దేశ దిమ్మరి (కవిత ) – ఇక్బాల్ చంద్

1
జోలె లో దాచుకున్న సద్ది రొట్టె చాలు
ఈ పూటకు చంచల స్వప్నాలతో లేచిపోవడానికి –
చెట్టు వుంది
దాన్ని అంటిపెట్టుకుని కాసింత నీడ వుంది ,
ఇంకేమి కావాలి ,
ఆయు; లోని ఈ దినం అనే వ్రణాన్ని
కత్తిరించి పడేయడానికి –

2
ప్రతి పెరటి జామ చెట్టు పై వాలి
కాయల వైపు చూడనైనా చూడకుండా
పాడుకాకి ఎంగిలి మెతుకుల్ని ఆశపడుతూంది –
దేశ దిమ్మరికి ఇంతకన్నా చక్కని ఉపమానాన్ని ఎవరు
చెప్పగలరు

3
బండరాళ్ళను కొట్టుకొని వొరిగి పోతున్న సముద్రపుటలల్ని
ఎప్పుడూ చూడలేదా ?
గాలిలో ఎగురుతూ ఎగురుతూ ఆకస్మికంగా రెక్కలు రాల్చుకొని
నెల మీద పడి టపటపా కొట్టుకొంటూ
మళ్ళీ లేచిపోయే మిడత ఎక్కడైనా కన్పించలేదా ?
దీపం కింద నక్కివున్న బల్లి కంట్లోకి పొడిచాక
ఆశలు వదులుకొని
లేచిపోవడానికి ప్రయత్నిస్తున్న శలభాన్ని చూడలేరా ?

అయితే దేశదిమ్మరి అంతరంగం
మీకు కచ్చితంగా అపరిచితమే !

4
గాలి వీచినప్పుడు గలగలా ఆకులు కదిలినంత సహజంగా
దేశ దిమ్మరి మెదడు లోని మహాసర్పం
పడగలిప్పిన ప్రతీసారి
తనను తానే కాటేసుకుంటుంది
అతి ఎత్తైన శిఖరం మీంచి జరజరా
జారిపోయి మరిదేనిలోనో కలిసిపోయే నదికి మల్లే

ఒకచోట నిలువని కాలేకాడు
మరే చోటుకు స్థిరమవ్వక
తేలితేలి పోయే నిర్లక్ష్య పూరిత నిర్గమ్యం

దేశదిమ్మరి –
దుర్గంధం పై వీచి మలినమైన సుగంధం –
దేశ దిమ్మరి కళ్ళు –
ఆడుకొంటూ జారిపడిన
చిన్నపిల్ల విరిగిన లేతకాలు బాధ –

మోతి మజీద్ ముందు కాళ్ళు చేతులు లేని మొండి దేహం
అడుక్కొంటూ అల్లా అల్లా అని అరుస్తున్న
దీన కేకల్లోని కంపనాలు –
ప్రేమ రాహిత్యపు దేశ దిమ్మరి ఆత్మకథకు పరిచయ వాక్యాలు –
కురుక్షేత్రంలో దిక్కులేని చావు చస్తున్న వాడి తలను
గద్దలుపోడుస్తున్నప్పటి శబ్దాలు
దేశ దిమ్మరి మహా కావ్యానికి ముగింపు శోకాలు –

– ఇక్బాల్ చంద్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో