51. పిల్లలకు నేర్పాలి పాఠాలు
నేరాలకు విధించాలి తప్పక శిక్షలు !
52. తప్పు చేస్తే దండించండి
ఓప్పు చేసిన వారిని గౌరవించండి!
53. ఎవరి కేన క్షమాగుణం పెట్టని కోట
అహంకారం ములిగే నావే !
54. చెప్పకూడనిది చెబితే అనర్థ మే
చెయ్యకూడనిది చేస్తే ప్రమాదమే !
55. ఈ రోజు జరిగేదంతా నీదే
రేపేమి జరుగుతుందో ఎవరు చెప్పలేరు !
56. అగ్గిపుల్లతో దీపం వెలిగించి చీకటి తరమచ్చు
పొయ్యి వెలిగించి ఆకలి తరమచ్చు!
57. రాజకీయం దేశానికి రక్ష
మనుషుల మధ్య కారు చిచ్చు !
58. పండగ నాడు ఇల్లంతా కలకల
మరునాడు ఇల్లంతా వెలవెల !
59 . కొందరు డబ్బున్న నాడు నిండు కుండలు
డబ్బు లేని నాడు ఖాళీ కుండలు !
– డా.వాసా ప్రభావతి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~