జోగిని (ధారావాహిక ) – శాంతి ప్రబోధ

”ప్రభుత్వం మీ కోసం, మీ మంచికోసం చాలా కార్యక్రమాలు చేసింది కదా…” మధ్యలోనే అందుకుని ”అవ్‌ సర్కార్‌ బీ జేసింది… పెద్దమ్మ మమ్ముల మంచిగ సెయ్యాలన్ననుకున్నది. కానీ ఎన్నడు ‘అమ్మ’ తీర్గ మమ్ముల సూడలె సర్కారు. సార్ల తీరె వేరు. జోగుతనం ఉండద్దని పగలు సెప్పుడు. చీకటి పడ్డంక మమ్ముల పట్కబోవుడు గదీ… ఆల్లమంచి.
”మల్ల ఎవరొచ్చిన్రే బొంద బెట్టిన మన బతుకు బయటకు తోడ” మరో జోగిని నీరడి సరోజ పక్క వీధిలోంచి వస్తూనే.
ఇంతకు ముందు కూడా జోగినీ జీవితం తెల్సుకోవాలని కొందరు విజిటర్సు రావడం, వారి జీవితాల గురించి గుచ్చి గుచ్చి అడగడం, మంచిది కాదని మర్చిపోదాం అనుకొంటూ ఉన్న జీవితం గురించి మళ్ళీ ఎవరో ఒకరు రావడం, తమ దుర్భర జీవితం తాలూకు దృశ్యాలు వారి కళ్ళలో సినిమా రీలులా తిరుగుతూ తీవ్ర వేదనకు గురిచేస్తుండడంతో మల్లోసారి ఎవర్ని తీసుకు రావద్దనీ, తమ జీవితం గొప్పదేం కాదనీ ఆ భయంకరమైన జీవితాల్ని చాలించామనీ, ఇప్పుడు మరో జన్మ ఎత్తి అసలైన జీవితం అందుకొనే ప్రయత్నం చేస్తున్నామనీ స్పష్టంగా చెప్పింది నీరడి సరోజ.
ఆమె హృదయ వేదనని, పడ్తున్న ఘర్షణనీ అర్థం చేసుకున్న విద్య మరిక ప్రశ్నలేం అడగలేదు. వారందరికీ నమస్కరించి బయట పడింది.
తమ వెంట తెచ్చుకున్న భోజనం చేశారు. దారిలో ఉన్న తోటలో… మళ్ళీ మరో గ్రామం వెల్లుట్లకు బయల్దేరారు. దారిలో తాము వెళ్ళబోతున్న గంగడోల్ల దేవమ్మ కథ చెప్పారు రజని, అంజయ్యలు.
నలభై ఏళ్ళ దేవమ్మని మార్చడానికి, ఆమె జీవన విధానంలో, ఆలోచనా సరళిలో మార్పుకోసం ఎంతో ప్రయత్నించారు. ఆమె ఏనాడూ వీరి మాటలు వినలేదు. పెడచెవిన పెట్టింది. జోగినిగా కొనసాగడం తన హక్కు అని ప్రకటించింది. అనాదిగా వస్తూన్న ఆచారాన్ని ఎవరూ కాదనడానికి వీల్లేదంది. దేవుడు మమ్ములను జోగినిగా బతకాలని జోగినిగా మార్చాడు. అందుకని జోగినిగానే ఉంటానంది. ఊర పండుగలలోనూ శవాలముందు, జాతర్లలోనూ వద్దన్నా వినకుండా ఆడింది. అందులో తనకు ఆనందం ఉందంది. గ్రామ పెత్తందార్లు ఆమెకు వత్తాసు పలికారు. ఆమె చెప్పింది రైట్‌ అన్నారు. ‘అమ్మ’ సంస్థ కార్యకర్తల పైకి ఆమెను ఉసిగొల్పారు. తమ పెత్తందారి తనానికి, తమ అహంకారపు పోకడలకు బీటలు వారాయని తల్లడిల్లే ఆ పెద్దలు దేవమ్మని ఆసరా చేసుకుని ఏదో రకంగా ”అమ్మ”పై
బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో జరిగిందా సంఘటన.
ఊళ్ళో ప్వారి భార్య చనిపోయింది.
శవయాత్ర జరుగుతోంది. దేవమ్మ నాట్యం, ప్రజలు ఈలలు, కేకలతో హైస్కూల్‌ ముందు నుండి శవయాత్ర సాగుతూనే ఉంది.
స్కూల్‌లో ఉన్న అశోక్‌ని చూసి అతని క్లాసు వాడే అయిన శ్యామ్‌రావు ఒరే మీ అమ్మ… అదే జోగు దేవమ్మ తో నా పెండ్లికి సుతం ఆడిపిస్త అంటే, రాజు అందుకొని గా…. జోగుదానితోని పెండ్లి ఆట ఏందిరా…! ఆగో… గటు సూడు రాయనర్సు జాకెట్ల పైసలు పెడ్తున్నడు జూడు… గట్ల ఎక్కడంటే అక్కడ రూపాయలు పెట్టుకుంట ఆడిస్త ఆమెతోని… అని, అశోక్‌ వైపు చూసి,
”ఓరి అశోక్‌ నువ్వేం జేస్తవ్‌రా…? ఎవరితోని ఆడిపిస్తవ్‌రా..?” అడిగాడు.
ఆ అవమానాన్ని తట్టుకోలేక పోయింది ఆ చిన్నారి హృదయం. తల్లి కారణంగా తాను అవమానాల పాలు కావల్సి వస్తోందని తల్లిపై కసి, ద్వేషం, జీవితం అంటేనే విరక్తీ… కానీ ఎవ్వరినీ ఏమనలేని నిస్సహాయ స్థితికి ఉక్రోషం… ఇక అక్కడ ఉండలేక గబగబ ఇంికి వచ్చేశాడు. ఇంో్ల ఉన్న సామానంతా విసిరి క్టొాడు. అయినా అతని కసి పోలేదు. ఎవర్నో, ఏదో చేయాలన్నంత కసి. ఏం చేయలేక తనని తాను హింసించుకున్నాడు. పచ్చి మంచినీళ్ళు ముట్టకుండా… స్కూలుకి వెళ్ళకుండా… మౌనంగా పిచ్చివాడిలా…
కొడుకు ప్రవర్తన ఏ మాత్రం అర్థంకాక తల్లడిల్లిపోతూ ఆ తల్లి. తన చదువు తప్ప మరేమీ ప్టించుకోకుండా, ఏ తుంటరి పనులూ చేయకుండా, గొడవల్లో తలదూర్చకుండా ఉండే అశోక్‌ క్లాస్‌ ఫస్టు వస్తాడని ీచర్లందరికీ అభిమానమే. ఒక్క తెలుగు ీచర్‌ శర్మకి తప్ప, అబ్బో… మాల మాదిగ ముండా కొడుకుక్కూడా బాగానే మార్కులొచ్చాయే…. ఆ అయినా వాళ్ళకి మార్కులు లేకపోతేనేం… వాళ్ళ కోసం ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తూంటే . వాళ్ళ కులాన్ని ఎత్తి పొడుస్తూ. కులం పేరుతో అవమానిస్తూ. పెద్ద కులం వాడినన్న అభిజాత్యంతో..

– శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో