ప్రతిభకు పేదరికం అడ్డం కాదని చెప్పే నవల- ‘ఇరులు విరులు ’- పోలినాటి బాలకృష్ణ

ISSN 2278-478

కొలకలూరి ఇనాక్‌ గుంటూరు జిల్లాలో వేజెండ్ల గ్రామంలో జన్మించారు. ప్రాథమిక, ఉన్నత విద్యల్ని గుంటూరు జిల్లాలోనే పూర్తి చేశారు. కళాశాల విద్యను ఆంధ్రాయూనివర్సిటీ లోను,శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాయం నుండి డాక్టరేట్‌ పట్టాను పొందారు. వీరు అతిచిన్న వయస్సులోనే, అనేక కళాశాలో అధ్యాపక వృత్తిని చేపట్టి 250కి పైగా కథానికలు సమత, సౌభాగ్యవతి,ఇరులు విరులు , ఎక్కడుంది ప్రశాంతి, రెండు కళ్లు మూడు కాళ్లు, సర్కారు గడ్డి, అనంత జీవనం వంటి నవలలు , జైహింద్‌, కీ మొదగునవి నాటకాలు అనేక వ్యాసాలను రచించారు. వీరు రచించిన నవలలో పేదరికం అడ్డుకాదని చెప్పే నవల ఇరులు విరులు లోని విషయాన్ని పరిశీలించడం నా పరిశోధన పత్ర పరమార్థం

‘ఇరులు – విరులు ’నవల ప్రారంభంలో సాయంకాలం సమయంలో సముద్రాన్ని అక్కడే ఉన్న రమ పాత్రను కింది విధంగా వర్ణిస్తాడు రచయిత.

ఆకాశం నల్లని కాగితం మీద తెల్లని నక్షత్రాల చుక్కలతో అంతు తెలియని త్రిభుజాల గేయాలనుకునే పసివాళ్ల ఊహలాగ ఉంది. ఏ చిత్రకారుడో కప్పుకొన్న నల్లరంగు జరీ, నేపాయి బుడగు పడ్డట్టు సముద్ర నీటిమీద నక్షత్రాలు వెలుతురు కనబడుతూ ఉంది.నిలకడలేని నీటిమీద నక్షత్రా ప్రతిబింబం ఉయ్యాలూగుతూ ఉన్నాయి. సముద్రం ఒడ్డున దూరంగా గుబురు చెట్ల మాటున పల్లెవాళ్లు చలికాగుతున్న కనిపించని మంటు రంగు పొగ ఆకాశమనే ఆధునిక చిత్రకళా ఖండానికి అడుగున ఎవరో భక్తుడు వెలిగించిన అగరొత్తు ధూపంలాగా ఉంది.

హాస్టల్ కు అంత దూరంగా, సాధారణంగా ఏ యువతీ రాని తావుకు వచ్చి మామూలుగా అంతరాత్రి వరకు బీచ్‌లో ఎవరూ ఉండనంత సేపు ఒంటరిగా ఉండి, భయాన్ని నేల మైలు లోతున పాతిపెట్టి తనను తాను మరచిపోయి, కూర్చొని ఉంది. ఎం,ఏ స్టూడెంట్‌ రమ. సమస్య వచ్చినప్పుడు ఏకాంతంగా ప్రశాంత ప్రకృతిలో సేద దీరితే కొంత ఉపశమనం కలుగుతుందని నమ్మకంతో ఆమె ఒంటరిగా సముద్రం ఒడ్డున సమస్యల్ని నెమరువేసుకుంటుంది. వాటి పరిష్కార మార్గాన్ని అన్వేషించే పనిలో పడుతుంది.

విశాఖపట్నంలో మహారాణీపేటలో యూనివర్సిటీ విద్యార్థినీ, విద్యార్థు జీవితాన్ని చిత్రిస్తుందీ నవల . ఈ నవలలో ప్రధానంగా దళిత విద్యార్థినీ, విద్యార్థులు వారి అగచాట్లు కష్టాలు , లేనితనం, ఆర్థిక సమస్యు చోటుచేసుకున్నాయి.

రమ దళిత విద్యార్థిని. ఈమె డిగ్రీలో సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీస్‌ నుంచి వచ్చిన స్కాలర్‌షిప్‌తో చదువుకొని డిగ్రీలో మంచి మార్కులతో పాస్‌ అయిన విద్యార్థిని, రమ ఎమ్‌.ఎ. ఇంగ్లీష్‌ ప్రీవియస్‌ విద్యార్థినిగా ఆంధ్రాయూనివర్సిటీలో జాయిన్‌ అయ్యింది. ఎమ్‌.ఏ.లో కూడా సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీస్‌ నుంచి వస్తున్న స్కాలర్‌షిప్‌ ఏమాత్రం సరిపోవడం లేదు. హాస్టల్‌ ప్రతి నెలా మెస్‌ బిల్లు కడితేనే అన్నం పెడతారు. ఈ విషయం ముందు రమకు తెలియదు.

సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంటు స్కాలర్‌షిప్‌ ఇస్తుందని తెలుసు కాబట్టి రమ ఎం.ఏలో చేరింది. బి.ఏ.లో ఇవ్వకపోయివుంటే ఆ నమ్మకం పెట్టుకొని ఉండేది కాదు. ఏ నెలకానెల డబ్బు వస్తుందనుకొంటూ కాలం మెల్లో తాడేసి లాక్కొచ్చి హాస్టల్‌ మేనేజర్‌, వార్డెన్‌ ఎదుట నిబెట్టిన రమ కాలం లొంగటం లేదని తెలిసి, తాడయినా మిగుతుందని తాడు లాక్కొని కాలాన్ని వదిలేసింది.

రమ అలా చేసిందని తెలిసిన మరుక్షణం, హాస్టల్‌ మేనేజర్‌ వార్డెన్‌తో చెప్పి రమ పేరు చుట్టూ కుంకుమ బొట్టు పెట్టినట్లు (ఎర్ర సిరాతో) ఎర్రగా సున్నా చుట్టి మెస్‌ బిల్‌ కట్టిందాకా పచ్చయింక్‌ ప్రమేయం లేదని బరికి పారేసాడు.

హాస్టల్‌ మెస్‌ బిల్లు కట్టనందుకు రమకు అన్నం పెట్టరు. ఆకలితో ఆమె శరీరం బాధపడుతుంది. మనిషి ఆకలి బాధను అనుభవించడం ఎంత తీవ్రంగా ఉంటుందో రచయిత నవలలోనే వివరిస్తాడు. ఇదీ సమస్య, మరి పరిష్కారం.

హాస్టల్‌ జీవితం చాలా అసమానతతో కూడుకొని ఉంటుంది. ఈ విషమ దృష్టి మహిళలో మరీ ఎక్కువ. మహిళ వసతి గృహం. రమ విద్యార్థిని పేదరాలు కాబట్టి మెస్‌ బిల్లు చెల్లించలేక కోర్సు ఫీజు కట్టలేక ఇబ్బందిపడుతూ వుండేది. సంపన్న విద్యార్థిని ఈ దృష్టితో ఈమెను అల్ప స్వభావంతో చూసేవాళ్ళు. అయినా రమ సహజంగానే చదువులో చాలా ముందంజ వేసిన మహిళ. పట్టుదలతో చదువుకుంది. అందరిలో మంచి బుద్దిమంతురాలే కాకుండా మంచి మార్కులు తెచ్చుకుంది. అలా కన్న వారిలో కనువిప్పు కలగడానికి కారణభూతమైంది. తనకు కలిగిన అవమానాల్ని, పరిహాసాల్ని సహించి తన లక్ష్యం సాధిస్తుంది. జీవితంలో తగిన ప్రోత్సాహం లేకపోయినా చీకట్లో పూలా ప్రకాశించే విద్యార్థినీలూ వున్నారు.

కొన్ని పూల ఉద్యానవనంలో వికసిస్తాయి. మరికొన్ని పూలు ఇంటిముందు పెరట్లో వికసిస్తాయి. కొన్ని లోయల్లో, అగాధాలో, మురికి కాలవల్లో, కంపల్లో పడుతాయి. అయినా పరిమళవంతంగా వికసిస్తాయి. అలాంటి మహిళా కుసుమం రమ.

ఒక కవి లోయలో పుడితేనే బొండు మల్లెపూవు ఆచితూచి పరిమళాన్ని విలువ కట్టని పువ్వు అన్నాడు. కాబట్టి అంటరాని కులం అనే వాటిలో కూడా పువ్వులాంటి విద్యార్థినీలు ఉదయిస్తారని భావించాలి. పరిమళాన్ని జ్ఞానానికి సంకేతంగా చెప్పాలి. జ్ఞానం అనే పరిమళంతో ప్రజల్ని ఆకర్షించే పుష్పమే నిజమైన పుష్పం ఆ పువ్వు మురికి కాలవలో, మలిన కూపాల్లో, కాలవ గట్టున, లోయలో పుట్టవచ్చు. ఎక్కడ పుట్టినా సరే సుగంధ మకరందాల్ని అందిస్తాయి. కాబట్టి ఎప్పటికైనా జ్ఞానమే నిజమైన పరిమళాన్ని అందిస్తుందని, అది సమాజాభివృద్ధికి ఉపకరిస్తుందని రచయిత భావన. ‘‘బోధించు సమీకరించు పోరాడు అని చదువు విలువను వెలుగెత్తి చాటిన డా॥బి.ఆర్‌.అంబేద్కర్‌ ప్రభావం ఈ నవల పై కనిపిస్తుంది’’.

– పోలినాటి బాలకృష్ణ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో