”ఇక నీ మామూలు ప్రశ్నలన్నీ అరుపోయారు. ఇంకేమరునా క్రొత్త ప్రశ్నలడుగు.”
భానుమూర్తి నవ్వేసాడు. భానుమూర్తి ఎప్పుడొచ్చినా అందరిక్షేమ సమాచారాలు మొదట కనుక్కుని తర్వాత తన గురించి ఏమైనా చెప్పాల్సి వుంటే చెప్పి కృష్ణ దగ్గర నుండి వినాల్సిందే మరునా వుంటే వినేసి గబగబ కొంప ముంచుకు పోరునట్టు వెళ్ళిపోతాడు. వాళ్ళ మాటల్లో అంతకంటె మరెటువిం విషయాలూ దొర్లవు. కానీ ఈరోజు ఉన్నట్టుండి అన్నాడు భానుమూర్తి క్రొత్తగా.
”’అదేమి? ఈ రోజు సుధాకర్ రానట్టుందే!” కృష్ణ కూడా తలప్రక్కకు తిప్పి చూసింది. షుమారుగా రోజూ వస్తున్నట్టే వస్తాడు సుధాకర్ విద్యోదయ కొఱకు. వాళ్ళకు టైమ్ గడిచేదే తెలియదు. ఎంతమంది విజిటర్స్ వచ్చి తమ స్థానాలు ఖాళీ చేసిపోతారో వాళ్ళకు గుర్తుండదు. దాదాపు అతనిని అలా అడగలేదు. ఆమె తనతో ఏదో చెప్పాలనుకుంటుందని అర్ధమరున భానుమూర్తి మరలా కూర్చున్నాడు.
ఆమెకు ఈ విషయం అతనికి ఇప్పుడే చెప్పాలా, వారుదా వేయాలా అనేది పెద్ద సమస్య అరుపోరుంది.
ఆమెకీ రోజు అరుణ దగ్గర నుండి వచ్చిన ఉత్తరంలో తన హృదయాన్ని విప్పి కృష్ణ ముందుపరచి ”నువ్వు భానుమూర్తి మనసు తెలుసుకుని నాకువ్రారు కృష్ణా! ఆయన మనస్సు తెలిస్తే అమ్మకు చెప్తాను. నీమిద నాసమస్యను రుద్దుతున్నానేమో!” అంటూ వ్రాసింది.
ఆ ఉత్తరం చదవగానే మొదట ఆశ్చర్యపడింది. తర్వాత తనకే అర్ధంగాని విచారంలో మునిగిపోరుంది. అతనితో ఎలా చెప్పాలా? అని రిహార్సిల్స్ చేసుకుంది. ఈ విషయాన్ని తనలోనే గుప్తంగా దాచేసుకోవాలని కూడా ఒక్కక్షణం అనుకుంది కానీ ఒకరకంగా అతని మనస్సు తెలుసు కోవాలనే కుతూహలంతోనైతేనేమి, నిజారుతీ మిద మమకారం వల్లనరుతే నేమి ఆమె చెప్పడానికే నిర్ణరుంచుకుంది. కానీ ‘తన స్నేహితుని మనస్సు నొచ్చుకుంటుందేమో, అతని పరీక్షల ముందుగా అనవసరమైన సమస్యలని అతని నెత్తిన రుద్దినట్టవుతుందేమోనని’ సందేహిస్తోందామె. పైగా అరుణను చేసుకుంటే భానుమూర్తి దాంపత్య జీవితం అంత శాంతిగా వుండదేమో! అనే సంశయం కూడా ఆమెకుంది.
”’చెప్పు కృష్ణా?” అంతవరకు తదేకంగా ఆమెనే చూస్తున్న భానుమూర్తికి ఆమె ఏదో చెప్పాలని సందేహిస్తున్నట్టు అర్థమరుంది.
కృష్ణ మ్లాడలేదు. మెల్లిగా తన గుప్పిటలో నలిగిపోతున్న ఉత్తరం తీసి భానుచేతిలో ప్టిె గ్టిగా ఊపిరి తీసుకుంది. ఆ ఉత్తరాన్ని చదువుతున్న భానుమూర్తి ముఖంలో రంగులు మారడం ఆమె గమనిస్తూనే వుంది.
ఉత్తరం పూర్తి చేసినా ఇందాకి నుండి అందులోనే దృష్టి నిలిపిన భాను చటుక్కున తలెత్తి అడిగాడు.
”ఆ అమ్మారులో ఇటువిం అభిప్రాయం కలిగేలా నేను ప్రవర్తించానా కృష్ణా?”
ఆమె కళ్ళతోనే అటువిందేమి లేదన్నట్టు జవాబు చెప్పి అతనికి భరోసా రుచ్చింది.
”నాకా భావం లేదనీ, నన్ను క్షమించమని అరుణకు వ్రారు కృష్ణా” మరో నిముషమైనా ఆలోచించకుండా సూిగా జవాబు చెప్పిన భానును విస్తుపోరు చూచింది కృష్ణ.
‘కనీసం ఓ ఆడపిల్ల తనని ఇష్టపడ్తోందనే గర్వం అరునా కలగదేం ఈ జడుడికి! పైగా అరుణ అందగతై, చదువుకున్నది. అన్నికంటె ఆమె భానుమూర్తిని మనసారా కోరుతోంది. అరుణ ఓరకింతో చూస్తే ఆమె కొఱకు పడిగాపులు బడే కాలేజీ కుర్రాళ్ళు ఎందరో వుాంరు. అలాి అరుణను భాను ఎందుకు కాదంటున్నట్టు? అరుణ కంటె మంచి తన భార్యలో అతనేం కోరుకుంటున్నాడు?
”ఏం కృష్ణా నీకు బాధగా వుందా?”
ఆలోచనల నుండి తేరుకుని, హాస్య ధోరణిలోకి వెళ్తూ అంది-
”ఏం మా అరుణ కంటె అందగత్తె దొరుకుతుందా నీకు?”
”ఏమో! దొరుకుతుందేమో! ఎవరు చూడొచ్చారు?” నవ్వాడు భానుమూర్తి.
మనసులోనే ఉలిక్కిపడింది కృష్ణ.
”పోనీ పరిచయస్థురాలు మంచిది. చేసుకుంటే నీదేం పోరుంది?”
పరిచయస్థులనంతా పెళ్ళి చేసుకోవాలంటే అది సాధ్యమయ్యే పనికాదు కృష్ణా!”
”నిన్ను అరుణ ఇష్టపడ్తోంది భానూ!” తగ్గు స్వరంతో అంది.
”స్నేహాన్ని అపార్ధం చేసుకుంటే నేనేం చేసేది? నాకా అదృష్టం లేదని వ్రాసేయ్” అనేసి ఇక ఆ ప్రసక్తిని పొడిగించడం ఇష్టం లేనట్టు లేచి నిల్చున్నాడు భానుమూర్తి.
”ఏమైనా డ్స్ వస్తే చేసి పెట్టుకో, నేను వచ్చే ఆదివారం వచ్చిచెప్తాను”
ఆమె జవాబు చెప్పలేదు. కళ్ళప్పగించి అతనివైపు అర్ధంకానట్టు చూస్తోందామె.
”ఇక వెళ్ళనా?”
”ఊ’ కుర్చీలో నుంచి లేవలేదు కృష్ణ.
భానుమూర్తి వెళ్ళిపోరున ఐదు నిముషాల వరకు బొమ్మలా అలాగే కుర్చీ కంటుకుపోరుంది కృష్ణ. ఆమె మనసు అల్లకల్లోలంగా అరాజకంగా వున్నట్లనిపించింది. దానికి కారణం మటుకు ఆమెకు స్పష్టంగా అర్ధం కాలేదు.
ఐదు నిముషాల తర్వాత లేచి తన గదిలో కెళ్ళడానికి మేడ మెట్లెక్కుతున్న ఆమెకు ఒంటరిగా తన గదిలో కెళ్ళడానికి మనస్కరించలేదు. వెంటనే ఎక్కిన నాలుగు మెట్లు దిగేసి విద్యోదయ గదిలో అడుగు బ్టెింది. అక్కడ స్నేహ బృందమంతా హోరాహోరీ వాదించుకుంటున్నారు. ఆమె ఆ క్షణంలో కోరుకుంది కూడా ఆటువిం రణగొణ ధ్వనినే. అందరి మధ్యలో నిశ్శబ్ధంగా కూర్చోనున్న విద్యోదయ ప్రక్కగా వెళ్ళి కూర్చుని వాళ్ళ వాదనలు వింటున్న కృష్ణ మనసు తనకు తెలియకుండానే మెల్లి మెల్లిగా తేలికపడింది. అందరికీ కంఠశోష వచ్చాక శిరీష కృష్ణ వైపు తిరుగుతూ అంది,
– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~