ప్రవహింతువా మా సీమ పాలయేరులా గోదారమ్మ !
త్రయంబకంలో నీవు పుట్టి ఆంద్ర దేశంలో అడుగుపెట్టి
పల్లె పల్లెలా తలుపులు తట్టి పచ్చని మారాణి పైరులు గట్టి
భక్తి భావనలో భద్రాద్రి చుట్టి దాహార్తుల వెతల దయతో తీర్చునట్టి
చారిత్రక సంపదకి ఆవాసమైనట్టి ప్రకృతి అందాల అలరారుతున్నట్టి
||ప్రవహింతువా||
వయ్యారాల వంపులతో చెలికత్తెల వెంటరాగా
పాపికొండల అందాలతో ప్రకృతి సోయగంగా
కళలకు కోణాచివై కలలకు ప్రతి రూపమై
జనులకు జీవానివై జనయిత్రికి తోడువై
||ప్రవహింతువా||
కోటి లింగాల చేరి కోటేశుని సేవించి
రాజ రాజ రాజుని చేసి రసవాహిని మురిపించి
సంఘ సంస్కర్తలకు చేయూతగా నిలిచి
సమరోత్సాహులకు సంగమమై ప్రతిఫలించి
ధవళ గిరిని చేరి ధవళ కాంతులు చెంది
ఏడు పాయల చీలి ఎల్లెడల కనిపించి
||ప్రవహింతువా||
పసిడి పంటలకు పట్టు గోమ్మవై నిలిచి
అంతర్వేదిని తాకి అనంతమై కనిపించి
అమరావతివై అందరిని అలరించి
జీవావర ణి వై జీవాన్ని పెంచి పోషించి
జలదాతవై ఆదర్శ మూర్తివై శోభిల్లి
ప్రాణ దాతవు ప్రణా మమో కల్పవల్లీ
||ప్రవహింతువా||
– బాబా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
2 Responses to మా ఊపిరి గోదావరి – బాబా