సమకాలీనం- మరో క్విట్ ఇండియా ఉద్యమం రావాలి!- విజయభాను కోటే

 మరో క్విట్ ఇండియా ఉద్యమం రావాలి!

ఆగష్టు అంటే క్విట్ ఇండియా దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం గుర్తుకొస్తాయి. స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవడంలో ఉన్న శ్రద్ధ మనం నిజమైన పౌర చైతన్యాన్ని కలిగి ఉండడంలో చూపించం. ఇపుడు నిజానికి ఇంకో క్విట్ ఇండియా ఉద్యమం రావాలి. స్వచ్చ్ భారత్ ఉద్యమంలో భాగంగా భారత్ లో వేళ్ళూనుకుపోయిన కొన్ని సామాజిక రుగ్మతలను, సమస్యలను బయటకు తరమాల్సిన అవసరం ఉంది. లేదంటే, భవిష్యత్ తరాలు నీతీ, నిజాయితీలు లేని సమాజంలోనే జీవించాల్సి వస్తుంది. స్కాములతో నిండిపోయిన దేశంలో వారు ఏరుకోవడానికి ఎండిన జవాబుదారీతనం కూడా కనిపించదు. సంక్షేమ పథకాల పేరుతో ప్రలోభాలకు దాసోహం అయిపోతే, దేశంలో సోమరితనం తప్ప ఏమీ ఉండదు. రాజ్యాలు ప్రకృతి వైపరీత్యాల వల్లనే తుడిచిపెట్టుకుపోవు, బాధ్యతారాహిత్యం నిండిన పౌరులు, పరిపాలనల వలన కూడా తుడిచిపెట్టుకుపోతాయి.

కలాం మరణంలో కూడా మతాన్ని తీసుకొచ్చే పిచ్చితనంలో మనం పడి కొట్టుకుంటున్నాం. అవినీతి ప్రతిచోటా వ్యాపించి, ఆ దుర్గంధంలోనే బ్రతకడం నేర్చుకుంటున్నాం మనం. మళ్ళీ ఒక క్విట్ ఇండియా ఉద్యమం రావాలి. అది ప్రజల వల్లనే రావాలి. స్వాతంత్ర్యం విలువ తెలియాలంటే, నిజమైన స్వాతంత్ర్యాన్ని మనః స్ఫూర్తిగా అనుభవించాలంటే, మరో క్విట్ ఇండియా ఉద్యమం రావాలి. అది మన నుండే రావాలి!

మన దేశాన్ని విడిచి వెళ్ళాల్సినవి ఎన్నో ఉన్నాయి.
క్విట్ ఇండియా అవినీతి భూతమా…
క్విట్ ఇండియా కుంభకోణాల పర్వతమా…
క్విట్ ఇండియా కులతత్వమా…
క్విట్ ఇండియా వివక్ష కుతంత్రమా…
క్విట్ ఇండియా పర పీడనమా..
క్విట్ ఇండియా ప్రాంతీయతత్వమా…
క్విట్ ఇండియా వ్యక్తి పూజా విధానమా…
ఇంకా ఎన్నో సమస్యలు, మనల్ని బానిసలుగా చేస్తున్న నియంత బలాలు చాలానే ఉన్నాయి.
వాటిని తరిమికొట్టేందుకు మనం ఏం చెయ్యగలమో ఆలోచించాలి.
ఈ సంవత్సరం స్వాతంత్ర్యానికి ఒక క్రొత్త అర్థం తెచ్చే ప్రయత్నం చేద్దాం.
Let the spirit of our freedom movement relive in our souls to abolish the problems of our country through our proper actions and right citizenship.

– విజయ భాను కోటే 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, సమకాలీనం, , Permalink

One Response to సమకాలీనం- మరో క్విట్ ఇండియా ఉద్యమం రావాలి!- విజయభాను కోటే

  1. lalitha says:

    మంచి కోరికలే కోరుకున్నారు మేడం . కానీ ఇవన్ని ఎప్పటికి జరుగుతాయి ? అలంటి దేశాన్ని పొందగలమా ?