జ్ఞానదీపికలు – డా.వాసా ప్రభావతి

. జీవించడానికి లోకంలో ఎన్నో తేడాలు
మరణించడానికి మాత్రం అందరూ ఓక్కటే !

 దున్నేవాడికి తెలుసు నేలలో తేడాలు
తినే వాడికి తెలుసు వంటలో రుచులు !

 చేపట్టిన పనిలో విజయం సాధించాలి
ప్రయత్నలోపం అధిగమిం చాలి!

 పచ్చతనానికి చెట్టు నిదర్శనం
పనితనానికి మనిషి నిదర్శనం !

 ఆపదలను అధిగమించాలి
ఆత్మహత్యలను నివారించాలి !

 అన్నిదానల కన్న అన్న దానం మిన్న
అన్నిసేవల కన్నా మానవసేవ మిన్న!

చురుకైన వానికి కావాలి చేతినిండా పని
సోమరికి రావాలి వంటి నిండా చైతన్యం !

పాలన లేనిదే దేశం లేదు
దేశం లేనిదే మనిషి జీవితం లేదు !

 దేశానికి కావాలి సమర్థుడైన పాలకుడు
సమాజానికి కావాలి సమర్థుడైన నాయకుడు !

 విద్యార్థి కి కావాలి మంచి గురువు
గురువుకి వుండాలి మంచి విద్య !

– డా.వాసా ప్రభావతి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , Permalink

One Response to జ్ఞానదీపికలు – డా.వాసా ప్రభావతి

  1. D.Venkateswara Rao says:

    జ్ఞానదీపికలు ఎందుకనో మనసును అంతగా ఆకర్షించడం లేదు
    ప్రతి రెండు వరుసలకు పోలిక సరిపోవడం లేదు
    అన్నుమతిస్తే వివరించగలను