‘ని’ర్భయ… (కవిత) – సుజాత తిమ్మన

‘ని’ (నిర్వచనమెరుగని భవితే..)ర్భయ…

సమాజంలొ స్త్రీ
ఎన్నడూ సరితూగలేని
పద్దార్ధమే అయింది…

బ్రహ్మ దేవుని సృష్టిలొ
ఆడపిల్లగా రూపుదిద్దుకొని..
ఆమని అందాలకి ఆవాసమయింది..

ఇంట గెలిచి..రచ్చ గెలిచి..
రాజ్యాలేలే రాణి అయినా..
అమ్మగా అవతరించినపుడు అనురాగ మూర్తే అయింది…

అమ్మయిగా అభిమానాలను
జన్మతః అరువు తెచ్చుకొని
వాటిని కాపాడుకొనలేక అబలే అయింది..

కట్టుబాట్ల సంఖెలలో ఒరుసుకొని
కన్నవారి ప్రేమలకు కన్నీటిని నింపుతూ..
ఊపిరి ఉన్నా కదలలేని శిలే అయింది…

పురాణాలలో స్త్రీ ఆది శక్తేమోగానీ
ప్రస్థుత పరిస్థితులలో ఆడది అంటే
మగవాని మర్మాలకు మసలే మరబొమ్మే అయింది..

“నడిరేతిరి రహదారిలో…
ఒంటరిగా నడిచినపుడే స్త్రీకి నిజమయిన స్వాతంత్రం “
అని మాహాత్ముడన్నాడట…
కానీ పట్టపగలు మహిళ
జనసమూహంలో…మానప్రాణాలు కోల్పోయే ఓ
‘ని’(నిర్వచనమెరుగని భవితే)ర్బయే అవుతుంది..!!

– సుజాత తిమ్మన

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , Permalink

2 Responses to ‘ని’ర్భయ… (కవిత) – సుజాత తిమ్మన

  1. ఉమా మహేశ్వరరావు says:

    సుజాత గారు మీ కవిత చాలా బాగుంది .

  2. Shamili says:

    బావుంది అమ్మ.. ప్రతీ వాక్యం ఆలోచింపజేసెదిగా ఉంది..