ఎనిమిదో అడుగు-30 (ధారావాహిక ) – అంగులూరి అంజనీ దేవి

ఒకరోజు సత్యవతి కొడుకును పిలిచి దగ్గరకు తీసుకొని తల నిమురుతుండగా భీష్ముడు స్వాగత పరిచర్యలు నిర్వహించాడు. తర్వాత సత్యవతి వ్యాసుడితో ‘‘ నాయనా! జరిగిన కథ అంతా నీకు తెలిసే వుంటుంది. ఇప్పుడిక ఈ వంశాన్ని నిలబెట్టవలసిన బాధ్యత నువ్వు తీసుకోవాలి. తండ్రి సుఖం కోసం చేసిన ప్రతిజ్ఞ భీష్ముడు విడిచిపెట్టడు. నీ అనుగ్రహంతో అంబిక, అంబాలిక పుత్రవతులు కావాలి. దాంతో ఈ వంశం వృద్ధి పొంది ప్రజలు సంతోషిస్తారు. భీష్మునికి ఆనందం కలుగుతుంది.’’ అంది. అందుకు వ్యాసుడు ‘‘అమ్మా! దేవర న్యాయాన పుత్రులను కనడము ధర్మమే. అయితే ఒక్క ఏడాది నీ కోడళ్లిద్దరు నేను చెప్పిన విషయాన్ని పాటించాలి.’’ అన్నాడు.

సత్యవతి ‘‘నాయనా! సింహాసనం రాజ్య శూన్యంగా వుంటే ప్రజలకు అనేక ఉపద్రవాలు సంభవిస్తాయి. ధర్మం నశించి అన్యాయాలు జరిపే కుృారులు విజృంభిస్తారు. అందుచేత ఇప్పుడే పుత్రులు కలగాలి. వారు పెద్దవారయ్యే వరకు భీష్ముడు రాజ్య భారం వహిస్తాడు.’’ అని తొందర పెట్టటంతో వ్యాసుడు అంగీకరించాడు.

సత్యవతి అంబికను శయ్యాగారానికి పంపింది. శయ్యాగారములో వున్న వ్యాసుని చూసి భయంతో ఆమె కన్నులు మూసుకుంది. వ్యాసుడు ఆమెకు పుత్రదానం చేసి తిరిగి వెళుతూ…. ‘‘ అమ్మా! అంబిక కన్నులు మూసుకున్న కారణంగా గ్రుడ్డివాడు పుడతాడు. బలపరాక్రమాలలో అంతటి వాడుండడు. కానీ మాతృదోషం వల్ల అంధత్వం తప్పదు.’’ అన్నాడు.
సత్యవతి భయపడి ‘‘నాయనా ! వికలాంగుడికి, అందునా అంధునికి సింహాసనం ఎక్కే అధికారం లేదు. దేవతలు కూడా హర్షించరు కనుక అంబాలికకు యోగ్యుడైన పుత్రుని అనుగ్రహించు.’’ అని అడిగింది.

తల్లికోరికను మన్నించి అంబాలికకు పుత్రదానం చేసివస్తూ ‘‘అమ్మా! అంబాలిక కంపిత దేహముతో వచ్చింది. కనుక త్వగ్దోషం కల కుమారుడు కలుగుతాడు.’’ అని చెప్పాడు వ్యాసుడు…

‘‘సరే! జరిగిందేదో జరిగిపోయింది అంబికకు మరొక్క కుమారుని అనుగ్రహించు నాయనా!’’ అంది సత్యవతి.
ఆ ముని వికార రూపాన్ని భరించలేని అంబిక తన దాసిని అలంకరించి పంపింది. లోకవిఖ్యాతుడైన మహార్షి అనుగ్రహం తనకు లభించనున్నదని సంతోషంతో ఆదాసి ఆయనను సేవించి సుఖించింది.

వ్యాసుడు తిరిగి వెళుతూ ‘‘అమ్మా! నీ పెద్ద కోడలు తన దాసిని పంపింది. ఆమె గర్భాన ధర్మవిదుడైన కుమారుడు పుడతాడు.’’ అని చెప్పి ఆశ్రమానికి వెళ్లాడు. వ్యాసుడు చెప్పినట్లే విదురుడు మహామేధావి. రాజనీతి కోవిదుడు. కానీ పని మనిషికి పుట్టినందువల్ల అంటరానివాడయ్యాడు. తండ్రి ఒక్కడే అయినా రాజ్యాధికారానికి అనర్హుడయ్యాడు.

