ముద్దుబిడ్డ బిందుగారి అబ్బాయి (పుస్తక సమీక్ష ) – మాలా కుమార్

ముద్దుబిడ్డబిందుగారిఅబ్బాయి
రచయిత : శరత్ బాబు

1950 సం .లో శరత్ బాబు నవలలను ,నవలల ఆధారంగా వచ్చిన సినిమాలను తెలుగుపాఠకులు /ప్రేక్షకులు బాగా ఆదరించారు . అందుకేనేమో అప్పుడు శరత్ బాబు నవలల ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి .వాటిలోనిదే ఒకటైన ” బిందుగారబ్బాయి” నవల ఆధారంగా వచ్చిన ” ముద్దుబిడ్డ ” సినిమా/నవలను ఈ నెల పరిచయం చేస్తున్నాను .

యాదవుడూ మాధవుడు  సవితి బిడ్డలన్న సంగతి వారే కాదు లోకమంతా  కూడా మర్చిపోయారు .బీదవాడైనా యాదవుడు చాలా కష్టపడి తమ్ముడు మాధవుడికి బి.ఎ  చదువు చెప్పించాడు .ఎన్నోప్రయత్నాలు చేసి చక్కటి ,ధనవంతుడి ఏకైక పుత్రిక అయిన బిందువాసినిని పదివేల కట్నంతో తెచ్చి పెళ్ళి జరిపిస్తాడు . పెద్ద కోడలు అన్నపూర్ణ బిందును చూసి లక్ష్మీస్వరూపం అని మురిసిపోయింది .కాని కొన్ని రోజులకు బిందువాసని అహంకారమే కాదు మూర్చల రోగం కూడా వుందని తెలిసి బాధపడుతుంది .కాని బావగారికి మాత్రం మరదలంటే  చాలా అభిమానం .ఓసారి బిందువాసినికి మూర్చ వచ్చినప్పుడు ఏమి చేయాలో తోచక తన  ఏణర్ద్ధంపిల్లవాడు అమూల్య చరణుని తెచ్చి బిందు వడిలో వేసింది అన్నపూర్ణ .బిందువాసిని మూర్చ నుంచి తేరుకొని అమూల్యుణ్ణి తీసుకొని గదిలోకి వెళ్ళిపోతుంది . చాటు నుంచి చూస్తున్న అన్నపూర్ణ ,బిందువాసిని జబ్బుకు మందు కనిపెట్టి నందుకు వుప్పొంగిపోయింది .

సంసార భారమంతా తన నెత్తినే వుండటము వల్ల పిల్లవాడిని సాక లేకపోతోంది అన్నపూర్ణ . అందుచేత చిన్నకోడలు బిడ్డ భారాన్ని తాను తీసుకుంటుంది  .ఎలా ఐతేనేం అన్నపూర్ణ బిడ్డ బిందువాసిని వళ్ళో పెరుగుతూ పిన్నిని ” అమ్మా ” అని , అమ్మను ” అక్కా ” అని పిలవటం నేర్చుకొన్నాడు . నాలుగేళ్ళ తరువాత అట్టహాసంగా వాడికి అక్షరాభాస్యం చేసారు . కాని వాడిని బడికి పంపితే వేరే పిల్లలు కొడతారని ,కలం పెట్టి వాడి కంట్లోపొడుస్తారని భయపడి , బావగారికి చెప్పి ఇంటి అరుగు మీదే బడి పెట్టిస్తుంది బిందువాసిని . అమూల్యుడికి ఏమాత్రం కొరత జరిగినా సహించేది కాదు బిందువాసిని .  ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డడుగా ఆరేళ్ళు గడిపారు .

తమ్ముడి ప్రాక్టీస్ పెరిగిన తరువాత యాదవుడు ,వుద్యోగం మానేసి సొంత ఆస్తి పాస్తులు చూసుకోవటం ఆరంభించాడు . మరదలు తెచ్చిన పది వేల రూపాయలూ వడ్డీకిచ్చి రెట్టింపు చేసాడు .ఆ డబ్బులో కొంత ,మాధవుని సంపాదనలో కొంతపెట్టి పెద్ద భవంతి కట్టించాడు . దుర్గాపూజల తరువాత మంచిరోజు చూసుకొని గృహప్రవేశం చేసుకొని అందులోకి మారుదామనుకుంటారు .
వీరికి దగ్గర చుట్టం ఏమంత బాగాలేదు .యాదవుడు అప్పుడప్పుడు ఆమెకు ఆర్ధిక సహాయము చేస్తూ వుంటాడు .

ఆమె కొడుకు నరేంద్రుని ఇక్కడకు పంపుతే చదువుచెప్పిస్తానని యాదవుడు వుత్తరము వ్రాయటముతో కొడుకును వెంటబెట్టుకొని వస్తుంది ఏలోకేసి .రెణ్ణాళ్ళ తరువాత ఆమె భర్త ప్రియనాధుడు కూడా వస్తాడు .ఎలోకేసి పైకి సాధువులా కనిపిస్తుంది కాని సాధువు కాదు .పిల్లాజెల్లా లేని బింవాసిని దగ్గర ధనపు మూటలు వున్నాయని గ్రహించి ఆమెయందు అమిత ప్రేమను చూపిస్తూ వుంటుంది.కాని,నరేంద్రుని సహవాసంలో అమూల్యుడు చెడిపోతున్నాడని వారిని పంపేయమని బిందువాసిని అన్నపూర్ణకు చెపుతుంది . ఆవిషయము మీదనే ఇద్దరికీ చిన్నగా గొడవలు మొదలవుతాయి .

చివరికి అవి ఎక్కువై మాటామాటా వచ్చి మళ్ళి బిందువాసినికి మూర్చవస్తుంది . ఆ తరువాత కొత్త ఇంటిలోకి యాదవుడు ,అన్నపూర్ణ , అమూల్యుడు తప్ప అందరూ వెళుతారు.

బావగారు మళ్ళీ వుద్యోగంలో చేరారని చాలా దారిద్ర్యంలో వున్నరని తెలుస్తుంది  బిందువాసినికి .గృహప్రవేశానికి మాధవుడు బతిమిలాడి పిలవగా వచ్చిన అన్నపూర్ణ ,పనంతా చక్కబెట్టి , మంచినీళ్ళైనా తాగకుండా వెళ్ళిపోతుంది .దానికి బాధపడ్డ బిందువాసిని తనూ అన్నం ,నీళ్ళూ మానేసి పుట్టింటికి వెళ్ళిపోతుంది .పుట్టింట్లో చావు బతుకుల మద్య వున్న బిందువాసిని పరిస్తితిని చూసి మాధవుడు అన్నా ,వదిన , అమూల్యుడిని తీసుకొని వస్తాడు . వారిని చూసిన తరువాత కోలుకుంటుంది బిందువాసిని .అంతా కలిసిపోతారు .

నవల ముందు నుంచి చక్కగా సాగుతుంది.ఎక్కడా బోర్ అనిపించదు. తోటి కోడళ్ళ మధ్య అనురాగం,  బావగారికి మరదలి పట్ల అభిమానం బాగా చూపిస్తారు. మన ఇంట్లో మనతోనే జరుగుతున్నంత సీదాసాదాగా వుంది.ఆరోజుల పల్లెటూరి వాతావరణం బాగా తెలుస్తుంది.

సినిమా దాదాపుగా నవలలాగానే వుంది . డైలాగులు ,సంఘటనలు కూడా ఏమీ మార్చబడలేదు .కాకపోతే పాత్రల పేర్లు బెంగాలీ పేర్లు కాకుండా తెలుగు పేర్లు పెట్టారు .దానితో బెంగాలీ నవల సినిమా  చూస్తున్నట్లుగాకాక తెలుగు సినిమా చూస్తున్నట్లుగానే వుంది . యాదవుడు – శేషయ్య ( నాగయ్య ) , మాధవుడు – మధు ( జగ్గయ్య ) , అన్నపూర్ణ -సీత ( లక్ష్మీరాజ్యం ) , బిందువాసిని – రాధ ( జమున ) , అమూల్యచరణుడు – వేణు ( మాస్టర్వెంటేశ్వరరావు ) ఏలోకేసి-పేరమ్మ ( సూర్యకాంతం ) ,ప్రియనాధుడు – పరంధాముడు ( రమణారెడ్డి ) నరేంద్రుడు – నారాయణ ఇవీ కొన్ని ముఖ్యమైన పాత్రలూ పాత్రధారులూ . నవలలో మాధవుడులా చదువుతాడు .సినిమాలో మధు ,డాక్టర్ . సినిమాలో శేషయ్య పని చేసే జమిందారును రెండు మూడు సార్లు చూపిస్తారు .ఆ పాత్ర ద్వారానే శేషయ్య తమ్ముడి పొలం కాక తన పొలంతా కట్టుపెట్టి చదివిస్త్తునట్లుగా చెప్పిస్తారు . సినిమాలో సూర్య కాంతం పాత్ర కూడా కొంచం ఎక్కువగానే వుంది . “నువ్వు మీ అమ్మను చూస్తే ,మీ అమ్మ చనిపోతుందని ” వేణుకు చెప్పటం , రాధతో ” బాబును రాధ దగ్గరకు తల్లి పంపించటం లేదని ” రాధకు చెప్పి తోటికోడలు మీద ద్వేషం పెంచటం నవలలో లేదు . ఇలాంటి చిన్నచిన్న మార్పులు తప్ప ,కథ దాదాపు నవల కథే కాబట్టి పెద్దగా చెప్పేందుకు ఏమీలేదు .

– మాలా కుమార్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక పరిచయం, పుస్తక సమీక్షలుPermalink

One Response to ముద్దుబిడ్డ బిందుగారి అబ్బాయి (పుస్తక సమీక్ష ) – మాలా కుమార్

  1. Pingback: వీక్షణం-151 | పుస్తకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)