నెలద-6 (ధారావాహిక )- సుమన కోడూరి

                                                       

sumana koduri

నెలద వచ్చిన అలికిడికి తమ చర్చలు ఆపి ఏమీ ఎరుగనట్లు చదరంగపు పట్టా ముందుంచుకుని చాలా సేపటి నుండి ఆడేవారిలా నటిస్తున్నారు రమణ ప్రియంవదలు . వివిధ వర్ణాల గాజు కిటికీల నుంచి జాలు వారే సాయంత్రపు నీరెండ ఆ గది నేలపై వింత చిత్రాలు సృష్టిస్తున్నాయి . నెలద నేరుగా అక్కడికే వచ్చి ప్రియంవద మెడ చుట్టు చేతులు వేసి హబ్బ నిన్నింత ఉషారుగా ఉంటే చూసి చాలా రోజులైందమ్మా ఇవాళ నా ప్రియమైన అమ్మ వనిపించుకున్నావ్ అన్నది చెక్కిలి పై ముద్దిడి ప్రియంవద తన చేత్తో నెలద మెడ చుట్టూ పట్టుకుని ఏదో వయసు మీద పడ్డది కదమ్మా అలాటి నలత మామూలే అన్నది ప్రియంవద ఊర్కోమ్మా నీకు వయసు మీద పడటం ఏంటి ఇప్పటికీ చక్కగా ముస్తాబయ్యా వంటే నెలదా ఎవరే మీ చెల్లెలా అంటారు అంతా . నటిస్తూ చేతులు ఆడిస్తూ నెలద చేస్తుంటే నవ్వాపుకోలేక పోయారు ప్రియంవద , రమణలు . చాల్లే ఆపు నగలు దుస్తులు అన్నీ సిద్దమేగా రేపటికి అనడిగింది ప్రియంవద మాట మార్చే ఉద్దేశ్యంతో అన్నట్లు . ఆ … అయినా ఎందుకో నాకు రేపు వెళ్లాలన్పించటం లేదమ్మా అన్నది   గారాబంగా  .

భలే దానివే రేపు సాధారణమైన దినం అనుకుంటున్నావా చైత్ర పౌర్ణమి అద్భుతమైన పుణ్యదినం . ఉదయ తూర్పుయే బాహు దాస్నానం , చంద్రోదయ అనంతరం ఆ సౌమ్య నాధుని చెంత నాట్యార్చన కన్నా గొప్ప అర్చన ఏమంటుందీ నాకు ఓపిక లేదు . లేకున్నా ణీ స్థానాన నేనే నర్తించేదాన్ని అన్నది ప్రియంవద . ఓ నీవంతగా చెప్తూంటే కాదంటానా వెళ్తానులే తల్లీ వెళ్తాను అంటూ చెంపలు వేసుకుని ఆ గది లోంచి వెళ్లి నెలద . ప్రియంవద , రమణ ఇద్దరు గుండె పై చేయి ఉంచుకుని హమ్మయ్య అనుకున్నారు .

****                                            *****                             ****

చైత్ర పౌర్ణమి చంద్ర ప్రభావం వలనేమో బాహుదా తరగలునురగలు తేలేలా ప్రవహిస్తున్నాది. ఇంకా సూర్యోదయం కాలేదు , అక్కడక్కడా ఒకటో , రెండో గువ్వలే మేల్కొన్నట్లు కువకువా రావాలు వినిపిస్తున్నాయి . నెలద చెలికత్తెలతో నదీ స్నానానికి తరలి వచ్చింది . అందరూ తమ తమ దుస్తులు తీసి తెల్లగా వెండి రజనులా మెరుస్తున్న ఇసుక తిన్నెలపై ఉంచారు . ఒక నూలు వస్త్రాన్ని మెడ వరకు ఒంటి పొరగా చుట్టుకుని నీటి వేపు కదిలారు .

ఏమే ఇపుడు గోపాలుడు ఎవడైనా వచ్చి మన దుస్తులు తస్కరిస్తేనో అన్నది రచన . అందరూ కిలకిలమన్నారు . జలజల నీటి శబ్దంతో పోటీలా ఎవడైనా ఎందుకే మన నెలదమ్మను చూశాడంటే ఆ ద్వాపర యుగపు ద్వారకానాధుడే తన రాధ అనుకుని మారు వేషాన వచ్చేయడూ ……. అన్నది ప్రభవి . నాకు మారు వేషాల కన్నా అసలు రూపే ఇష్టం , అలానే రమ్మనొ చ్చుగా అన్నది నెలద . అందరూ కేరింతలు కొడుతూ నీట అడుగెట్టారు . తొలత జిల్లుమన్న నీళ్లు క్రమేపి వారి మేని వేడిమి స్వీకరించినట్లు తగు స్థాయిలో వేడెక్కాయి . అందరూ ఆనందంగా జల క్రీడలలో మునిగి తేలుతున్నారు .

నెలదమ్మ వక్ష స్థలం పై రెండు స్తనములు కలియు స్థానంలో ఉన్న పెసరబద్దంత పుట్టు మచ్చ వింత శోభా గూర్చుతోంది . ఆ మేని ఛాయ పసిమి పారిజాతం కలిసిన వింత తేజంతో ఉంటుంది . పుట్టు మచ్చ మరీ నల్లగా కన్పిస్తూ ఆమె సౌందర్యాన్ని ఇనుమడింప చేస్తుంది . నెలద ముక్కు కొన పట్టుకుని హరి ఓం అంటూ తల మొత్తం నీళ్లతో ముంచింది అందరూ అలాగే చేశారు . మూడు మునకల అనంతరం విడవడిన నెలద కురులు ప్రవాహంతో పాటూ పరచుకుని తెల్లని నీటిని నల్లగా మార్చాయి నెలద వెనక తిరిగి వెల్లకిలా ఈద సాగింది కాళ్ల మువ్వలు వింతగా ధ్వనిస్తున్నాయి . అమ్మా ఇంత కాలం నుంచీ ఏటి స్నానానికి వస్తున్నా మీరు తప్ప మేమెవరమూ ఇలా ఈదలేమా అన్నది చంచల . సాధనమున పనులు సాధ్యమవుతాయి ప్రయత్నించు అన్నది ప్రభవి . మరి నీకు సాధ్యపడలేదా అన్నది చంచల ప్రయత్నిచెందుకే ఎందుకో భయమనిపిస్తుంది అన్నది ప్రభవి . అందరూ నవ్వుతూ కేరింతలతో జల క్రీడల్లో మునిగి ఉన్న ఆ సమయంలో …….

(ఇంకా ఉంది )

– సుమన కోడూరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

ధారావాహికలు, , , , , Permalink

One Response to నెలద-6 (ధారావాహిక )- సుమన కోడూరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో