పరిశీలించిన మీదట అలాటిదేం లేదని రూడీ చేసుకున్నాక మీ వద్దకు వచ్చాను అన్నారు ఆచార్యులు .

మీ మాటలు వింటుంటే భయం వేస్తోంది . నెలద చాలా ధైర్యశాలి కానీ కయ్యానికి ముందుండటం నాకు నచ్చని విషయం . రాణీ వారి వ్యూహాలు ఫలించి మా ఉనికి తెలిసిపోతే నా బిడ్డలను నిర్దాక్షిణ్యంగా ……..

హా … ఆ ఆలోచనే నాకు మరణ ప్రాయంగా ఉన్నది ఏడుస్తూ వణికే గొంతుతో రెండు చెవులూ మూసుకుని అన్నది ప్రియంవద .
అయ్యో అంత దూరాలోచన వేదన వద్దు తల్లీ వారి నిఘా నేత్రాలు కృష్ణా గోదావరీ తీరాలలోనే ఉన్నట్లు తెలిసింది . హంసల దీవి వేణు గోపాల స్వామి ఆలయంలో గత మాఘమాస పూర్ణిమ నాడు నాట్యం చేసిన ఒక అనామకురాలైన నాట్య కత్తెను ఈ విషయంలో సందేహించి పరీక్షించిందట . ఆమె పలనాటి ప్రాంతం నుంచి పొట్ట చేత పట్టుకొచ్చిన యువతీ అని తేలిందట “సీమ” ప్రాంతం గురించి రాణి గారికి అవగాహన లేదు .

విజయనగరం, కళింగ రాజ్యాలకు సమీప ప్రాంతం ఒడిష గజపతులు ద్వారమైన గదగ్ వంటి ప్రాంతాలను ఆమె అనుమానిస్తోంది . మీరు కుడా ఏ పరాయి ప్రాంతాలకో వలస వెళ్లి ఉంటారని లేదా బ్రతుకు పై విరక్తితో బలవన్మరణం పొండి ఉంటారనో నమ్మకంగా అనుకుంటోంది .

                          తాను రెండవ ఆలోచననే స్థిర పరచుకున్నదని తెలిస్తే అయినా బావుణ్ణు . నీ బిడ్డలకు ఏ హానీ ఉండకుండా అన్నది ప్రియంవద .

ఏమాత్రం సందేహాస్పద విషయం ఉన్నా తప్పక కబురు పంపుతాను . మన పారావతం (పావురం ) ద్వారా మీరూ ఈ విషయాలు దృష్టిలో ఉంచుకోండి భయపడ వలసినంత ప్రమాదం ఏం లేదు అన్నారు ఆచార్యులు .

                ఒక పళ్ళెరంలో పాలతో వేసి ఉంచిన అటుకులున్న పాత్ర రెండు అరటి పళ్ళు తీసుకు వచ్చి ఆచార్యుల వారికి అందించాడు (చెంది ) రమణ .

                          మాటలతో ఉండిపోయి సమయం గమనించ లేదు మన్నించండి స్వామీ దయ చేసి ఆరగించండి అన్నది ప్రియంవద .

అయ్యో తల్లీ నారాక కోసం ఎంత ఆతుతతో ఎదురు చుస్తుంటావో ఎరుగుదును నీ  తల్లి మనసు బిడ్డలకేం ఆపద వాటిల్లుతుందో నని ప్రతి క్షణం తల్లడిల్లుతూ ఉంటుంది . కృష్ణ సింహ మోహనుడు దైవ సాక్షిగా వివాహమాడి కన్న బిడ్డలైన నెలద , హేమవర్ధనులకు ఆ దైవమే అండ దండ గా ఉంటాడు . ఆదైవ ప్రతినిధిగా సేవకునిగా మంచి తనాన్ని మానవత్వాన్ని కాపాడేందుకు నేనూ అనుక్షణం అప్రమత్తంగా ఉండగలవాడను . మీరు ఏ మానసిక విచారమూ పొందక విరామంగా ఉండండి వారికున్నది మీరే ధైర్యం చెప్పవలసిందీ మార్గం నిర్దేశించవలసినదీ మీరే మరవద్దు . అవసరం కల్గిందని అన్పిస్తే తప్పక పిల్లలకు వారి జన్మ రహస్యాన్ని విడమరచి చెప్పండి . అసలు ఇంత వరకు దాచవలసినది కాదు . మించినదేం లేదు ఫర్వాలేదు . ఇపుడు పిల్లలు వారి రక్షణ వారు చూసుకోవటమే కాక దేశ రక్షణ కూడా చేయగల సమర్దులైనారు . విచారించనవసరం లేదు . మీరు కూడా మాతో కలిసి ఏవైనా తినందమ్మా అన్నారు ఆచార్యులవారు .

                       తెలుసు స్వామీ మీరు వచ్చి ఇలా ధైర్యం చెప్పిన రోజున అమ్మ కడుపు నిండా తింటారు అని అందుకే తనకీ తెచ్చాను అన్నాడు .

                              ప్రియంవదా రమణ ణీ కోసమే పుట్టాడు దైవ సంకల్పంగా ణీ చెంత చేరాడు అంత అనురాగం , శ్రద్ధా శక్తులు , నేటి కాలమున కన్న బిడ్డలు కూడా చూపటం లేదంటే నమ్ము అన్నాడు .

ప్రియంవద నిజమే అన్నట్లు నవ్వుతూ తలూపింది ……..

(ఇంకా ఉంది )

-సుమన కోడూరి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , Permalink

Comments are closed.