నెలద -10(ధారావాహిక )- సుమన కోడూరి

రమణ వచ్చి ఎవరమ్మా పేరేంటి ఏ ఊరు అని వెంటవెంటనే ప్రశ్నించే సరికి ఉలిక్కిపడి సర్దుకుని ఆ …….అమరావతి … శాంత అన్నాడు స్వరం అపభ్రంశంగా ఉంది .

రమణ అనుకున్నది నాలాటి వ్యక్తేనేమో అని ఆ స్వరం విని .
ఆ …. ఎవరూ అంటూ అక్కడికి వచ్చిన నేలడను చూసి తత్తర పది నిలుచున్నాడు శౌరి . ఆమె ఆశ్చర్యంతో చూస్తూ ఈ దుస్తులు నావి మీ వద్దకెలా వచ్చాయి ధరించి ఉన్నారూ కొంచెం గద్దించినట్లు అనుమానంగా ప్రశ్నించింది .
ఆ …. అమ్మా అదీ అంటూ వంగి చేతులతో ఆమె పాదాలు ముట్టుకున్నట్లు వినయంగా వంగి స్పృశించి లేచాడు .
ఆమె వెనక్కి జరిగి సరే సరే ముందు నా సందేహం తీర్చండి అన్నది కటువుగా .

తెలియదండీ నేను అమరావతి నగరం నుండి వచ్చాను ఇన్నాళ్ళ ప్రయాణం వలన బాగా అలసి సొలసి మొన్నటి రాతిరి ఒక ఇంటి ఆవరణంలో పడుకున్నాను . ఎవరో దుండగులు నన్ను తీసుకు పోయేందుకు ప్రయత్నించగా తప్పించుకునేందుకు పరుగెత్తి ముళ్ళ పొదల్లో దాకున్నా నా దుస్తులన్ని చీలికలు పడ్డాయి . ఆ దుస్తులతో ఎలా తిరగాలో అర్ధం కాక బాధ తో చీకటి సమయాన నడుస్తుంటే దారిలో ఓ పొద పై ఈ అందమైన దుస్తులు కన్పించాయి . తప్పదని అవి తీసుకుని వేసుకున్నాను . ఇక్కడికి వచ్చాను నా అదృష్టం కొద్దీ మీ వంటి వారి ఆశ్రమానికి వచ్చాను అన్నాడు .

ఓ అలాగా ఈ వేళ ఉదయం తొలి ఝామునే చైత్ర పూర్ణిమ అని నదీ స్నానానికి వెళ్ళాము అక్కడ నా దుస్తులు ఎవరో తస్కరించారు . అవే ఇవి .కాకపోతే అలా దొంగిలించటం ఎందుకో ? పొదలపై పడవేయటం ఎందుకో? అర్ధం కావడం లేదు అన్నది .

అదామ్మా మీ వంటి భాగ్యవంతులు దుస్తులకు అలంకరణగా నవరత్నాలు పోదుపుకుంటారు . అందంగా చిత్రాల్లా కన్పించేందుకు పైగా బంగారు జరీ వెండి జరీ ఉన్న పట్టు దుస్తులే వాడుతూ ఉంటారు కదా బహుశా అలాటి వాటి కొరకు తస్కరించి అవన్నీ తీసుకుని పడేసి ఉంటారు తేల్చేసినట్లు తీర్పిచ్చాడు శౌర్య . అంతమంచి యోచన వచ్చినందుకు తనను తానే అభినందించుకుంటూ

అంతే అయుండచ్చు సాలోచనగా అన్నది నెలద . ఇంతకూ తమరు ఇంత దూరం వచ్చిన పనీ ప్రశ్నించింది .
అదేనమ్మా చెప్పాలనుకుంటున్నా మాతల్లి దండ్రులు ఈ మధ్యనే పోయారు . మా అమ్మ చెల్లి పద్మావతి ఆమె భర్త వెంకట రామనాయకుడు కొలువు చేసేది సీమ పాలకుల వద్ద అని చెబుతుండేది . ఇపుడే నేనిలా ఒంటరినై పోతానని ఊహించక అంతకన్నా వివరాలు అమ్మ నెపుడూ అడగ లేదు . ఇపుడు నాకంటూ అయినవారున్నా రనే ఆశతో వెదకుతూ వచ్చాను అన్ని సంస్థానాలలోనూ వాకబు చేశాను సరైన విషయం లభ్యం కాలేదు . కొంచెం దుఖ పడుతున్నట్లు చెంగుతో కళ్ళు అద్దుకుని గొంతు వణికించాడు .

అయ్యో పాపం ఇంతటి విషాదమున్నదనే విషయం తెలియక బాధ పెట్టాను మన్నించండి ముందు కూర్చోండి మాట్లాడుకుందాం అన్నది నెలద .

హమ్మయ్య నమ్మించ గలిగాను . ఇక కోటలో పాగా వేయటం ఎలా అనేది ఆలోచించాలి . అధిక సమయం వృధా చేయకనే ఆ రాకుమార్తెను కుమారుని వెదికి చంపి వేసే ప్రయత్నం చేయాలి . రాణి గారి మెప్పు పొంది తీరాలి ధృడంగా అనుకున్నాడు శౌర్య .
ఏంటి ఆలోచిస్తున్నారు ప్రశ్నించింది నెలద ఆ … ఏం లేదు నేను ఎవరో తెలియకున్న చక్కగా ఆతిధ్యం ఇచ్చి మర్యాద పూర్వకంగా మాటాడుతున్నారు అన్నాడు .

అయ్యో అందులో ఏముంది సాటి స్త్రీలు పాలెగాండ్ల పాలన ప్రాంతానికి వచ్చారు . ఇక్కడ రక్షణ అదీ కొంచెం సమస్యే అనుకోవాలి . మీ బంధువుల ఆచూకీ దొరికే వరకు మీరు మా ఇంట తలదాచుకోవచ్చు . కనుక్కోవటంలో నేను మా తమ్ముడు కూడా సహాయం చేస్తాం హామీ ఇచ్చింది నెలద .

– సుమన కోడూరి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, Permalink

Comments are closed.