నిత్య సంఘటనల సమాహారం “ రాణి పులోమజా దేవి కథలు” – అరసి

?????????????

రచయిత్రి ఇప్పటి వరకు సుమారుగా వందకు పైగా కథలు , పలు కవితలు రాసారు .ఈ పుస్తకం రాణి పులోమజా దేవి కథలు . ఏఎ సంపుటిలో మొత్తం 37 కథలున్నాయి . అంకుల్ నన్ను దత్తు తీసుకోవూ ! కథతో మొదలై మబ్బు విడిచిన ఎండ కథతో ముగుస్తుంది .

అంకుల్ ! నన్ను దత్తు తీసుకోవూ !” పెద్ద వాళ్ల ప్రవర్తనకి , చిన్న పిల్లల మనస్తత్వానికి అడ్డం పట్టే కథ ఇది . ఎదురింటి , ప్రక్కింటి వాళ్లు తమ పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారో , చూసినప్పుడు ఒక పసి హృదయం ఏ విధంగా తల్లడేల్లిందో , ఏమి ఆశించిందో అనేదే ఈ కథ .

సమాజంలో కన్పించే మూఢ విశ్వాసాలు , బాల్య వివాహాలు అనేవి ఇప్పటికీ ఏదో ఒక మారుమూల కొనసాగుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు . అవి చివరకి కట్టుబాట్లు , సమాజం తీరు ప్రవర్తన , ఆధునిక విలాసాల మధ్య ఒక మనిషి ఏ విధంగా బలవుతున్నారో అనేదే సావిత్రి కథ సారాంశం . చేదుని నింపిన చక్కెర కాలానికి ఎదురీది చివరికి బ్రతకలేక తనువు చాలించిన ఒక అభాగ్యురాలి కథే ఇది . ఎవరు లేకుండా ఒక అనాధ గా ఈ లోకాన్ని చూసిన తను అందరు అందినట్లే అంది దూరమైపోయి , చివరకు ఒంటరిగా మిగిలిపోయి తనువు చాలిస్తుందామే . అన్నీ తెలిసి వివాహం చేసుకున్న భర్త మరణాన్ని సహించినా , విధి తనని చిన్న చూపు చూసి కడుపునా పుట్టిన బిడ్డను తీసుకుపోవడంతో ఆ తల్లి తట్టుకోలేక పోతుంది .
తనకి అయిదారు సంవత్సరాల వయసు తేడా ఉన్న అమ్మాయిని తనకి పిన్నిగా తీసుకు రావడం , అదీ వాళ్ల అమ్మ బ్రతికుండగానే జరగడం , సమాజం వేసే నిందలకి , అపార్ధాలకు మగాడు ఆడదాన్నే బలి పశువుని చేయడం వంటి సంఘటనలతో జీవితం మీద ఒకన అభిప్రాయంకు వచ్చిన సగటు ఆడపిల్ల ఆవేదనే “ తపన “. ఇద్దరి మనస్సుల మధ్య అంతరంగాలలో అల్లుకున్న అభిప్రాయాలు , ప్రేమల తాలుకు జ్ఞాపకాలను పదిలంగా చూపించిన కథే “మనసున మనసైన” లో తపన్ , సలీల కన్పిస్తారు .

మనుషుల మన్స్తత్వాలలోకి , వారి ఆప్యాయతలకి అద్దం పట్టే కథే “సుమతి” . చిన్న పిల్లల మనసు తెలుసుకుని వారికి తగినట్లు , వాళ్ల మనసు నొచ్చుకోకుండా చెప్పడమే “అమ్మా ! నీకు అమ్మను కావాలనుంది “ కథ .పిల్లల్ని పెంచి ,పెద్దచేసి వారి కోసం తమ శరీరాన్ని , కష్టాల్ని మరిచిపోయి , చివరకి వాళ్ల ఆస్తుల్ని కోల్పోయిన తమ పిల్లలు సుఖంగా ఉంటె చాలు అనుకునే తల్లిదండ్రులకు , తమ కాళ్ల పై నిలబడ్డాక తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది . అలాంటి ఎన్నో వ్యథలకి ఈ కథ ప్రతీకగా నిలుస్తుంది . నింతరం ఒక జీవితం బిజీబిజీగా గడిచిపోయే పట్టణా వాసుల జీవితంలో ఒక్కొక్కసారి మనసు మార్పును కోరుకోవడం సహజం . కాని మనకు నిత్యం ప్రపంచంగా అదే లోకంగా గడిచిపోయి వాటిని వదిలి ఒక రెండు రోజులు ఉంటే , వాటి విలువ తెలుస్తుంది . మనసు మళ్లీ “ మార్పు కోరే మనసు” అవుతుంది .

చాలా మంది ఆడవాళ్ళ జీవితంలో కన్పించే విదారకమైన సంఘటనే “ కోయిలా! కోయిలా! కూయబోకే !” . జీవితంలో మాట్లాడిన మాటలకి , ప్రవర్తించిన తీరు , చివరకి వారు ఏ విధంగా జీవిస్తున్నారు అనేదే కాకి పెళ్లాం కాకికి ముద్దు కథ , ఎదుటి వాళ్లకి సాయం చేయాలి అనే గుణం ఉండాలే కాని , మన కష్టాలు డానికి అడ్డం రావని చాటి చెప్పే కథే “ సుదూర తీరాలు “ , భార్య భర్తల ఆప్యాయతలకు , అనురాగాలకు , నమ్మకానికి నిదర్శనం “ సరితా సాగరం “, ఎక్కువ చదువుకున్న అందమైన తెలివి గల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నలుగురిలో అవమానం కావాల్సిందే అనే అపోహతో జీవితాన్ని దుఖం చేసుకున్న కథే “ ఆట బొమ్మలు “,

తల్లిదండ్రుల మాటలు , ప్రవర్తన , ఆలోచనలు పిల్లలపై ప్రభావం చూపితే అవి వారి జీవితాలను ఏ విధంగా మారుస్తాయో చెప్పేదే “ పెంపకం “ కథ . మధ్యతరగతి మనుషుల సంకుచిత మనస్తత్వాలు , వాళ్ల సంబంధాలు ఎలా ఉంటాయో పిన్ని గారి కథే నిదర్శనం . పెళ్లి చూపుల్లో అమ్మాయిలు పదే అవస్థలు , మధ్యతరగతి జీవితాలలో పెళ్లి అనే తంతు ఏ విధంగా వారి జీవితాలను శాసిస్తుందో అనేదే “ బ్యాన్ ది మ్యారేజ్ “ లో చిత్రించారు రచయిత్రి . బానిసత్వానికి, వెట్టి చాకిరికి బలైపోతున్న బీద , పేద జీవితాల కథయే “ అక్షర ఉగాది “, ఆధునిక పోకడలు తెలుగు సంప్రదాయాలు , సంసృతులను ఏ విధమైన మార్పులను తీసుకు వస్తున్నాయో అనేదే “అయితేనేం “కథ .

మనం చూసే దృష్టి , మన అవసరాల కోసం ఏవిధంగా ఎలా మారిపోతుందో చెప్పే కథే దృష్తి భేదం “ అవసరం ఉన్నప్పుడు ఒకలా , అవసరం లేనప్పుడు మరొక ప్రవర్తించే తీరే ఈ కథ ప్రతీకగా మలిచారు రచయిత్రి . ఇవే కాకుండా అమ్మ నిన్ను చూస్తే జాలేస్తోంది , అయ్యో పాపం , ముఖ్య అతిధి , అలిపిరి టిక్కెట్టు , చింత చింత , కుక్కకు కోపమొచ్చింది కథలలో కథనం మన చుట్టూ జరిగిన , జరుగుతున్న సంఘటనల సమాహారమే .

 కథలలో కధనం , పాత్రలు సహజంగా రావడానికి , చదువరుడికి దగ్గరగా తీసుకు వెళ్లడానికి మన పలుకు బడులు , సామెతలు ఎంతగానో ఉపకరిస్తాయి అనడంలో ఈ కథలే సాక్ష్యాలు . ఈ కథలలో రచయిత్రి అవసరమైన చోట సామెతలను పాత్రలచే చెప్పించిన తీరు సహజ స్థితికి దగ్గరగా పాఠకుడి ని తీసుకురాగలుగుతుంది . “ అత్త మీది కోపంతో బిడ్డను ఆలి పొయ్యిలో దూర్చిందట వెనకటికి కోడలెవతో” , “నన్ను ముట్టుకోకు నామాలకాకి” , “ఊరంతా ఒక దారైతే ఉలిపి కట్టేది ఒక దారి” , “పూజు కొద్ది పురుషుడు , దానం కొద్ది బిడ్డలు” , “తనదాకా వస్తే కాని తెలీదు” ,” కాలు కాలిని పిల్లిలా ఇల్లంతా తిరగటం “ సామెతలు కథా గమనంలో కన్పిస్తాయి .

ఈ కథలలో ప్రస్తావించవలసిన మరొక అంశం కధానాయికల పేర్లు అచల , దైవో పహత , సంశయ , సలీల , సువీర , హృదయ , ముక్త , సమర్ధ , విభవ , యామిని అంటూ రచయిత్రి ఆ కథకి , వారికి ఎదరయ్యే సంఘటనలకు , వారి మానసిక స్థితికి తగినట్లు ఆ పాత్రలకు ఆ పేర్లు అతికినట్లు సరిపోయాయి . ప్రతి ఒక్క చదువరి చదవాల్సిన మంచి పుస్తకం ఈ కథలు . 

– అరసి

ప్రతులకు :

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక పరిచయం, పుస్తక సమీక్షలు, , , Permalink

One Response to నిత్య సంఘటనల సమాహారం “ రాణి పులోమజా దేవి కథలు” – అరసి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో