గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

తెల్లని చీర, రవిక, వంటి నిండా పచ్చని పసుపు, కళ్లకు నిండుగా కాటుక నుదుట కుంకుమ తిలకం, కనుబొమల నడుమ దిష్టివిభూది, నోటి తాంబూలపు ఎరుపు, చెవులలో దూది, చేతులకు ఆకుపచ్చ గాజులు ఆ బాలింతరాలు మాతృత్వపు పవిత్రతతో, నిండుగా వుంటుంది. 21వ రోజు వెళ్ళే వరకు ఆమె తడిలోకి వెళ్లరాదు. ఏ విధమైన గృహ కృత్యాలు చేయరాదు. పసిబిడ్డను కనిపెట్టుకొని పూర్తిగా విశ్రాంతితో వుండాలి. ఆమెకు ఆహారం మొదటి పదిరోజులవలే కాక పుష్టికరమైనది ఇస్తారు. కంది పప్పు, మినపప్పు, కూరలు, పాలు, మజ్జిగ పుష్కలంగా ఇస్తారు. 21వ రోజు వరకూ మళ్లీ నెల పురుడు అని పాటించేవారు. పసికందు, తల్లి కూడా గది దాటి బైటకు రారాదు. వారు ఎవర్ని తాకరాదు. ఎవరూ వార్ని తాకరాదు. బయట నుండి సోకే సూక్ష్మజీవుల నుండి వీరిని రక్షించడానికి ఈ ఆచారాలు పెట్టారు.

సర్వులూ ఈ ఆచారాన్ని నియమంగా పాటించేవారు. నేటి పౌడర్లు, క్రీములు, అలీవ్ ఆయిల్ వంటి పదార్థాలు లేని ఆ రోజుల్లో పసుపూ, నూనె, ఆముదం మాత్రమే రోగ నిరోధకాలు, చర్మ పోషకాలూను, తెల్లవారు రaామునే ఆముదం పట్టాక బిడ్డ కంటికి నూనో, ఆముదమో రాసి వుంచే వారు. తామరలు విచ్చేవేళ బిడ్డకు కాటుక పెడితే కళ్లు తామర రేకుల్లా వుంటాయని తలచేవారు. స్నానం చేయించాక మళ్లీ సాయంత్రం ఉగ్గుకుడిపాక రోజుకు మూడు మార్లు కాటుక పెట్టేవారు. స్నానం చేయించే ముందు స్వచ్ఛంగా దంపిన చాయ పసుపు రాసి బిడ్డకు స్నానం చేయించేవారు. స్నానానంతరం తిరిగి బిడ్డకు ఆముదం రాసేవారు. సాయంసంధ్య వేళ బిడ్డకు ఆముదం కుడిపాక సాంబ్రాణి పొగవేసి, నూనె వంటినిండా రాసి బొట్టూ, కాటుక పెట్టేవారు. పసిబిడ్డ చాలా విలువైనది అనడానికి నూనెబిడ్డ నూరువరహాలిచ్చినా దొరకదనేది సామెత. పసిబిడ్డ, పాలకుండ నలుగురి కంటా పడకుండా గోప్యంగా ఒకరి పోషణలోనే వుండాలని కూడా నాటి కాలం వారు నమ్మేవారు.

పసిబిడ్డకు 11వ రోజు వరకు రోజు విడిచి రోజు స్నానం చేయించేవారు. బాలింతరాలికి ఆ పది రోజులు స్నానం లేదు. 11వ రోజు నుండి 21వ రోజు వరకు బాలింతరాలికి రోజు విడిచి రోజు పసుపు రాసుకొని వళ్లు నలుచుకొని కంఠ స్నానం, పసిబిడ్డకు రోజూ శిరస్నానం. బిడ్డ పాలా, నీళ్ళా పెరగాలని బిడ్డకు వంటికి నువ్వుల నూనె మర్దనా చేసి, పెసరపిండితో నలిచి 4,5 బిందెల నీరు పోసేవారు. ఆ తరువాత సాంబ్రాణి పొగ వేసేవారు. కొందరు నీటి వేడీ, వత్తిడీ పిల్ల తట్టుకొంటుందా లేదా అని చూడకుండా కొంత మోటుగా స్నానం చేయించేవారు. శాస్త్రి గారు మాత్రం తాను స్వయంగా పాళం చూచి తమ బిడ్డల దేహస్థితిని బట్టి ఒక బిందెడు నీరు మాత్రమే పోయించేవారు. అత్తగారు సణుకున్నా ఆయన సరకు చేసేవారు కాదు.

21వ రోజున బిడ్డను ఊయలలో వేసే కార్యక్రమం జరిగేది. ప్రతి ఇంటా దూలానికి అమర్చి ఇనుప గొలుసులు వుంటాయి. పది కాలాల పాటు మన్నేటట్లుగా టేకు కలపతో బలిష్ఠంగా ఉయ్యాల తొట్టెలు చేయిస్తారు. దానికి నవారు అల్లిన చట్రం వుంటుంది. దానిలో ఒత్తుగా బొంతలు పరిచి పాపను పడుకోబెడతారు. శాస్త్రి గారు పూర్వపు పద్ధతి కాకుండా స్టాండు ఉయ్యాల చేయించారు. అది బలిష్టంగా వుండి చట్రానికి ఫ్రేము అల్లి వుండేది. దాని బిరికీలు వెడల్పుగా వుండుట వలన కాసులు అందులోంచి జారి ఓసారి క్రింద పడిరది. అందుచేత దాని చుట్టూ దిండ్లు అమర్చారు. ఆ ఊయలలో పుష్టి అయిన పిల్లలు ఇద్దర్ని పడుకోబెట్టవచ్చు. ఊయలకు మామిడి తోరణాలు, కాగితపు తోరణాలు కట్టారు. ఆ రోజుల్లో క్రొత్తగా వస్తున్న కీ యిస్తే తిరిగే ప్లాస్టిక్ పాలవెల్లి ఆ ఊయల స్టాండుకు నడుమ కట్టారు. ఊయలలో క్రిందకు కుచ్చులు వేలాడేటట్టుగా జరీ అంచుల పట్టుచీర పరిచారు. క్రితం రోజునే సుబ్బమ్మగారు తెలిసిన ముత్తయిదువలందర్నీ బొట్టు పెట్టి పేరంటానికి పిలిచి వచ్చారు. ఈ సరికి శాస్రిదంపతుల మదిలోని భయాలు తొలగిపోయి ఉత్సాహంగా వేడుకలు చేయసాగేరు. ఆ రోజు సీతమ్మగారు తల స్నానం చేసేరు. వెడల్పు జరీ అంచులు కల తోపురంగు పట్టుచీర రవికె నడికట్టు వేసుకొని కట్టుకున్నారు. ఆ రోజుల్లో బాలెంతరాలు ధరించడానికి, తెల్ల నూలు చీరలు, పట్టు చీరలు, 9 గజాలవి ప్రత్యేకంగా నేసేవారు. ఆ చీర 2 గజాల పమిటకొంగు విడచి కట్టి ఆ చీర కొంగు నడుం చుట్టూ త్రిప్పిగట్టిగా ముడి వేసేవారు ఎదర. ఆ విధంగా నడికట్టు వేస్తే బాలింతరాలికి బలంగా వుంటుందని, నడుం దృఢంగా వుంటుందని ఆ రోజుల్లో నమ్మేవారు.

పురుడు వచ్చిన నాటి నుంచి మూడవనెల వచ్చే వరకూ బాలింతరాలికి ఈ నడికట్టు వేసేవారు. ఇంటిలోని పెద్ద స్త్రీలు ఈ నడికట్టు గట్టిగా బిగించి కట్టేవారు. తనకున్న నగలన్నీ ధరించి, బాలెంతరాలి అలంకరణలో వున్న సీతమ్మగారు సాక్షాత్తు సంతాన లక్ష్మిలా వున్నారు. సుబ్బమ్మ గారు పేరంటం ముగిసాక బాలింతరాలికి, పసిబిడ్డకూ డబ్బు మిరపకాయలు దిష్టి తీసి నిప్పుల్లో పోసారు. అవి ఘాటు రాకమానతాయ? చిటపటా పేలాయి. దిష్టి పోయందని ఆ తల్లి సంబరపడిరది. ఆవు పేడ దిష్టి తీసేరు. ఎర్రని వసంతంలో మసిబొగ్గులు, ఎర్రని పూలు వేసి చెంబుతో దిష్టి తీసి, చీకటి వేళ ఆ నీరు నాలుగుదార్లు కలిసే చోట వారగా పోసారు. ఉప్పు దిష్టి తీసి నూతిలో వేసారు. ఆ ఉప్పు కరిగే వేళకు దిష్టి పోతుందట. పసివాడు కొంతసేపు పోరు పెట్టాడు. పొగవేసి దిష్టి విభూతి పెట్టాక అమ్మ దగ్గర పాలు త్రాగి వాడు హాయిగా పడుకున్నాడు.

– కాశీచయనుల వెంకట మహాలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, గౌతమీగంగ, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో