అమెరికా సాంఘిక సంస్కర్త -గబ్బిట దుర్గాప్రసాద్

అమెరికా సాంఘిక సంస్కర్త ,క్వేకర్ ఉద్యమనాయకురాలు -లుక్రేషియా కాఫిన్ మొట్

బాల్యం-ఉద్యోగం వివాహం సంతానం

unnamedఅమెరికా లోని మసా చూసేట్స్ రాష్ట్రం లో నాన్ టకేట్ లో లుక్రేషియా కాఫిన్ 3-1-1793 జన్మించింది .ఎనిమిది మంది సంతానం లో రెండవ పిల్ల కాఫిన్ .తల్లి పీటర్ ఫోల్గేర్ మేరీ ఫోల్గేర్ లకు ముని మనుమరాలికి మనవ రాలు .బెంజమిన్ ఫ్రాన్క్లిన్ కు కూడా చుట్టరికం ఉన్నది .డచేస్ కౌంటిలో ఉన్న ‘’నైన్ పార్ట్నర్స్ స్కూల్ ‘’లో13 వ ఏట చేరి చదివింది .ఇది న్యూయార్క్ లోని సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్ నిర్వహించే స్కూల్ .గ్రాడ్యుయేట్ అయి అక్కడే టీచర్ గా చేరిపని చేసింది .ఆ స్కూల్ లో అప్పుడు మగ మేస్టర్లకు ఆడ టీచర్లకంటే మూడు రెట్ల జీతం ఇస్తూ ఉండేవారు .ఇది గమనించి కాఫిన్ మహిళలకు సమాన హక్కులు కావాలనే అభిప్రాయం లోకి వచ్చింది .తండ్రి కుటుంబాన్ని ఫిలడేల్ఫియాకు మార్చటం తో పీటర్ మొట్ అనే టీచర్ తో సహా అక్కడికి వెళ్ళింది .మొట్ ను పెళ్ళాడింది .సంతానం కలిగారు .ఆమెపిల్లలు ఆమెలాగే బానిసత్వ నిర్మూలన ఉద్యమం లో క్రియాశీలంగా పని చేశారు .

బానిసత్వ నిర్మూలనోద్యమం

ఇతర క్వేకర్ ల లాగానే కాఫిన్ కు బానిసత్వం అంటే నచ్చేదికాదు .బానిసత్వం సాంఘిక దురాచారం అని భావించింది .ఇతర బానిసలు నేసిన నూలు దుస్తులు వారు తయారు చేసిన పంచదార ,మొదలైనవి ఉపయోగించేదికాదు . మొట్ క్వేకర్ మినిస్టర్ అయింది ఆత్మజ్ఞానం పొందిన కాఫిన్ ప్రతివారిలోను భగవంతుని దర్శించింది .భర్తకు చేదోడుగా సహకరించి ప్రజలలో బానిసత్వం యెడల విముఖతకలిగేట్లు ప్రచారం చేసింది .భర్త ‘’అమెరికన్ యాంటి స్లేవరి సొసైటీ ‘’స్థాపించటానికి ఎంతగానో సహకరించింది .ఫిలడెల్ఫియాలో బహిరంగ వేదికలపై మాట్లాడే నేర్పు అలవడింది .అందరిని ఒప్పించే గుణం ఆమెలో ఉండేది .అప్పటికి ఆమె ఒక్కతే బహిరంగ సభలలో ఉపన్యాసం ఇచ్చేది. ఇంకెవరూ అంతటి సాహసం చేయ లేక పోయేవారు .కనుక ఏకైక మహిళా వక్త అయింది .ప్రజాబలం కూడగట్టుకొని కొద్దికాలం లోనే ‘’ఫిలడెల్ఫియా యాంటి స్లేవరి సొసైటీ ‘’ని స్థాపించింది .అక్కడి నల్ల జాతివారి సహాయ సహకారాలు ఆమెకు పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. జాతి వివక్షతపై పోరు బాట సాగించింది .నల్లజాతివారి మత ఉత్సవాలలో పాల్గొని వారి అభిమానాన్ని పొందింది .బంధు మిత్రులతోకలిసి ‘’రోచెస్టర్ యాంటి స్లేవరి సొసైటీ ‘’నికూడా ఏర్పాటు చేసింది .
కుటుంబ ఆదాయాన్ని బట్టి ఖర్చు చేస్తూ మిగిలిన డబ్బును ఉద్యమ విస్తరణకు విని యోగించేది. ఇంటికి వచ్చిన అతిధులకు సేవల౦ద జేసేది .కుటుంబ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తూనే సాంఘిక న్యాయం కోరే మహిళగా గుర్తింపు పొందింది .అందరిని కూడగట్టి ఉత్సవాలు ఊరేగింపులు చేస్తూ వచ్చిన రాబడిని బానిస విమోచనానికి ఖర్చు చేసేది 1837, 38,39 లలో జరిగిన ;;యాంటి స్లేవరి కన్వెన్షన్ ఆఫ్ అమెరికన్ వుమెన్ ‘’సభలు మూడింటికి హాజరై ప్రాతినిధ్యం వహించింది మొట్ .1838లో ఫిలడెల్ఫియాలో సమ్మేళనం జరిపే హాల్ ను దుండగులు తగల బెట్టారు .ఆరుబయటనే మీటింగ్ నిర్వహించి బానిసవిమోచనశంఖా రావం పూరించింది .అగ్గి మీద గుగ్గిలమైనవ్యతిరేకులు మొట్ ఇంటినీ నల్లజాతివారి ఇళ్ళను దోచుకొన్నారు .భీభత్సం సృష్టించారు

ప్రపంచ సభలో పాల్గొనటం

1840 జూన్ నెలలో లండన్ లో జరిగిన ‘’ప్రపంచ బానిస వ్యతిరేక సభ ‘’లో మొట్ పాల్గొన్నది .అప్పటికే అంతర్జాతీయంగా గుర్తింపు పొంది ఆరుగురు అమెరికన్ ప్రతినిదు లతో హాజరైన ఆమెను అక్కడి’’ మగ పురుషులు ‘’తమతో అమెరికన్ మహిళలు కూర్చోటానికి వీలు లేదని వ్యతిరేకించి పాల్గొన కుండా చేశారు . పాపం మహిళలు వేరేగా కూర్చోవాల్సి వచ్చింది .ఈ సభలో ఆడవారి హక్కుల విషయం ప్రస్తావి౦చ రాదని నిషేధం విధింఛి బానిస విమోచనాన్ని నీళ్ళు గార్చే ప్రయత్నం చేశారు .అప్పడు లండన్ లో ఉన్న న్యాయ చట్టాల ననుసరించి స్త్రీలు బహిరంగం గా రాజకీయ సభలలో పాల్గొన రాదు అనే నియమం కూడా ఉంది . మగవారికి వారికి అది కలిసొచ్చింది .కాని అమెరికా నుండి వచ్చిన పురుష ప్రతినిధులైన గారిసన్ ,నేతానియాల్ పి.రోజేర్స్ ,విలియం ఆడమ్స్ ,ఆఫ్రికన్ –అమెరికన్ యాక్టివిస్ట్ చార్లెస్ లేనాక్స్ రిమాండ్ మొదలైనవారు స్త్రీలకోసం కేటాయించిన స్థలం లోనే స్త్రీ ప్రతినిధులతో బాటు కూర్చుని నిరసన తెలియ జేశారు . ఐరిష్ పత్రిక మొట్ ను ‘’మహిళా సింహం ‘’అని కీర్తించింది .ఇంగ్లాండ్ స్కాట్ లాండ్ సభలలో పాల్గొని అమెరికాకు తిరిగి వచ్చింది .

బానిస రాష్ట్రాల పర్యటన

న్యూయార్క్ లోను బోస్టన్ లోను బహిరంగ సభలలో మొట్ ఉపన్యసించింది .బానిసలున్న రాష్ట్రాలలో పర్యటన చేసి బాల్టిమోర్ వర్జీనియా మేరీలాండ్ లలో ప్రసంగించి చైతన్యం తెచ్చింది .బానిస యజమానులతో సమావేశమై వారి మనసు మార్చటానికి ప్రయత్నించింది .40 మంది అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల సమావేశం లో ప్రసంగించి వారికి విమోచన పై అవగాహన కలిగించింది .ఆసభకు వచ్చిన’’ ప్రెసిడెంట్ జాన్ టేలర్’’ మొట్ వ్యక్తిత్వానికి ,ఉపన్యాసానికి ముగ్ధుడైపోయాడు .అక్కడే ఉన్న బానిస విమోచనాన్ని వ్యతిరేకించే సెనేటర్ ‘’కల్హాన్ ‘’ ఆమెకు అప్పగిస్తానని ప్రకటించాడు .
న్యూయార్క్ లోని సేనేకా ఫాల్స్ లో మొట్ మరియు మరోనాయకురాలుసాంటన్ తో కలిసి మహిళాహక్కుల సభ 1848లో జరిపారు .స్త్రీ వోటు హక్కు కోసం నినదించారు .విమోచన ఎంతముఖ్యమో స్త్రీ వోటుహక్కూ అంతే ముఖ్యం అన్నారు .మానవ హక్కుల నాయకుడు ఫ్రెడరిక్ డగ్లాస్ ఇందులో కీలక పాత్ర పోషించాడు .మొట్ ప్రభావం యునిటేరియన్లు అయిన ధియోడర్ పార్కర్ ,విలియం ఎల్లరి చానింగ్ , విలియం పెన్ ల పై అధికం .యూని వరసల్ రైట్స్ కోసం పోరాడాలని నిర్ణయించారు .మొట్ క్రమంగా దూరమైంది అనారోగ్య రీత్యా .
‘’the kingdom of God is within man ‘’అని అభిప్రాయపడింది మొట్ .తర్వాత రెలిజియస్ లిబరల్స్ ఏర్పరచిన ‘’ఫ్రీ రేలజి యన్ అసోసియేషన్ ‘’లో చేరింది .దీనిలో మహా వేదాంతి ఎమర్సన్ ,మొదలైన గొప్పవారు కూడా సభ్యులయ్యారు మొట్ ‘’సేర్మాన్ టు మెడికల్ స్టూడెంట్స్ ‘’రాసి 1849లో ప్రచురించింది ‘’డిస్కోర్స్ ఆన్ వుమెన్ ‘’అనే కరపత్రం వెలువరించింది .క్వేకర్ ఉద్యమనాయకురాలుగా ఉండి మహిళా హక్కులకోసం, బానిస విమోచనం కోసం అహరహం శ్రమించిన మహిళా మాణిక్యం లుక్రేషియా కాఫిన్ మొట్ ..87 ఏళ్ళు జీవించి 11-11-1880 న మరణించింది .

– గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

.

పురుషుల కోసం ప్రత్యేకం, వ్యాసాలుPermalink

Comments are closed.