…. అందరూ సుఖంగా వుండాలి. అందురూ ఆరోగ్యంగా వుండాలి. ప్రతి ఒక్కరూ శుభాన్నే చూడగలగాలి. ఎవరికీ దు:ఖం కలగకూడదు. అనేది మన భారతీయుల భావన… ఈ భావాన్ని ప్రచారం చెయ్యడానికే భారతీయ వేద పురాణ ఇతిహాస కావ్యాలు విశేషంగా కృషి చేశాయి… అటువంటి ప్రసిద్ధి చెందిన ఇతిహాసమే మహాభారత గ్రంథం…. ఇందులో వున్నవే అన్ని చోట్ల వున్నాయి. దీనిలో లేనివి మరెక్కడా లేవు. ఇటువంటి లౌకికమైన కథ కాని, మానవ జీవితంలో పెనవేసుకుపోయిన పాత్ర చిత్రణ కాని మరే ఇతర గ్రంథంలో లేదు…. కానీ యుగానికోధర్మం, కాలానికోధర్మం అని వుంటుంది. గతించిపోయిన ధర్మాన్ని వర్తమానంతో పోల్చకూడదు.’’ అంది లక్ష్మీ దేవమ్మ.

‘‘అదే నేను కూడా చెప్పేఇంటి భారతంలో అరోప్‌ ఎవరు? భువనేష్‌ కొడుకు కాదట… మనకి తెలిసి కొందరు, తెలియక కొందరు, ఎవరికి వాళ్లే చర్చించుకుంటున్నారు. నేను తట్టుకోలేకపోతున్నా. దీన్ని నువ్వే పరిష్కరించాలి.’’ అంది నీలవేణి. తల్లి ఎంత వద్దని నివారిస్తున్నా వినకుండా అత్తగారినే చూస్తూ….

కోడలి మాటలకి చేష్టలుడిగి, రెండోసారి హార్ట్‌ స్ట్రోక్‌ వచ్చి అప్పటికప్పుడే కళ్లు తేలేసి, ప్రాణం విడిచింది లక్షీ దేవమ్మ.
అత్తగారు చనిపోవటం చూసి ఒక్క పెట్టున ఏడ్చింది నీలవేణమ్మ. బయట నిలబడి వున్న వాళ్ళంతా లోపలకి వచ్చారు. లక్షీదేవమ్మ మరణం వాళ్లను దిగ్భ్రాంతికి గురి చేసింది. వంటగదిలో వంట చేస్తున్న స్నేహిత ఆమె తోడికోడళ్లు విషయం తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చి లక్షీదేవమ్మ చుట్టూ చేరారు.

గోమతమ్మకి మనవరాలి భవిష్యత్తు ప్రశ్నలా అన్పిస్తూ కుప్పకూలినట్లు ఏడుస్తూ కూర్చుంది. చూసేవాళ్లంతా వియ్యపురాలు లక్షీ దేవమ్మ అంటే గోమతమ్మకి ఎంత ప్రేమో అనుకుంటున్నారు. గోమతమ్మ అలా చిన్న పిల్లలా వెక్కి, వెక్కి ఏడుస్తుంటే కాత్యాయని అక్కున చేర్చుకుంది. రామేశ్వరి పక్కనే నిలబడి ‘‘ఊరుకో గోమతీ!’’ అంటూ ఓదార్చింది. కొన్ని మాటలు ఏ ప్రేరణకి ఏ ఆలోచనకీ లొంగకుండా ‘‘అయితే ఏంటంటా!’’ అన్నట్లు అసంకల్పితంగా బయటకొస్తుంటాయి. వాటి శక్తికి జీవితాలు ఎంత తారుమారు అవుతాయో ముందు తెలియదు. ‘‘ఎంతపని చేశావు రామేశ్వరీ!’’ అని పైకి అనలేక ‘‘నా మనసు అంటుకున్న ఊరులా తగలబడిపోతోంది. ఏడవక ఏం చెయ్యను రామేశ్వరీ!’’ అని ఏడుస్తూనే వుంది గోమతమ్మ.

‘‘సముద్రం పొంగినట్లు ఎందుకింతగా శోకిస్తున్నావ్‌ గోమతీ! శోష వచ్చి పడిపోతావ్‌! తమాయించుకో….’’ అంటూ వీపుపై చేయిపెట్టి నిమురుతోంది కాత్యాయని…

కాత్యాయనితో అసలు విషయం చెబుదామని గోమతమ్మ తలఎత్తి అందరు వుండటంతో ఆగిపోయింది.

– అంగులూరి అంజనీ దేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో