41. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం
ముందే వారి గుట్టు రట్టు చేసి కటకటాలకు పంపండి !
42. కష్టాలు మీద పడితే తల రాతని తలవకండి
ఎదురొడ్డే ప్రయత్నానికి శ్రీకారం చుట్టండి !!
43. దుబారా ఖర్చు అప్పులకు దారి
రేపటి జీవితం చిల్లుల నోటే !
44. దురాశ కష్టానికి మూలం
నిండు జీవితానికి గొడ్డలి పెట్టు!
45. జీవితమంటే వడ్డించిన విస్తరి కాదు
కష్టపడిన వారికే కడుపు నిండా తిండి !
46. సాధించడానికి కావాలి పట్టుదల
సాధించాక నిలబెట్టుకోడానికి కావాలి నిగ్రహం !
47. రేపు ఈ రోజు పునాది ఫై నిలబడుతుంది
ఈ రోజు నిన్నటి వెంటే కదులు తుంది !
48. ఆలోచించి ఏ పని చేసిన అనర్థాలు ఆమడదూరం
తొందర బాటే కష్టాలుకొని తెస్తుంది !
49. మంత్రాలకు చింతకాయలు రాలవు
ప్రయత్నానికే తల వంచుతుంది ఫలితం !
50. ఏడ్చి ఏమి సాధించలేవు
నవ్వుతూ నాలుగు లాభాలు తెచ్చుకో !
– డా.వాసా ప్రభావతి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~