కృష్ణ గీత (శీర్షిక )- సారూప్యం – క్రిష్ణ వేణి

హై ప్రొఫైల్ కలిగిన సక్సెస్‌ఫుల్ ప్రొఫెషనల్ మరియూ పెప్సికోకి ఛైర్మన్ అయిన ఇందిరా నూయీని ప్రెసిడెంట్ చేసిన రాత్రి,ఆమె ఇంటికి వచ్చి “శుభవార్త” అంటూ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ఆమె తల్లి మెట్లమీదనుంచి “అది తరువాత కానీ, ముందు వెళ్ళి పాలు పట్రా” అని చెప్పేరు. గరాజ్లో భర్త కారుందని గమనించి,‘భర్త ఇంటికి వచ్చేడేమో కదా!” అడిగినప్పుడు-తల్లి “ అతను ఎనిమిది గంటలకే వచ్చి, అలిసి పోయి ఉన్నాడు.పనివాళ్ళకి చెప్పడం మరిచిపోయేను. నువ్వు వెళ్ళి పట్రా” అని చెప్పేరు.
ఆపాలేవో కొనుక్కొచ్చిన తరువాత తల్లితో తన ఉద్యోగం గురించి చెప్పి, “ ఎలాంటి తల్లివి నీవు?’ అని వాపోయినప్పుడు, ఆవిడ “నువ్వు ఇంటి బయట ఎంత గొప్పదానివయినాకానీ, ఒకసారి ఇంట్లోకి ప్రవేశించిన తరువాత నీవు ముందు ఒక భార్యవి, కూతురివి, కోడలివి, అమ్మవి. ధరించిన ఆకిరీటాన్ని గరాజ్లోనే వదిలి ఇంట్లోకి రా” అని చెప్పేరు. ఇది 14 ఏళ్ళ కిందటి సంగతి.
ఏస్పెన్ ఆయిడియాస్ ఫెస్టివల్లో మాట్లాడుతూ, “స్త్రీలకి అన్నీ దొరకగలవనినేననుకోను. దొరుకుతాయని, దొరకగలవనీ మనలని మనం నమ్మించుకుంటాం,అంతే” అని ఇందిరా నూయీఈ నెల 8వ తారీకున ప్రకటించేరు.
0
అది నిజమేనా? అసలు ఏ వక్కరికయినా ప్రతీదీ దొరుకుతుందా? పురుషులకైనా కానీ ప్రతీ ఒక్కటీ దొరకగలదా!
నిజం చెప్పాలంటే, ఇది పండోరాస్ బాక్స్‌ని తెరవడమే. ఇన్నేళ్ళగానో తెగని ప్రశ్నని ఈ ఇంటర్వ్యూ మళ్ళీ లేవనెత్తింది. భారతదేశంలో కానీ, బయట దేశాల్లో కానీ ఇవే సమస్యలు ఇంకా ఉన్నాయి.

‘బయొలొజికల్ క్లాక్, కెరీర్ క్లాక్- రెండూ పూర్తి సంఘర్షణ పడుతున్నాయి.పెళ్ళి చేసుకుని పిల్లలని కనడానికున్న వయస్సూ, కెరీర్లో ఎదగగలిసే వయస్సూ ఒకటే.’ అని ఇందిరా నూయీ చెప్తారు.
‘ఇప్పుడు నేను పిల్లలని కనడానికి సిద్ధంగా లేను. కంటే కనుక, నా కేరీర్ని పక్కన పెట్టాలి’ అనే వారున్నారు. ఆ తరువాత పిల్లల్ని కనాలంటే చాలా ఆలస్యం అవుతుంది.

‘మీరు ఒక సూపర్ డాక్టర్ అయితే కనుక ఒక సూపర్ మోమ్ అవలేరు’-అన్నది సాధారణమయిన అభిప్రాయం. పురుషులు ఈ ప్రశ్నని ఎదురుకోవడం లేదు. నిజానికి స్టాటిస్టిక్స్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఉద్యోగాలు చేసే స్త్రీల సంఖ్య మనం ఊహించినట్టుగా పెరగడం లేదు. తరుగుతోంది. పల్లెల్లో అయితే-పెరుగుతోంది. అంటే- ఆర్థిక అవసరం ఉన్నవారు పని చేస్తున్నారు. లేనివారు చేయడం లేదు. మహిళా ఉద్యోగస్థురాళ్ళకి సంబంధించి,131 దేశాల్లోనూ భారతదేశం- కిందనుంచి 11 వ స్థానంలో ఉంది.

సామాన్యమైన మనస్తత్వం ఉన్న స్త్రీలలో అపరాధభావాన్ని నింపే అలవాటు పురుషులకి ఉంటుంది. ఈ ‘గిల్ట్’ కి స్త్రీలు సులభంగానే లొంగిపోతారు. నిజానికి, అది వారి చేసుకున్నఎంపికలవల్లే.“స్త్రీలకి అన్నీ దొరకవు” అని ఇందిరా నూయీ అన్నప్పుడు-ఆ ‘అన్నీ” అంటే ఏమేమిటి? ఒక సక్సెస్‌ఫుల్ కేరీర్ ఉందామెకి. ఆమె తల్లి ఆమెకి చెప్పినట్టే, సియివో అయిన ఇందిరా నూయీ తన పిల్లలిద్దరికీ చెప్పగలదా? చెప్పినా కూడా వాళ్ళు వింటారా?ఈ టీ షర్ట్ వంటివి ఈ మధ్య మార్కెట్లో చాలానే కనిపిస్తున్నాయి. ఇవి అందిస్తున్న సందేశం ఏమిటి!
1

ఈ వర్క్, ఇల్లు బాలన్స్ చేసుకోవడం అన్నది ఒక్క స్త్రీలకే ఎందుకు అన్వయిస్తుంది? స్టీవ్ జాబ్స్‌ని కానీ బిల్ గేట్స్‌ని కానీ ఈ ప్రశ్న ఎవరూ అడగరే.

ఈ సమస్యలని ఎదురుకునేది మధ్య తరగతి స్త్రీలే. ఉన్నతవర్గం కానీ కింద మధ్య తరగతివారు కానీ- వీటికి దూరంగానే ఉంటారు. ఇంటిపని చేయడానికి మనుషులని నియమించడం, అలాంటి సౌకర్యాలు ఉన్నతవర్గానికి ఉంటాయి.
‘పనికీ, జీవితానికీ మధ్య గీత గీయడం కష్టం. పని, జీవితం- రెండిటినీ బాలన్స్ చేయడం అన్నది భ్రమ.’-ఈ ఆలోచనకి కీలకాంశం పరిణితి స్థాయి.

పాతకాలంలో భర్తకి జీతం ఎక్కువ అయినప్పుడు, భార్య ఉద్యోగం వదిలి వేసేది. ఇప్పుడు పరిస్థితి మారింది. చదువు ఎక్కువ అవడం వల్ల ఆశలు కూడా పెరిగేయి. స్త్రీలు చదువుకుంటే వాళ్ళకి ఉద్యోగం చేసే అర్హత ఉంటుంది. వాళ్ళకి ఉద్యోగాలుంటే, వాళ్ళు ఇంట్లో కూర్చోవాలనుకోరు. ఇది మార్పు చెందిన ఆలోచనా విధానం.

ఇంట్లో ఉండే పని చేసే అవకాశాలున్నాయిప్పుడు.భార్య బయటకి వెళ్ళి ఉద్యోగం చేస్తే, భర్త ఇంట్లో ఉండి ఇంటిని చూసుకోగలడు.దీనికి ఉదాహరణ- రచయిత చేతన్ భగతే.

మళ్ళీ దీనికి ఇంకొక పక్షం ఉంది. భార్యల అవసరాలకి అనుగుణంగా భర్తలు కనుక తమ కెరీర్లని వదిలిపెడితే స్త్రీలు దాన్ని కూడా ఇష్టపడరు. ఇంట్లో ఉండి, ఇంటినీ పిల్లలనీ చూసుకునే భర్తలని ఆడవాళ్ళు భరించలేరు.

పురుషులకోసం స్త్రీలు సెట్ చేసిన స్టాండర్డ్స్ ని వాళ్ళు మెయింటైన్ చేయడం కష్టం. తమకన్నా తక్కువ సంపాదించే భర్తలనీ స్త్రీలు అంగీకరించలేరు. ఇద్దరిలో ఒకరి ఏంబిషన్‌కే అవకాశం ఉంటుందా?

ఈ రెండు అభిప్రాయాలూ ఉన్నాయి కానీ కొంతమంది స్త్రీలు వాటి గురించి ఆలోచించను కూడా లేరు.ఇళ్ళల్లో పాచి పనులు చేసుకునే ఆడవాళ్ళని చూడండి. వాళ్ళ భర్తలకి రోజువారీ కూలి చేసే ఉద్యోగాలుంటాయి. దొరికిన రోజు, పని దొరుకుతుంది.లేని నాడు- లేదు. ఆ ఆడవాళ్ళు ఇంటా బయటా కూడా పని చేస్తారు.ఇంట్లో భర్తలు సహాయం చేయరు. ఒక గ్లాస్ నీళ్ళు కూడా పట్టుకుని తాగరు.

2

పల్లెల్లో ఆడవాళ్ళు పొలాల్లో పని చేసుకుంటూ ఉంటే, భర్తలు చెట్టునీడన కూర్చుని బీడీ కాలుస్తూ కనపడతారు.
పట్టణాల్లో ఉన్న స్త్రీలు పిల్లలని కనడం వాయిదా అయినా వేస్తారు.ఇల్లూ, ఉద్యోగం చూసుకోలేక పిల్లల్ని కనడం అయినా మానేస్తారు. రెండవది అమలు పరచబడ్డం మనం చూస్తూనే ఉన్నాం. వీరినే మనం DINKS (DOUBLE INCOME AND NO KIDS) అని పిలుస్తాం.

‘కెరీరూ కావాలి. ఇల్లూ కావాలి’-అనుకున్నప్పుడు స్త్రీలు తమ పట్ల తాము ఎంత శ్రద్ధ వహిస్తున్నారు? తమని తాము పాంపర్ చేసుకోగలుగుతున్నారా? మెడికల్ చెక్ -అప్ అయినా, ఎన్నాళ్ళకోసారి చేయించుకుంటున్నారు? అసలు పురుషులకన్నా స్త్రీలకి తక్కువ టైమ్ ఎందుకు ఉంటుంది?

30-40 సంవత్సరాల క్రితం మొగవాళ్ళే సంపాదించి తెచ్చి, ఇంటి ఖర్చు భరించేవారు. ఇప్పుడు సమానంగానో లేకపోతే ఇంకా ఎక్కువో చదువుకున్న స్త్రీలున్నారు. ఎక్కువ స్మార్ట్ గా ఉన్న స్త్రీలున్నారు. మనం ఒక మార్పుని చూస్తున్నాం- ఒక పెద్ద, ఆహ్వానింపతగ్గ మార్పుని. మనందరికీ సర్దుకుపోయే అవసరం ఉంది.
ప్రపంచం పరివర్తన చెందుతోంది. మనం ఆలశ్యంగా పాల్గొంటున్నాం అంతే.

మారిసా మాయర్ గురించి మనందరమూ వినే ఉన్నాం.ఆమె 2010 వ సంవత్సరంచివరివరకూ,గూగుల్ ప్రోడక్ట్ సర్చి కి వైస్ ప్రెసిడెంటుగా పని చేసింది. 16 జూలై, 2012లో ఆమె యాహూకి ప్రెసిడెంట్ మరియు సియివోగా నియమించబడింది. అప్పుడామె ఆరు నెల్ల గర్భవతి. గర్భవతిగా ఉండగా ఉన్నత స్థానాన్ని చేపట్టిన మొట్టమొదటి మహిళగా ఆమె ఒక పూర్వ ప్రమాణాన్ని స్థాపించింది. ఆమెని నియమించినప్పుడు, ఆమె గర్భం గురించి యాహూ పట్టించుకోలేదు.\
5

అది ఆమె అప్పటికే తన సామర్థాన్ని నిరూపించుకున్నందువల్లా, ముందే ఉన్నత శిఖరాలని అందుకున్నందువల్లా.
కానీ మధ్య తరగతి యువతులకయితే, ఎప్పుడు మెటర్నిటీ లీవ్ ఇవ్వవలిసి వస్తుందో అని ఉద్యోగం ఇవ్వడానికి కూడా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు.

అదీ కాకుండా, ఉద్యోగం చేస్తున్న ఇంచుమించు 20 శాతం స్త్రీలలో అయిదు శాతం మాత్రమే ఉన్నత స్థాయిల్లో ఉన్నారు.
కుటుంబం, కరీర్ -రెండూ నిర్వహించడం అసాధ్యమేమీ కాదు. ఒకదానికోసం ఇంకొకటి విడిచిపెట్టాల్సిన అవసరమూ లేదు. రెండవదేమిటంటే- మనం చాలా అదృష్టవంతులమి. మన దేశంలో మనకి ఇంకా అత్తమామల, తల్లితండ్రుల సహాయం, అండాఉన్నాయి. పాశ్చాత్య దేశాల్లో ఆ వెసులుబాటు కూడా లేదు.

ఈ మధ్యకాలంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఆలోచనాధోరణి మారుతోంది.యువతులు తమ ఛౌయిసెస్ బాహాటంగా వ్యక్తపరచగలుగుతున్నారు. డాక్టర్ వద్దకి వెళ్ళి “ నేను లేటుగా పెళ్ళి చెసుకుంటానని నాకు తెలుసు. నా ఎగ్ ని ఫ్రీజ్ చేయడం సాధ్యమేనా?” అనో లేక ”బహుశా, మేము పిల్లల్ని తరువాత కంటామేమో. మేమొక ఇల్లూ, కారూ కొనుక్కునేవరకూ,నా ఎంబ్రియోని ఫ్రీజ్ చేయడం సాధ్యమా?” అనో లేకపోతే “ నేను గర్భవతిగా ఉన్నట్టు ఆఫీస్లో కనిపించకూడదు. సరొగసీ సంభవమేనా?” అనీ అడుగుతున్నారీ మధ్య. అది చదువుకున్నవారి విషయంలోనే అనుకోండి.

ఆధునిక మధ్య తరగతి స్త్రీకి అన్నిటినీ నిర్వహించడానికి మహాకాళి దుర్గలా ఎన్నో చేతులూ, రావణాసుడిలా పది తలల/ముఖాల అవసరమూ చాలానే ఉందనిపిస్తోంది.

“NOTHING WILL WORK UNLESS YOU DO.” – MAYA ANGELOU

– క్రిష్ణ వేణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, కృష్ణ గీతPermalink

14 Responses to కృష్ణ గీత (శీర్షిక )- సారూప్యం – క్రిష్ణ వేణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో