రోజులు గడుస్తున్నాయి….
స్నేహిత ఆ ఇంటి వాతావరణంలో వస్తున్న మార్పుల్ని చూసి క్షణ, క్షణం షాకవుతోంది.
తన అత్తగారైన లక్షీదేవమ్మ చనిపోయిందన్న షాక్‌తో నీలవేణమ్మ బెడ్డెక్కిందని తెలిసి ‘ఇలా కూడా వుంటుందా?’ అని మొదటిగా షాక్ తిన్నది స్నేహిత… తోడికోడళ్లతో పాటు తను కూడా అత్తగారికి కావలసినవి అందిస్తూ, అవసరమైన సేవ చేస్తోంది…. నీలవేణమ్మను చూసిపోవాలని స్నేహిత తల్లిదండ్రులు, బామ్మ వచ్చినప్పుడు మౌనవత్రం పేరుతో ఆమె వాళ్లను పలకరించకుండా కళ్లుమూసుకొని పడుకోవటం స్నేహితకి నచ్చలేదు. మనవళ్లు, మనువరాళ్లు ఆమె చుట్టూ తిరుగుతుంటే అరోప్‌ా కూడా వాళ్లతో కలసి ‘నానమ్మా!’ అంటూ వెళ్లినప్పుడు పిల్లలందరు బిక్కచచ్చిపోయేలా అరోప్‌ను ఆమె నెట్టియ్యటం దారుణంగా అన్పించింది.
తోడికోడలు రత్నమాల పిల్లల్ని తన చుట్టూ కూర్చోబెట్టుకొని ‘‘అరోప్‌ా మిా తమ్ముడు కాదు. వాడు మిా బాబాయ్‌కి పుట్టలేదు’’ అని అనగానే పిల్లలు తెల్ల మొహాలు వేసుకొని చూసి, వెంటనే ‘హే’ అంటూ అరోప్ చుట్టూ చేరి ఏడ్పించటం ఇంకా షాక్… ‘‘ఎందుకే మంచమెక్కావ్ నీలవేణీి! ఇంకా ఎన్ని రోజులు ఇలా? నువ్విలావుంటే నాకిప్పుడే చచ్చిపోవాలనిపిస్తోంది. పెద్ద డాక్టర్ దగ్గరకి తీసుకుపోతానురా!’’ అని అనగానే ఆయన చేతుల్లో ముఖం దాచుకొని ఏడుస్తూ ‘‘ఏవండీ! అరోప్‌ా మన మనవడు కాడండీ!’’ అనటం మరీ షాక్… ఆయన వెంటనే కొడుకు దగ్గరకి వెళ్లి.
‘‘ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు భువనేష్! నీకెలా చెప్పాలో, అసలు చెప్పాలో వద్దో నిర్ణయించుకోలేకపోతున్నా… చెప్పకుండా వుండాల్సిన విషయం కాదు ఇది. అందుకే చెబుతున్నా….’’అన్నాడు.
‘‘చెప్పండి నాన్నా! నాన్చకుండా!’’ అన్నాడు భువనేష్ అసహనంగా.
‘‘మనలో ఎవరిలో లేని పోలికలు అరోప్‌ా లో వున్నాయిరా!
ఆ చురుకుదనం, అత్యుత్సాహం చూస్తుంటే వాడు నా మనువడు కాదనిపిస్తోంది. అమ్మ కూడా అదే చెబుతోంది. అమ్మ హెల్త్ పాడవటానికి మెయిన్ కారణం అదే….’’ అన్నాడు.
భువనేష్ తండ్రి వైపు అదోలా చూసి ‘ఏమిటి ఈయన ఇలా అంటున్నారు? ’అని అనుకుంటూ పెదవి కొరకుతూ ఆలోచిస్తుండగా ‘‘స్నేహితను వెంటనే వరంగల్ పంపించు భువనేష్! అరోప్ కళ్లముందు తిరుగుతుంటే ఇంట్లో ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా పోతోంది’’ అని ఆయన అనటం గుండెను పిండే షాక్ స్నేహితకి.
అందరు కలసి అరోప్‌ను చూసినప్పుడల్లా ఈసడిరచుకోవటం నెట్టెయ్యటం ఊహించని షాక్…. ఇన్ని షాకుల మధ్యన స్నేహిత నలిగిపోతోంది. అంతేకాదు. సొంత కుటుంబమే అరణ్యమై అందులో వున్న కుటుంబ సభ్యులు క్రూరమృగాలై అరోప్ాను తరుముతుంటే భయంతో తల్లిని కరచుకుంటున్నాడు. అరోప్కి ఆ ఇంట్లో ఇంతక ముందున్న స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు ఇప్పుడు లేవు. ఎక్కడ తిరగాలన్నా, ఎక్కడ ఆడాలన్నా, ఎక్కడ ఏం చెయ్యాలన్నా జంకుతున్నాడు. తల్లి వైపు దీనంగా చూస్తున్నాడు. స్నేహితకు ఏం చెయ్యాలో తోచటం లేదు. అగమ్య గోచర మానసిక స్థితిలో వుంది. అరోప్ పుట్టక ముందు తనని బాధించిన ఆ సమస్యకి, పుట్టాక ఇప్పుడు పీడిస్తున్న ఈ సమస్యకి పెద్ద తేడా లేదనిపిస్తోంది…
అందుకే ఆమె మనసులో అరోప్ాకి జన్మనిచ్చి తప్పు చేశానా అన్న ఆలోచన తొలిసారి కలిగింది. కానీ దేవుడు ఆకాశాన్ని, భూమిని ఈ రెండిరటి మధ్యనున్న సమస్తాన్ని వృధాగా, ఒక ఆటవస్తువులా సృష్టించలేదు. ఆయన సృష్టి అద్వితీయం. మనిషి సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగే నేర్పు సాధించినా అదంతా దైవ ప్రసాదమే. ఆయన ఏది ఎవరికి ఎంతవరకు అర్హమో బాగా ఆలోచించే ప్రసాదిస్తాడు. ఒకవేళ అరోప్‌ా సృష్టి తప్పు అయితే అరోప్‌ని తనకి ఇచ్చేవాడు కాదు.
తాతయ్య వస్తున్నట్లు అన్పించి, అడుగుల చప్పుడుకే వణికిపోతున్న అరోప్ాని వెంటనే గుండెలకి అదుముకుంది స్నేహిత… కవచకుండలాల్లా తన చుట్టూ చేరిన తల్లి చేతుల మధ్యన అప్పుడే రెక్కలు మొలుస్తున్న పక్షిపిల్లలా ముడుక్కున్నాడు అరోప్‌ా. తనని ఎవరు ఎంతగా నెట్టివేసినా తల్లి తనని నెట్టివెయ్యదన్న నమ్మకం కలిగింది….. నమ్మకం చాల గొప్పది. ఏ బిడ్డ అయినా తండ్రి తనను గాల్లోకి ఎగరేసినప్పుడు కిలకిల నవ్వుతాడు. కాని కిందపడిపోతానని భయపడడు. కారణం తండ్రితనని పట్టుకుంటాడన్న నమ్మకం. అదే నమ్మకం అరోప్ాకి తల్లి పట్ల వుంది.
తండ్రి సీరియస్‌గా వుండటం చూసి అరోప్ నేరుగా తల్లివైపుకి వెళ్లి పడుకున్నాడు. వెళ్లకిల పడుకొని కళ్లుమూసుకొన్నాడు. మూసుకున్న కనురెప్పలు అలజడితో కదులుతున్నాయి. ఎప్పుడైనా తండ్రి బుగ్గమిాద ముద్దు పెట్టుకోనిదే నిద్రపోడు అరోప్‌ా. ఆ విషయం స్నేహితకి తెలుసు. అరోప్‌ా బాధపడ్తున్నట్లు అర్థమవుతోంది.
– అంగులూరి అంజనీ దేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~