మెట్లు(కవిత)-అల్లూరి గౌరీలక్ష్మి

Alluri Gowri Lakshmi

Alluri Gowri Lakshmi

పాపా లోపలి పో ! బాబూ నువ్వెళ్ళి ఆడుకో !
ఏమిటీ వివక్ష ! ఎందుకీ శిక్ష ?
ఆక్రోశిస్తూనే నాడు ఎదురీత మొదలయ్యింది
ఊళ్లేలాలా ? అన్న నోళ్ళే ఫ్రీ అయితే చదువు అన్నాయి
ఉద్యోగం చేస్తున్నా – వంటిల్లు సగమంటే
షరతైతే మానేయ్ – జీవన సహచరుడి సన్నాయి స్వరం
ఆఫీసులో అన్యాయాలకు గొంతెత్తి గీ పెట్టి
ఎవరి అడుగులకూ మడుగు లొత్తనని
సొంత నైపుణ్యం, నిజాయితీ చూపించబోతే
పనికి మాలిన సీటే నీ గతన్న సుపీరియ రు
ఇంటా బయటా చాలని సమయం
బ్రతుకు విశ్రాంతి దొరకని బొంగరం
నిరాశా, నిస్పృహ ల్ని తరిమి కొట్టి
ప్రమోషన్ పరీక్షలో ప్రధమంగా రాణించి
పిల్లలిద్దరితో గృహ లక్ష్మి గా భాసించి
లింగ వివక్ష లేని కొత్త తరాన్ని పాదు కొల్పి
సాగుతున్న నవ యువతని చూసి మురిసేంతలో
రాతి యుగపు రాక్షసత్వం విజ్రుం భించి
వావి వరస మరిచి తల్లి, చెల్లిపై అరాచకమైంది
జంతు సంస్కారం విప్పిన జడల్ని చూసి
సమానత్వపు మెట్లన్నీ ఎక్కి మ్రాన్పడిన స్త్రీ
కర్తవ్యం మరిచి ఒంటరై దిక్కు తోచక నిలబడింది
ఇందుకేనా ! అంత పోరాటమని నివ్వెర పోయింది
ఆదర్శాలూ, ఆశయాలూ మౌన ముద్ర దాల్చాయి
తెగిన తర తరాల శృంఖలాలు నిస్తేజమై పోయాయి
అప్పుడామె ఎక్కొచ్చిన మెట్లన్నీ ప్రేమగా చూసాయి
విను మా మాటని వెన్ను తట్టి నిలిచాయి
విజయమనేది ఓ రహదారి గమ్యం కాదన్నాయి
నువ్వేసిన ప్రతి అడుగూ దేనికదే గమ్యం అన్నాయి
లింగ భేద మెరుగని స్వప్న సమాజ సాకారానికి
అలుపెరుగక ముందుకు సాగమన్నాయి

– అల్లూరి గౌరీలక్ష్మి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , Permalink

2 Responses to మెట్లు(కవిత)-అల్లూరి గౌరీలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో