నా కళ్లతో అమెరికా- 45 (యాత్రా సాహిత్యం ) – కె . గీత

మొర్రోబే- బిగ్ సర్

దూరం నించీ మురిపించిన “మొర్రో రాక్” చుట్టూ ఉదయం నించీ ప్రదక్షిణలు చేస్తూ, చుట్టూ ఉన్న విశేషాలు చూస్తూ అక్కడక్కడే తిరుగుతూ ఉన్నా తనివితీరని ఆనందం ఏదో వెంట తరుముతూ ఉంది. పర్వతానికి ఎడమ వైపుగా ప్రశాంతమైన నీటిలో ఆవలి తీరానికి బోట్ లో చేరి ఇసుకలో ఆటలాడుకోవడం, డౌన్ టౌన్ లో విశేషాలన్నీ చుట్టి రావడం తో ఉదయమంతా ఆనందంగా గడిచింది.
మధ్యాహ్న భోజనాలయ్యేక పర్వతానికి రెండో వైపుకి చేరేం.

రెండో వైపు:- ఉదయం నించీ చూసిన సముద్ర తీరం వేరు, రెండో వైపు భీకరంగా ఎగిసిపడే కెరటాలతో, నురుగులు చిమ్ముతున్న సముద్ర తీరం వేరు.
పిల్లలు నిమిషం ఆలోచించకుండా కారు దిగుతూనే కెరటాల వైపు పరుగుపెట్టేరు. కెరటాలు లేని లేని నిశ్చలత్వం పెద్దవాళ్లకి నచ్చుతుందేమోగానీ, పిల్లలకు కాదు. కదిలే కెరటాలలో చేతులు సాచి పిలిచే లక్షణం ఏదో పిల్లల్ని ఆకర్షిస్తుందనుకుంటా. ఎప్పుడూ కెరటాలవైపు ఆగకుండా పరుగులు పెడ్తారు. తీరా దగ్గరికి వెళ్ళేక నీళ్ల భయం వల్ల వెనక్కి తుర్రున పరుగెత్తుకొస్తారు.
చక్కని నును వెచ్చని, తెల్లని ఇసుకలో అప్పటికే తీరమంతా జనంతో నిండి ఉంది.

ఈ యాత్రా చిత్రాలను ఇక్కడ క్లిక్ చేసి చూడండి .

ఆ రోజు సాయంత్రం సంధ్యా కాంతుల్ని, సూర్యాస్తమయాన్ని చూసే వరకు సముద్ర తీరంలోనే గడపాలని ముందే నిర్ణయించుకున్నందున పిల్లలకి సమయం పట్ల నిబంధనలేవీ పెట్టలేదు. స్థిమితంగా తీరంలో దుప్పటి పరిచి విశ్రమించాను. సత్య పిల్లలతో నీటిలో అవిరామంగా ఆడుతున్నాడు. కళ్ల మీద మెరిసే ఆకాశం. చెవులకి లయబద్ధంగా వినిపిస్తున్న సముద్ర సంగీతం, మధ్య మధ్య అక్కడున్న అందరి పిల్లల కేరింతలు, విశ్రమించిన శరీరానికి నును వెచ్చని ఇసుక మెత్తని లేపనం. గంట సేపు ప్రపంచాన్ని మరిచి హాయిగా నిద్రపోయాను.

నేను లేచి చూసే సరికి పిల్లలు తడి ఒంటితో తడిసిన పిచుకల్లాగా నా వైపు వచ్చి ఇసుకలో పొర్లడం, అంతలోనే ఇసుకను వదిలించుకోవడం కోసం వాళ్ల నాన్న దగ్గరికి నీళ్ల లోకి పరుగెత్తడం చేస్తున్నారు. ఇక బాగా అలిసిపోయిందేమో కాస్సేపట్లోనే వచ్చి, ఇసుకలో చతికిలబడి నా కాళ్లని లాగి గుజ్జన గూళ్లు కట్టడం మొదట్టింది సిరి.

సముద్రం, ఆకాశం, పర్వతం ఒకదానితో ఒకటి పోటీ పడుతూ మురిపించిన “మొర్రోబే” లోని ఆ సాయంత్రం ఇంత వరకూ నేను చూసిన అన్ని సముద్ర తీర ప్రాంతాలలో మొదటి స్థానాన్ని పొందింది.

మేం వెళ్లిన సీజన్ లో సంధ్యా సమయం 7 గంటల వేళ మొదలయ్యింది. ఆరు గంటల వేళ అక్కడి నుంచి బయలుదేరి ముందు రోజు దూరం నుంచి మొర్రో బే ని చూసిన అందమైన దృశ్యాన్ని ఈ సారి తనివితీరా చూడడం కోసం బయలుదేరేం. అంటే అక్కడి నుంచి 3, 4 మైళ్ళు దాటి మళ్లీ కాయూకోస్ కి వచ్చేం.

మేం వెళ్లేటప్పటికి చాలా మంది మాలానే సంధ్యా సొగసుని చూడడానికి వచ్చి ఉన్నారు. మాకు కారు పార్కింగు దొరకలేదు. ఒక చోట రోడ్డు పక్కనే కారు ఆపేం. కానీ అక్కడ పార్కు చేసి వెళ్లిపోవడానికి లేదు. పిల్లలని కారులోనే ఉంచి ఇద్దరం ఒకరి తర్వాత ఒకరం కాస్సేపు చొప్పున వెళ్ళి అలా తిరిగి వచ్చేం. ఇక పూర్తిగా సంధ్యా సమయంలో పరుగున అందరం వెళ్ళి త్వరగా వచ్చేసేం. అక్కడి నుంచి సూర్యాస్తమయాన్ని చూడడం భలే అందమైన అపురూపమైన దృశ్యం.

ఎంత సేపున్నా ఇంకాస్త సమయం గడపాలని అనిపించే ఆ చోట ఒక వైపు నించి సూర్యుడు సముద్రంలో మునకలేసేందుకు పసిపిల్లవాడై పరుగులెడ్తున్నాడు. ప్రతీ సాయంత్రమూ మునకలేస్తూ ఉన్నా తరగని సూర్యుని ఉత్సాహానికి అత్యున్నత సాక్ష్యంగా పర్వతం భూమి మీంచి
మాకు చేతులూపుతూ ఉంది.

ఇండియన్ రెస్టారెంట్ అక్కడి నుంచి చాలా దూరం ప్రయాణిస్తేనే గానీ కనిపించదు. రాత్రి భోజనానికి పిల్లలు రోటీ, పనీర్ బటర్ మసాలా తింటామని పేచీ పెట్టడంతో తప్పలేదు మాకు. కడుపు నిండా భోజనం చేసి ఉదయపు నించి సాయంత్రం వరకూ గడిపిన అందమైన క్షణాల తాలూకు ఆహ్లాదంలా, తిరిగి వచ్చేటపుడు చల్లనిగాలి కారు అద్దాలనించి రివ్వున తాకింది.

మర్నాడు ఉదయమే మా తిరుగు ప్రయాణం. మొర్రో బే నుంచి తిరిగి రావడానికి నుంచి మనసు బెంగ పడి నేను అక్కడే కూర్చుని ఉంటే, నా గురించి బాగా తెలిసిన పిల్లలు నిశ్శబ్దంగా అయిపోయేరు. సత్య నా దగ్గిరికి వచ్చి “నువ్విలా బెంగ పడకుండా నా దగ్గిరొక ఐడియా ఉంది. ఇవేళ మన తిరుగు ప్రయాణమంతా సముద్రతీరం నించే చుడుతూ వెళ్దాం” అన్నాడు. అదెంత మంచి ఆలోచనో ఆ సాయంత్రం ఇంటికొచ్చేవరకూ దాటి వచ్చిన తీర ప్రాంతపు రహదారి చెప్పింది.

బిగ్ సర్ :- వెనక్కి వచ్చే దారిలో సముద్ర తీరపు అందాల్ని చూస్తూ రావాలంటే హైవే 1 మీంచి రావాలి. వరసగా కాయుకోస్, కాంబ్రియా, హార్ట్స్ కాసిల్ ఉన్నసాన్ సిమియన్, రాగ్గెడ్ పాయింట్, లూకాస్ ల మీదుగా వస్తే “బిగ్ సర్ ” వస్తుంది. దార్లో రాగెడ్ పాయింట్ దగ్గిర సముద్రాన్ని చూస్తూ ఎత్తు నించి నడవగలిగిన వాక్ వే ఉంది. మంచి నును వెచ్చని ఎండలో ఆహ్లాదమైన సముద్రపు గాలి పీలుస్తూ ఆరోగ్యవంతమైన నడక అది. కానీ వదిల్తే తారాజువ్వలా పరుగెత్తే సిరి తో సాధ్యమయ్యే పని కాదది.

కొండల మీద మలుపులు తిరుగుతూ ఎత్తున సాగే పూర్తి ఘాటు రోడ్డు ప్రయాణం అది. ఆ మలుపుల్లో మధ్యాహ్న భోజనానికి దారి పక్క కనబడిన ఒకే ఒక్క కొండవాలు రెస్టారెంటులో ఆగేం. చాలా అద్భుతంగా కొండ చివరనున్న ఆ చోటి నుంచి అద్దాల కిటికీ పక్కన కూచుని కనుచూపుమేర దిగువన కనిపించే నీలిమను కళ్లనద్దుకుంటూ భోజనం చేయడం గొప్ప అనుభూతి.

బిగ్ సర్ కి ముందు మలుపు తిరిగినప్పటి నుంచి అడుగడుగునా కనిపించే పర్వత ప్రాంతాల మీద ఆకాశం వైపు చేతులు సాచిన చెట్ల గుబుర్ల సందుల నించి అలలై దోబూచులాడే కెరటాల్ని చూస్తూ మైమరిచి పోవాల్సిందే. బిగ్సర్ కాలిఫోర్నియా మధ్య తీర ప్రాంతాలలో మంచి ప్రఖ్యాతి చెందిన ప్రాంతం. అక్కడ సముద్రంలోకి దుమికే జలపాతం కనువిందు చెయ్యడమొక్కటే కారణం కాదు. తీరానికి ఎగువన దట్టమైన అరణ్యం మరొక కారణం. ప్రకృతి ప్రేమికులు తప్పని సరిగా చూసి తీరాల్సిన ప్రాంతాలలో ఒకటి ఇది. స్పానిష్ భాషలో బిగ్ సౌత్ అనే పదమే బిగ్ సర్ (Big sur) గా మారిందట. ఇక్కడ సముద్ర కెరటాలలోకి తీరాన్ని ఆనుకుని ఉన్న కొండ లో నుంచి “మెక్వే” జలపాతం కురుస్తూ సందర్శకులకి కనువిందు చేస్తుంది. కానీ అది చూడడానికి వెళ్లే త్రోవ సరిగా లేనందున రోడ్డు పక్క కారు ఆపుకుని కిందకు దిగాల్సిందే. మేం వెళ్లేసరికి దగ్గర్లో కారు పార్కింగు దొరకక ఎక్కడో ఆపి నడవాల్సి వచ్చింది.

వచ్చే త్రోవలో “బిస్బీ క్రీక్ బ్రిడ్జి” రెండు కొండల్ని కలుపుతూ కట్టిన అత్యంత సుందరమైన బ్రిడ్జి. కిందకు కారు వెళ్లే మార్గం ఉన్నందున దిగువన సముద్ర తీరం వరకూ వెళ్లి చూసి రావొచ్చు. నిజానికి మొర్రోబే నుంచి ఉత్త్రంగా మేం వచ్చిన సముద్ర తీరపు రహ దారిలో ప్రతీ ప్రదేశమూ ఆగి చూడాల్సినవే. వేటికవే ప్రత్యేకమైన అందాల్ని సంతరించుకున్నవి.

ఇరవయ్యవ శతాబ్దపు ప్రఖ్యాత రచయితలైన రాబిన్ సన్ జెఫర్స్, హెన్రీ మిల్లర్ వంటి వారు బిగ్ సర్ ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులై ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నారంటే అతిశయోక్తి కాదు.

ఆ రోజు సంధ్య వేళకి సముద్ర తీరంలో చివరి స్థలమైన కారమెల్ కి చేరుకుని మెత్తని ఇసుకలో మళ్లీ తనివితీరా ఆడుకుని, సంధ్య కాంతుల్ని కళ్లనింపుకుని, రాత్రి పదిగంటల వేళ ఇల్లు చేరుకున్నాం. కళ్లల్లో దాగున్న సముద్ర తీరం కలల్లోనూ అలలై కదలాడిందని వేరే చెప్పాలా!
———–

-కె.గీత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

యాత్రా సాహిత్యం, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో