బోయ్‌ ఫ్రెండ్‌ – 9(ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

Dr. Jaya prada

”ఏమి హాయి పిన్నీ ! ఒక చోట స్థిరంగా బ్రతక్కుండా ప్రతి చెట్టు నీడనా కాసింత సేపు గడిపి మరో చెట్టును వెతుక్కుంటూ వెళ్ళే ఈ నిర్భాగ్యుల బ్రతుకుల్లో ఏమి హాయి వుంటుంది?” అక్క కూతురుతో వాదం పెంచకుండా, చిరునవ్వు నవ్వి ఊర్కుంది నిర్మల.
ఒక చోట కారు ఆపి అన్నారు రామారావు గారు. మనం ఇప్పుడు మూడువేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో వున్నాం. అక్కడ నుండి సీలేరుకు దిగాల్సి వుంటుంది.” అని ఆగి ”ఈ దారంబడే పైకి వెళ్తే ఒక గోపురం కన్పిస్తుంది.” అక్కడకు వెళ్ళి కాసేపు నిలబడి రండి సరదాగా వుంటుంది.

కృష్ణ అనిందే తడవు దిగేసింది. వెంటనే చైతన్య ఆమెను అనుసరించాడు.
”నువ్వూ రాకూడదా పిన్నీ!”

”నేను చాలాసార్లు చూచానులే నాకు కాళ్ళు నొప్పులుగా వున్నారు. మిరు వెళ్ళిరండి”
భానుమూర్తి కారు దిగి ”రారా నేస్తం” అని మురళితో ఒక్కడుగు ముందుకేసి ఆగి వెనక్కు తిరిగి చూసాడు. వెళ్తున్న తమ వైపే చూస్తూ దిగులుగా, ముడుచుకుని కూర్చొనుంది అరుణ. ఆ భయస్తురాలిని పిలిచి తనతో తీసుకుపోనందుకు కృష్ణ పరవశం మిద కోపం వచ్చింది భానుమూర్తికి.

‘ఈ కృష్ణ కేం తెలియదు’ మనసులో అనుకుని ”మీరూ రండి అరుణా!” అని పిలిచాడు. అతని పిలుపు కొరకే ఎదురు చూస్తున్నట్టు ఆమె సంతోషంగా దిగి, అతని ప్రక్కనే నడవసాగింది.
నాలుగుడుగులు వేసాక కృష్ణను ఉద్దేశించి అన్నాడు భానుమూర్తి.
”కాస్త ఆగకూడదూ? ఈమె కూడా వస్తున్నారు”

అరుణకు మనసులో భానుమూర్తితో కొన్ని క్షణాలు ఏకాంతంగా గడపాలనీ ఆ అద్వితీయమైన అనుభూతిని గుప్తంగా హృదయంలో దాచుకోవాలనీ బలంగా అన్పించింది. కానీ ఆమె మనస్సును అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించని కృష్ణ ‘సారీ’ అంటూ ఆగి వాళ్ళను కలుసుకుంది. ముందుగా నడుస్తున్న చైతన్య మటుకు అన్యాయంగా జారిపోరున క్షణానికి అన్నయ్యను మనస్సులోనే శపించుకున్నాడు.

అంత ఎత్తునుండి క్రింద లోయలోకి చూస్తుంటే చాల ‘థ్రిల్లింగ్‌ ‘ గా వుంది అందరికీ. ఆ అనుభూతిలో కాలం ఎంత గడిచిందీ గుర్తు రాలేదు వాళ్ళకి. క్రింద కారులో నుండి ప్రసాదరావు కేకపెట్టి పిలిచే వరకు వాళ్ళకి, ఇంకా కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసి భోంచేయాల్సి వుంటుందనే విషయమే గుర్తు లేదు.

అందరితో పాటు గబగబ దిగివస్తున్న అరుణకు అల్లంత దూరాన అందుబాటులో ఎఱ్ఱ గుత్తుల కొఠారు పూలు కన్పించారు. ”ఆ పూలు కోసుకుందాము రారూ” అంది కృష్ణనుద్దేశించి భానుమూర్తి వైపు ఓరగ చూస్తూ.
”ఇప్పటికే ఆలస్యమైపోరుంది అరుణా. బాబారు తిడ్తాడు.” తన ఉత్సాహంలో నీళ్ళు చల్లినట్టయి ఉడుకుమోత్తనం వచ్చింది అరుణకు.
”యింతసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఒక్క నిముషానికి టైమ్‌ అయిపోతుందా?” అని అప్పటి కప్పుడే పూడుకుపోయిన కంఠంతో ”అవును. మీరందరూ ఒకటే. నేనే…నేనే. పరాయి దాన్ని” అంది. అనుకోని పరిణామానికి తత్తరపడింది కృష్ణ.

”అది కాదు…అది కాదు…అరుణా నా ఉద్దేశం..”
ఆమెను మధ్యలోనే ఆపుతూ అన్నాడు భానుమూర్తి.
”మురళిని చూస్తుండు కృష్ణా. రండి అరుణా నేను కోసిస్తాను.”
అరుణ మనసులో ఆ మాటతో కోటి కొఠారు పూలు విరబూసినా అభిమానం కొద్దీ ” నా కొద్దు” అంటూ ముందుకు కదిలింది.
”అరుణ అలా బాధపడ్తుందనుకుంటె తొందరపడి అలా అనేదాన్ని కాను భానూ!” నొచ్చుకుంది కృష్ణ.
అంత చిన్న విషయానికి అరుణ ఉడుక్కోవడమూ దానికి కృష్ణ ఫీల్‌ అవడమూ, చైతన్యకు ఏ మాత్రం నచ్చలేదు. ఏమి అనలేక నొసలు చిట్లించి ఊర్కున్నాడు.

”ఇందులో నీ తప్పేముంది కృష్ణా !” ముందుకు ఒకడుగేస్తూ, స్నేహితురాలి వైపు సానుభూతిగా చూసాడు భాను.
”అలా కాదు నువ్వు వెళ్ళి పూలు కోసుకురా. మేము నడుస్తూ వుంటాము. నా కొఱకు వెళ్ళిరా భానూ.”
భానుమూర్తి వెళ్ళి కొఠారు పూలగుత్తి ఒకటి కోసి తెచ్చిస్తే అతని కళ్ళల్లోకి చూసి చిన్నగా మందహాసం చేస్తూ తీసుకుంది అరుణ.
వీళ్ళు దిగి వచ్చేసరికి అవసరమైన సామానుతో పనివాళ్ళతో వస్తున్న వేను కూడా వచ్చి కారు వెనగ్గా నిల్చొనుంది. అందరూ ఎక్కడంతో రెండు వాహనాలూ జంటగా కదిలారు.

ఐదారు కిలోమిటర్లు ప్రయాణం చేసాక ఇంజనులో నీళ్ళు పోసుకోవడానికి కారును ఆపారు. అందరూ కార్లో నుండి దిగిపోరు మేఘాల నీడన పచార్లు చేయసాగారు. కారు నిలుచున్న ప్రదేశానికి ఒక వైపు లోయ, మరొక వైపు పెద్ద గుట్ట. అలా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తూ అటూ ఇటూ తిరుగుతున్న కృష్ణ చూపులు గుట్టమిద నాలుగు గజాల ఎత్తులో చదునుగా వున్న ప్రదేశంలో ఆగిపోయారు.

అక్కడ అందమైన, కొమ్మలతో జుట్టు విరబోసుకున్నట్టున్న ఒక చెట్టు ఆమెను ఆకర్షించి అక్కడే నిలబెట్టేసింది. నిజానికి ఆ చెట్టులో ఏమి ఆకర్షణ లేదు. దాని క్రింద గాలికి రాలిపడిన పల్చటి తివాసీలా పరుచుకున్న ఎఱ్ఱటి పూలు చాల అద్భుతంగా వున్నారు. వాటినే తదేకంగా చూస్తున్న కృష్ణ పరవశంతో అనుకుంది-

”పగడాల పట్టు తివాసీలా ఎంత సుందరంగా వుందీ !” అని. ఆ ప్రదేశానికి రోడ్డుకు మధ్య నాలుగు గజాల ఎత్తులో వున్న గుట్ట నిండా చీపురు చెట్లు గాలికి తల లాడిస్తూ వున్నారు. వాటి వెనగ్గా వున్న ఆ పగడాల చెట్టు దగ్గరకు వెళ్ళాలనీ, ఆ సుందరదృశ్యాల్ని మరీ దగ్గరగా చూడాలనీ అన్పిస్తోంది ఆమెకు. మెల్లగా కుచ్చెళ్ళు పైకి దోపి గుట్ట నెక్కుతున్న అక్క కూతుర్ని వారించింది నిర్మల.

”ముళ్ళు గుచ్చుకుంటారు కృష్ణా వెళ్ళకు” ఆమె పిన్ని మాటలు లెక్క చేయలేదు. కాలు జారుతున్నా నిలదొక్కుకుంటూ ఒక్కొక్క అడుగే జాగ్రత్తగా వేస్తూ ఎక్కేస్తోంది. మిగతా వాళ్ళంతా క్రింద జేరి ఆమె ఏమి చేయబోతుందో నని ఆసక్తిగా చూస్తున్నారు. చీపురు ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్క చేయకుండా ముందుకెళ్తున్న ఆమె సాహసాన్ని భానుమూర్తి మనసులోనే మెచ్చుకుంటె, ఆమె అలా సాహసంగా ముందుకు వెళ్ళడం అందరిలో ప్రత్యేకంగా కన్పించడం చైతన్యకు నచ్చలేదు. అన్ని అడ్డంకులు దాటుకుని చెంగున పైకి ఎక్కేసింది కృష్ణ. అంత దగ్గరగా ఆ పరిచిన పూలను చూస్తుంటె మరీ అందంగా వున్నట్టనిపించారు. ఆ చెట్ల కొమ్మల నుండి వేలాడే సన్నటి రెమ్మల కటూ ఇటూ పూసిన ఎఱ్ఱటి పూలు, విరబూసాక ఒక్కక్షణం కూడా అక్కడ నిలవ కుండా రాలిపోతున్నట్లున్నారు. చెట్ల కొమ్మలు ఆరు వైపులుగా పరుచుకుని వున్నాయేమో, అదే ఆకారంలో ఆరు రేకుల పుష్పంలా చెట్టుక్రింద పూలు దట్టంగా పరచుకొనున్నారు. ఒక్కొక్క పువ్వునే మరీ పరీక్షగా చూస్తే మధ్యలో ముత్యాలు, చుట్టూ పగడాలతో అనుభవజ్ఞుడైన కంసాలివాడి చేతితో తయారు చెయ్యబడిన అందమైన గుండ్రటి పతకంలా వుంది. ఆ అందాల్ని పూర్తిగా అనుభవించిన కృష్ణ గుట్ట అంచుకొచ్చి క్రిందికి చూస్తూ అరిచింది. భానుమూర్తిని, చైతన్యను ఉద్దేశించి.

”చేతులు కట్టుకుని నిల్చోకపోతే ఇక్కడకు రాకూడదూ?” ”పేరుకు మగాళ్ళే వీసమెత్తు ధైర్యం కూడా లేదు.”
అమె పరిహాసానికి చైతన్య ముఖం ముడుచుకు పోరుంది. భానుమూర్తి మటుకు తిరిగి ఆమెనే కేక వేసాడు.
”నువ్వు చేస్తున్న ఘనకార్యం చాలు గాని దిగిరా. మి బాబారు వాళ్ళు వస్తున్నారు.”
బాబారు వాళ్ళు వస్తున్నారనగానే కంగారుగా దిగుతున్న కృష్ణ కాలు జారి, శ్రమ లేకుండా నాలుగడుగులు క్రిందకు వచ్చిపడింది.

”బాగా అరుంది” అని నవ్వాడు చైతన్య.
”నాకేం కాలేదు” అని దులుపుకుని వచ్చి కారులో బుద్ధిగా కూర్చుంది. ప్రసాదరావు, రామారావూ వచ్చి ఇంజన్‌లో నీళ్ళు పోసుకుని కారులో కూర్చున్నారు. ప్రసాదరావు నుద్దేశించి అన్నాడు చైతన్య-

”మీ అమ్మారు భలే ఘనకార్యం చేసింది.” కృష్ణ చైతన్యను పట్టించుకోలేదు.
”ఘనకార్యం కాదు గాని బాబాయ్‌, ఆ గుట్ట మిద వుండే చెట్టు పేరేమిటి బాబాయ్‌”.
ఆయన తలెత్తి చూచి ఓ అదా ! దాన్ని ‘బట్టకార’ చెట్టంటారు.
”ఛ ! పేరేం బాగాలేదు” నిరాశపడింది కృష్ణ.
”పోనీ దాందేముంది? మరో మంచి పేరు సెలెక్ట్‌ చేసి చెప్పండి. ఆ చెట్టుకు నామకరణ మహోత్సవం చేద్దాం.” అన్నాడు చైతన్య తన అవమానాన్ని మర్చిపోరు.
పగడాల రంగు చెట్టు తాలూకు పూల పరవశంతో తెలియలేదు కాని చీపురు ముళ్ళ నూగుతో దురదలు మొదలయ్యారు కృష్ణకు.

(ఇంకా ఉంది )

– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

61

ధారావాహికలు, , , Permalink

Comments are closed.