సాగరం (కవిత) – గుత్తి కొండ

ప్రకృతిలో భాగం సాగరం
ఇది ప్రపంచానికి సుందరం
సాగరానికి అందం సూర్య బింబం
సాగర సూర్యోదయమే మనకానందం

కడలి కలుపును దేశదేశాలను
ఇముడ్చుకొనును ఉప్పొంగిన వరదలను
పుడమికందించును వర్ష పాతమును
సమస్త జీవకోటి వికసించును మరి హర్షించును

ఆటుపోటుల తీరమునందు
కడు ప్రశాంతత నది సంద్రమందు
కడలి పుత్రులకావాసం కోస్తా తీరం
నౌకలకు నిలయం సముద్ర తీరం

సాగరమా ! సృష్టించకు సునామీలను
మరి పుట్టించకు పెను తుఫానులను
సాగరమా ఆగ్రహింపకు ము ! నీ ముందు మేమెంత ?
చల్లంగ వుండనిమ్ము ! నీ పాదాల చెంత

                                                                                – గుత్తి కొండ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , Permalink

Comments are closed.