ఎనిమిదో అడుగు-43(ధారావాహిక చివరి భాగం)–అంగులూరి అంజనీ దేవి

Anguluri Anjani devi

Anguluri Anjani devi

‘‘అవును వాళ్లు కేవలం  బ్రతుకుతున్నారు. జీవించటం లేదు…. బ్రతకటం వేరు, జీవించటం వేరు. ప్రపంచానికి తెలియకుండా మనసులో ఫీలవుతూ బ్రతికే కోట్లాది మందిలో వాళ్లొకరు.. నిజానికి ఎంతమంది భర్తలు  భార్యకి ఆనందాన్ని ఇస్తున్నారు? భార్య నుండి పొందుతున్నారు? 90% భార్యాలు ,భర్తలు  ఏ ఉద్వేగ, ఉద్రేకాలు  లేకుండా గౌరవంగా, గంభీరంగా, గుంభనగా, యాంత్రికంగా తమ దాంపత్య జీవితాన్ని సాగిస్తుంటారు. భార్యలు  భర్తలో ఏం కోరుకుంటారో కొంతమంది భర్తకు తెలియదు. తెలిసినా నటిస్తారు. సాధ్యం కాక, సామర్థ్యం లేక… భర్తలు  భార్యలో ఏం కోరుకుంటారో కొంతమంది భార్యకి తెలియదు. తెలిసినా నటిస్తూ, సాధిస్తూ వుంటారు. ఒకరి కోరికల్ని ఒకరు పట్టించుకోరు. ఒకరి అభిరుచుల్ని ఒకరు గౌరవించుకోరు. ఏ శిక్షణ లేకుండా అతి సహజంగా, అతి మధురంగా జరగవలసిన ఈ సృష్టి క్రియను నిర్లక్ష్యం చేసుకుంటూ ఒకరినొకరు అవమానించుకుంటూ ఆ తర్వాత ఇతరు ద్వారా అవమానాలు పొందుతుంటారు.’’ అంది స్నేహిత.

ఈసారి మరింత విభ్రమతో చూసింది ధీరజ.‘‘పిల్లలు  పుట్టటమే జీవిత పరమార్థం కాదు. అలా అని పిల్లలు  వద్దని కాదు, పిల్లలు  కావాలి కానీ భార్య, భర్త అన్నాక ఒకరి నొకరు వేలెత్తి చూపుకోకుండా, పొసుగా మాట్లాడుకోకుండా నిత్యం ముద్దూ, ముచ్చటతో ఒకరినొకరు అభిషేకించుకోవాలి. ఒకరినొకరు నీరాజం పట్టుకోవాలి.’’ అంది స్నేహిత.

స్నేహిత మాటలు  బాగా నచ్చి ‘‘అక్కా ! నువ్వా ఐరన్‌ బాక్స్‌ పక్కన పెట్టి ఇలా వచ్చి నిలబడు. నీకు ఒక్కటి ఇస్తాను.’’ అంది.
ఐరన్‌ బాక్స్‌ పక్కన పెట్టి ‘ఏమిస్తావ్‌?’ అంది నిలబడి స్నేహిత.

వెంటనే స్నేహితను హగ్‌ చేసుకొని, స్నేహిత బుగ్గవిూద ముద్దుపెట్టు కొంది ధీరజ. ఈ లోపల  అరోప్‌ గుర్తొచి, అరోప్‌ ఎక్కడున్నాడో అని బయటకు చూసి వెంటనే ‘అరోప్‌’ అంటూ కేకేసింది ధీరజ. అరోప్‌ సడన్‌గా సైకిల్‌ని టర్న తిప్పి ఏమిటన్నట్లు ధీరజ వైపు చూశాడు. ధీరజ అరోప్‌ని అలా ఎందుకు పిలించిందో స్నేహితకు అర్థం కాక గబగబ రెండు అడుగు ముందుకి వేసి ఒడ్డును తాకి వెనక్కి వెళ్లి ఆగిన అలా నిలబడ్డారు .

కారుదిగి లోపకి వస్తున్న భువనేష్‌ని అరోప్‌కి చూపిస్తూ ‘‘అరోప్‌! మీ నాన్న గారు వస్తున్నారు చూడు.’’ అంది ధీరజ భూవనేష్‌ని ఎప్పటి నుండో చూసిన దానిలా…

భువనేష్‌కి అర్థం కాలేదు. ఈ అమ్మాయికి నేనెలా తెలుసు  అనుకుంటున్నాడు. కానీ ‘విూ నాన్న గారు’ అన్నపదం భువనేష్‌ ఎదను తాకి, పురివిప్పి ఆనందనాట్యం చేస్తున్న నెమలి లా ఫీలయ్యాడు. ‘నాన్న’ అన్న పదాన్ని మించిన పదం లేదు. ఒక మగవాడికి ఆపదం ఇచ్చే తృప్తి ఎందులోనూ రాదు….

అయినా అరోప్‌కి తండ్రి తనే అని ఈ అమ్మాయికి ఎలా తెలుసు  అన్న అనుమానం మళ్లీ రాగా. ‘డాడీ!’ అంటూ చేతిలో వున్న సైకిల్‌ కిందపడేసి ఒక్కవుదుటున వెళ్లి భువనేష్‌ని చుట్టుకున్నాడు అరోప్‌ . వెంటనే అరోప్‌ని ఎత్తుకొని లోపకి నడుచుకుంటూ వస్తున్న భర్తను చూస్తూ శ్పింలా నిబడిరది స్నేహిత.

స్నేహితకి ఒక అడుగు దూరంలో నిబడి ఆమెనే చూస్తూ చాలా ఇష్టపూర్వకంగా ‘‘బాగున్నావా స్నేహితా?’’ అన్నాడు భువనేష్‌.
స్నేహిత ఒక ఇంచి కూడా కదకుండా అక్కడే నిబడి ‘ఊ’ అంది. ఈ లోపల  ధీరజ అరోప్‌ను తీసుకొని కిచెన్‌ లోకి వెళ్లింది.
భువనేష్‌ కళ్లు చుట్టూ కలియజూశాయి.

ఎదురుగా వున్న టేబుల్‌ మిాద తను స్నేహితతో కలిసి దిగిన డిజిటల్‌ ఫోటో అతిదుల్నిఆహ్వానిస్తున్నట్లు అందంగా కన్పిస్తోంది. అప్పుడు అర్థమైంది భువనేష్‌కి తనే అరోప్‌ తండ్రి అని ఆ అమ్మాయికి ఎలా తెలిసిందో!! ‘‘నిన్నూ, బాబును మన ఇంటికి తీసికెళ్తామని వచ్చాను స్నేహా!’’ అన్నాడు సోఫాలో కూర్చుంటూ భువనేష్‌. కోపంగా చూస్తూ ‘‘ఎందుకు డి.ఎన్‌.ఎ. టెస్ట్‌ చేయించటానికా?’’ అంది స్నేహిత. ‘‘కాదు. అరోప్‌ని నా బిడ్డగా భావిస్తున్నాను. దానికి ఎలాంటి టెస్ట్‌ అవసరం లేదు. వాడు నా బిడ్డే… అరోప్‌ వల్ల  సమాజంలో ఒక తండ్రిగా నాకెంత గౌరవం పెరిగిందో నాకు తొసు. దానికి కారణం నువ్వే… కేవలం  నన్ను కాపాడటం కోసమే నువ్వు ఒక నిజాన్ని సమాధి చేసి, ధైర్యం చేసి, మంచి నిర్ణయం తీసుకున్నావు. అందుకు నేను నీకు థ్యాంక్స్‌ చెప్పుకోవాలి. ఇకముందు నా ప్రతి అడుగు నీతోనే.. ప్రతి అనుభవం, ప్రతి ఆలోచన నీతోనే పంచుకుంటాను. నీ మిాద గౌరవంతో, ఇష్టంతో అంటున్న మాటు ఇవి… నువ్వు నాకు కావాలి. నాతోరా! వెళ్దాం! ప్లీజ్‌!’’ అన్నాడు భువనేష్‌.

‘‘అలా రావటం కుదరదు.’’ అంది స్నేహిత.
అదిరిపాటును అణుచుకుంటూ ‘‘ఎందుకు?’’ అన్నాడు.
‘‘ఇక్కడ ధీరజకు ఇబ్బంది అవుతుంది?’’ అంది.

తేలిగ్గా ఊపిరి ప్చీుకొని ‘‘ఓ… అదా! నేను నీ ప్లేస్‌లో ఎవరో ఒకర్ని వెంటనే ఏర్పాటు చేస్తాను! నువ్విప్పుడు బాబును తీసుకొని నాతో బయలు దేరు. ఇంట్లోవాళ్లు మన కోసం ఎదురు చూస్తున్నారు.’’ అన్నాడు.

‘‘అక్కడ కొచ్చాక ` ఆ ఇంట్లో నేను మళ్లీ అదే ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తుందేమో! నన్నిలాగే వుండనివ్వండి!’’ అంది… ఒక మనిషిలో జెనిటెకల్‌గా గొప్ప క్షణాలు వచ్చినా, వాతావరణ ప్రభావం వ్ల ఆ క్షణాలు  సంకుచితంగా మారే అవకాశాలు  వున్నాయని అరోప్‌ని అలాంటి వాతారణానికి దూరంగా వుంచాని.. అదే ఆమె తాపత్రయం. అదే ఆమె ఉద్దేశ్యం.

కానీ అతను ఎటో చూస్తూ ‘‘మనం ఇకముందు ఇక్కడ వుండటం లేదు. నన్ను మా కంపెనీ తరుపున విజయవాడ పంపుతున్నారు. ఇకముందు మనం వుండబోయేది విజయవాడలో….’’అన్నాడు. నిజానికి అలా వెళ్లాని అతనే నిర్ణయించుకున్నాడని ఎవరికీ తెలియదు. కొన్ని నిజాలను  సమాధి చెయ్యటం వల్ల  పదిమంది సంతోషిస్తారని తెలిసినప్పుడు అలా చెయ్యటం తప్పు కాదనుకున్నాడు.

స్నేహిత మౌనంగా చూస్తోంది. స్నేహిత వైపు స్థిరంగా చూస్తూ… ‘‘చూడు స్నేహ! పెళ్లిలో మంత్రాలు  చదువుతూ భర్తతో భార్యను ఏడు అడుగు నడిపిస్తారు. ఆ అడుగు కోసం చదివే మంత్రాలు   శక్తివంతమైనవి. శాస్త్రోక్తమైనవి. కానీ నువ్వు ఏ మంత్రాలు  లేకుండా, ఏ శాస్త్రం చెప్పకుండా శక్తివంతమైన అడుగువేశావు. అది నువ్వు వేసిన ఎనిమిదవ అడుగు. ఆ అడుగు వల్ల  అరోప్‌ రూపంలో అద్భుతమైన సృష్టి జరిగి అరోప్‌ వచ్చాడు. మన వంశాంకురమై నిలిచాడు. అంతేకాని ప్రపంచ వినాశం జరగలేదు. నువ్వు చేసింది నా దృష్టిలో తప్పుకాదు.’’ అన్నాడు భువనేష్‌.

అరోప్‌తో కారెక్కి కూర్చుంటూ ‘‘ఒకసారి కాత్యాయని బామ్మతో కసి వెళ్దామండీ!’’ అంది స్నేహిత. ‘‘అలాగే… అంటూ కుడి చేత్తో స్టీరింగ్‌ పట్టుకొని ఎడం చేత్తో అరోప్‌  చుంభించి వదిలాడు.

కారు రోడ్డుపై స్మూత్‌గా ప్రయాణిస్తోంది.

– అంగులూరి అంజనీ దేవి

@@@ సమాప్తం @@@

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో