గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

ఇక్కడ ముత్తయిదువుల ఉత్సాహం మిన్నుముడుతుంది. మీమీ భర్తల పేర్లు చెప్పండి అని ఆ స్త్రీలను అడుగుతారు. మీ ఆయన పేరు చెప్తేనే కాని లోనికి రానియ్యం అని నిర్బంధిస్తారు. సిగ్గుపడుతూ, బెదురుతూ, మురుస్తూ ఎట్టకేలకు తమ తమ భర్తల పేర్లు చెప్పి వారు వారి కుటుంబం వచ్చింది తలుపు తెరవండి అంటారు బాలింతరాలు ఆమె చెలికత్తె మాకు వినపడలేదు మళ్ళీ గట్టిగా చెప్పండి అంటారు ముత్తయిదువులు. ఎలాగో లోపలికి చేరతారు ఈ స్త్రీలు. తల్లి తొలిసారిగా తోడిన నీళ్లు భద్రపరచి మర్నాడు పని బిడ్డకు పోసే నీటిలో కలపాలి. ఆ నాటి నుంచి బిడ్డ సంరక్షణా, తన పనీ, ఇంటిపని, చిన్న చిన్న పనులూ బాలెంతరాలు చేస్తుంది. మగబిడ్డ అయితే 31వ రోజు, ఆడపిల్ల అయితే 41వ రోజు వరకూ తల్లి మడికారు. ఆమె మడి వంట కాని, పూజలు వ్రతాలు కాని చేయరాదు. ఆ రోజుల్లో వంట అంటే మడికట్టుకొనే కదా చేసేవారు. 3వ నెల వచ్చే వరకూ ఆమె పత్యం చేస్తూ విశ్రాంతిగా వుండాలి. ఆ విధంగా ఆచారాల పేర పురటాలికి మంచి సంరక్షణ పూర్తి విశ్రాంతి ఇచ్చేవారు ఆ కాలం వారు.

మాఘమాసం నాటికి పిల్లవానికి మూడవ నెల వచ్చింది. వచ్చే సంక్రాంతికి పిల్లవానికి 2వ యేడు వస్తుంది. సరి నెలలో, సరి సంవత్సరాలలో ఏ వేడుకా చేయరాదు. అంచేత రథసప్తమికి సీతమ్మ గారు పిల్లవానికి భోగిపళ్లు పోయాలని సంకల్పించారు. మూడవ నెల కనుక ముద్ద కుడుములు, బోర్ల పడుతున్నందుకు బొబ్బట్లు, నవ్వులకు నువ్వుండలు. రథసప్తమికి సీతమ్మ గారు మొక్క నిలిస్తే మొక్క పెసలు పంచుతామని మ్రొక్కుకున్నారు. పెసలు ఓ రాత్రి నీటిలో నానబెట్టి రథసప్తమికి ముందురోజు ఉదయం నీరు వోడ్చి బట్టలో మూటకడుతారు. అవి రథసప్తమి నాటికి మొలకలు వచ్చి వుంటాయి. పేరంటం సెనగలు, దొడ్లో కాసిన అమృతపాణి, అరటిపళ్లు తలా రెండు, తాంబూలం, చెఱకు ముక్కలు, రేగు పండ్లు, చిలకడదుంప ముక్కలు, చలిమిడి చేర్చిన మొక్కపెసలు, ముత్తయుదువులంతా మూడు మూటలు తీసుకొని వెళ్లారు.

ప॥ శశిముఖులారా । రారే।

మన పసిబాలురకు భోగిపండ్లు పోయుదాము ॥ శశి॥
చ॥ 1. మంగళకారులూ మదన సుందరులూ
రంగుగ పీటలపై రాణింపుచున్నారు ॥శశి॥
2. అద్దంపు చెక్కిళ్లు ముద్దు లొలుకుచుండ
దిద్దిన కస్తూరి తిలకముపై నుండ ॥శశి॥
3. బంగారు వంటి మంచి బదరీ పండ్లు తెచ్చి
శిరమూన దీవించి సేసలుంతురు గాని ॥శశి॥
4. మూడేసి దోసిళ్ళు మురయుచూ శిరముపై
వేడుకతో పోయుదురు వేగమున పసిబాలురకు ॥శశి॥
5. వేంకట శివగురుని కింకర వరదూని
శంకలేకనుబ్రోచు చిన్నారి బాబులకు ॥శశి॥

అని సీతమ్మ గారు పాడారు. వంటి నిండా బంగారు నగలతో, కాళ్లకు వెండి గజ్జెలతో ఆ బాలుడు బాల కృష్ణుని తలపిస్తూ వుండేవాడు. ఒక నల్లని బట్టతో రింగులా తయారుచేసి బాలుని ముంగురులకు ఆ రింగులో నాటకాలలో బాలకృష్ణునికి వేసినటువంటి ముడివేసి దానిచుట్టూ సన్నజాజుల మాల చుట్టే వారు సీతమ్మ గారు. నాలుగవ నెలలో ఆ బాలుడు కూర్చొంటే పూర్ణపు కుడుములు, అల్లరికి చిల్లర ప్రాకితే పళ్ళు గడపదాటితే గారెలు, అన్నప్రాశనకు పదవ నెలలో ఇత్తడి గ్లాసులతో పరమాన్నం, అడుగులకు అరిసెలు, పలుకులకు చిలుకలు ఏడాది నిండేవరకూ ఆ బాలునికి అన్నీ వేడుకలే. ఏడాది నిండిన బిడ్డను చూచుకొని దంపతులు తాము ధన్యులమయ్యామనుకొన్నారు. మొదటి బిడ్డ ఏడాది నిండుతుంటే పోయింది. అంచేత సీతమ్మగారు పుట్టిన రోజు వేడుకలు చేయదలచలేదు. కానీ ఆమె ఉత్సాహం ఆగదు కదా. ఆ బాలుని తల మీద చమురు పెడుతూనే.

ప॥ నేడే మన గోపాలున కేడాది పండూగైనట
చేడియలారా మీరు జతకూడిరారె వేవేగమే
చ॥ 1. పూచేటి పువ్వు జాతులూ పోగులు వుంచినారట
ఎంచంగల పళ్ళూ ఫలములు అమర వుంచీనారట ॥నేడే॥

2. వెల లేని భూషణమూలటా వేడుకకూ మితిలేదట
పరమానందమూగనూ పాటలు పాడుదూరట ॥నేడే॥
3. ఏనాడు చేసిన పుణ్యమో ఈనాడు గాంచ గలిగేనూ
మానావతూలారా యశోదనారీమణికీయిక ॥నేడే॥
4. ధరణీలో తిరుమలదాసునీ కరుణించిన వాడే చెలీ
పరమానందాముగాను పాటలు పాడూదూరట. ॥నేడే॥

అని పాడి హారతి ఇచ్చి, తలంటుతో కీడు తొలగిపోతుందని, తలచి పిల్లవాడికి కొత్త బట్టలు కట్టి పిండి వంటలు వండి అందరికీ పెట్టారు. పేరంటం మాటమాత్రం తలపెట్టలేదు.

– కాశీచయనుల వెంకట మహాలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, గౌతమీగంగ, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో