బోయ్‌ ఫ్రెండ్‌ – 27 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

”మీరు వచ్చి వెళ్ళారట నేను హాస్టలులో లేను. ఏమైనా చెప్పాల్సింది వుందా?”
అవతల కంఠం ఒక్క క్షణం తటపారుంచింది.

”ఏమీ లేదు. మిమ్మల్ని ఒక్కమారు చూడాలని పించింది. అదీ కాక మితో ఒక ముఖ్య విషయం మ్లాడాలి. నేను రేపు సాయంత్రం వస్తేమికేం అభ్యంతరం లేదు గదా?”

”లేదు లేదు” అంతకంటే మరేమి మ్లాడలేక ఫోన్‌ పెట్టేసి అక్కడే కుర్చీలో కూలబడి పోరుంది కృష్ణ. అతనిని తలచుకోగానే తనెందుకిలా చలించిపోతుందో, అతనికి ఎదురు పడాలంటే తనలో ఇంత నిస్సత్తువ ఎందుకు కలుగుతుందో ఆమెకు బోధపడడం లేదు.

మర్నాడు సాయంత్రం చైతన్య వచ్చే టైమ్‌ దగ్గర పడే కొలదీ కృష్ణకు ఏమిో మనస్సు నిలకడ లేకుండా చాలా గజిబిజిగా గందర గోళంగా, వున్నట్లనిపించింది. వెంటనే లేచి శిరీష గదిలోకి నడిచిందామె. ఒంటరి తనాన్నుండి నిశ్శబ్దాన్నుండి పారిపోవాలను కుంటే శిరి గదిలో కావాల్సినంత రణగొణధ్వని దొరుకుతుంది. ఎప్పుడూ ఎవరితో ఒకరితో వాదిస్తూనో, ప్రతిపాదనలు చేస్తూనో వుంటుంది శిరి.

కృష్ణ రూమ్‌లో అడుగు పెట్టగానే అంతవరకు చదువుతున్న వారపత్రిక టక్కున మూసేసి విసురుగా బల్లకేసి క్టొింది జ్యోతి.
”ఇక లాభం లేదు. సృష్టి విధానం మార్చేయాలి”

కృష్ణ పక్కున నవ్వి ”దాందేముంది ‘బర్త్‌ ఆఫీస్‌ హెడ్‌’ బ్రహ్మగారికి ఓ అప్లికేషన్‌ పడేసుకుంటే పోయె” అంటూ తీరిగ్గా శిరి ప్రక్కన కూర్చుంది. జ్యోతికి అంత కోపం తెప్పించిన కధ తను చదివిన కధే. ‘ఇష్టం లేని పెళ్ళి చేసారనే కసితో భార్యను హింసిస్తూాండు భర్త. భర్త పర స్త్రీ వ్యామోహంలో పడ్డాడనే అనుమానంతో ఆత్మహత్య చేసుకుంటుంది.భార్య. చాలా మామూలు కధే- అరునా ఆ కధను తలచుకోగానే శిరికి పెద్దక్క గుర్తుకొచ్చింది. ఆమెది అదే కధ కాకపోరునా అలాి కధే- ఉద్రేకంగా అంది శిరి.

”నిజం కృష్ణా! ఈ సృష్టిలో స్త్రీ పురుషుల ఆకర్షణ అనేదే లేకపోతే ఎంతైనా శాంతిగా వుండేది. ”తెల్లబోరుంది కృష్ణ.
”మరి సృష్టి అంతితో ఆగిపోదూ?”
ఒక్క క్షణం ఆలోచించింది శిరి.

”మీరు నవ్వకపోతే నా ఊహలు విన్పిస్తాను.””చెప్పు చెప్పు” ఉషారు చేసింది జ్యోతి.
”నవ్వకూడదు మరి. సరదాకే అనుకోండి పోనీ” అని చెప్పసాగింది శిరి.

”నా కన్పిస్తుంది. నాకే అధికారాలుంటే ఈ సృష్ఠి విధానాన్నే మార్చేయాలని. నేనే యాక్టింగ్‌ బ్రహ్మనరుతే ఏమి చేసుండేదాన్నో తెలుసా?” అని ఎవరైనా నవ్వుతున్నారేమో నని క్షణం ఆగి మరలా మొదల్టెింది సిరి.

”స్త్రీ పురుషులను సృష్టిస్తాను. కానీ వాళ్ళలో సృష్టి మూలమైన ఆకర్షణలను వుంచను. స్త్రీకి అవయవ నిర్మాణంలోనే కొంత వయస్సు వచ్చాక పిల్లలను ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని సృష్టిస్తాను. అదీ లిమిటెడ్‌. మొది పంట మొగపిల్లాడు రెండో పంట ఆడపిల్ల. బస్‌. వాళ్ళిద్దరూ ఒక కుటుంబం. ఇకపోతే పురుషుడికి స్త్రీకి ఆమె తాలూకు పిల్లల్ని పోషించడానికి కావలసిన మెదడును అమరుస్తాను. ఆమె, ఆమె పిల్లలు, నేను ఇదీ నా సంసారం అనే భావం తప్ప మరే ఆకర్షణకీ అతని బుఱ్ఱలో తావుండకూడదు.”

” ఎవరు ఎవరి తాలూకు అనేది ఎలా నిర్ణరుంచడం?”
తన ధర్మసందేహాన్ని బయటప్టిెంది పద్మ.

”ఆ సమస్యకు తావేలేదు పద్మా ! చెప్తాను. ఒక స్త్రీకి పుట్టే పిల్లలు ఒకరు పురుషుడు, ఒకరు స్త్రీ. పురుషుడు ఇంి యజమాని స్త్రీ ఆ ఇంటి  యజమానురాలు. పిల్లలు ఆ ఇంటి  భావి యజమానులు.”

”ఒకే రక్తం పంచుకుని ప్టుిన అన్నా చెల్లెలు భార్యభర్తలు కావడమా?” పద్మ ఆశ్చర్యంగా చూసింది.

”ఏం, మేనత్త కూతుర్ని అక్క కూతుర్ని చేసుకోవడం లేదా? ఒకే రక్తం కాదా! ఏది అలవాటరుతే అదే కాలానికి సహజమవుతుంది. రెండు ముక్కులుండే మనిషి మన కెప్పుడైనా కనపడితే చిత్రంగా చూస్తాం. అందరికీ సృష్టిలోనే రెండు ముక్కులుంటే అది సాధారణమైపోతుంది.”
నవ్వింది జ్యోతి. శిరి ఊహా ప్రపంచానికి.

”నవ్వకు చెప్పనీ” వారించింది కృష్ణ. ”అప్పుడు కృష్ణా ! ప్రపంచంనిండా శాంతే. ఎక్కడ చూసినా నిశ్చింత. అసలు కలతలంటూ వుాంయా? ఈమె నాది, ఈమె పిల్లలు నా పిల్లలు. ఇదంతా నాది అనుకుని నాదీ అనే స్వార్థంతో తన భార్యను, పిల్లలని, చేర్చుకున్న పురుషుని వల్ల స్త్రీ పొందే అసంతృప్తి అంటూ ఏమైనా వుంటుందా?”
చెప్తున్న శిరికి అడ్డుపడుతూ అంది జ్యోతి.

”ఏమో ! అందరు మొగాళ్ళు ఒక్కలాగ వుాంరా? పిల్లలనీ స్త్రీని పోషించకపోతే!”

”లేదు జ్యోతీ. నేను సృష్టించే మగాడు అలాి వాడు ఏనాికి కాడు. తల్లి ఏనాడూ బిడ్డల్ని వేరుగా చూడదు. అచ్చు మాతృమూర్తి మమకారాన్నే అతనిలో నింపుతాను.

”అవును జ్యోతి. ఇతర ఆకర్షణలే లేని మగాడికి తన చిన్న కుీరమే తన ‘పర్సనల్‌’ ఆనందమైనప్పుడు భార్యను హింసించే ప్రశ్నే లేదు” కృష్ణ కలుగజేసుకుంది.
పద్మ మరో ధర్మసందేహం బయటప్టిెంది.

”నిజమే. మీరన్నట్టు అప్పుడు స్త్రీకి పెద్ద అశాంతి నుండి అనుమానాల నుండి ప్రతి క్షణం భర్తను కాపలా కాచుకోవడం నుండి విముక్తి కలుగుతుంది. ఒప్పుకుాంను కానీ మగాడి తాలూకు కొన్ని బలహీతనలు, త్రాగుడు, జూదంలాి వాి వల్ల కూడా ఈ రోజుల్లో స్త్రీ కి శాంతిలేకుండా పోరుందనే విషయం గుర్తుంచుకోవాలి.”
నవ్వింది శిరి.

”లేదు పద్మా. చెప్పానుగా నా ఊహాసృష్టి, నా ముద్దు బిడ్డ….మగాడిని నువ్వెందుకలా ఊహించుకుంటున్నావు? నా సృష్టి బంగారు కొండ. వాడికి అలాి బలహీనతలుండవ్‌. అసలింతకీ రకరకాల మత్తుపానీయాలు తయారు చేసే మేధా సంపత్తి, మనిషిని బానిసగా చేసే ఆటలు సృష్టించే ‘రీసెర్చ్‌మైండ్‌’ నా సృష్టిలో ఎవ్వరికీ వుండదు. ఒక వేళ పొరపాటున ఎవరికైనా అలాి పురుగు తొలిచిందంటే వెంటనే వాడిని యమ సదనానికి ాన్స్‌ఫర్‌ చేసి ఆసంగతేదో ‘డెత్‌ ఆఫీస్‌ హెడ్‌’ కే వదిలేస్తాం.””ఎప్పుడొచ్చారు?”

– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో