బోయ్‌ ఫ్రెండ్‌ – 6(ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

Dr. Jaya prada

Dr. Jaya prada

”భానూ ! ఈ వెదురు పొదలు చూడు. ఎంత బాగున్నాయో!” తన స్నేహితుడి చేతి మిద తన చెర్యు వేస్తూ అంది. ఇంతవరకు మౌనంగా వాటినే చూస్తున్న భానుమూర్తి తన స్నేహితురాలితో పూర్తిగా ఏకీభవించాడు.
”చూస్తున్నాను కృష్ణా. చాలా అందంగా వున్నారు.”

ఆ నిశ్శబ్ధ నిశీధిలో అరుదుగా దొరికే ఈ ప్రకృతి తాలూకు అందాల్ని, నిద్రాదేవి కిలాడితనానికి లొంగిపోరు, పోగొట్టుకుంటున్న చైతన్యను కూడా లేపి నిద్రపోతున్న వాతావారణాన్ని చైతన్యవంతం చేయాలనిపించింది కృష్ణకు. కానీ ఒకరకమైన జంకు. ఎప్పుడూ భానుమూర్తి దగ్గర అనుభవం కాని బెదురువల్ల ఆమె ఆ పని నుండి విరమించుకుంది. కానీ కృష్ణలో చెలరేగే భావాల్ని ఇట్టే గ్రహించినట్టు ఎవరో తట్టిలేపినట్టు ఉలిక్కిపడి లేచిన చైతన్య, కారు అద్దంలో నుండి ముందుకు చూచి ”అబ్బ ! ఇంత వెన్నెలెప్పుడొచ్చిందీ!” అన్నాడు సంబరంగా.

”మీకు నిద్రే పరమావధిలా వుంది” ఎందుకనో ఆ మాటలు అనాలనుకున్నంత ఫ్రీగా అనలేకపోరుంది కృష్ణ. ఆమె మాటలతో వెనక్కు తిరిగి-

”ఛీ,ఛీ నిద్ర వచ్చేసింది. అరునా మిరు లేపకూడదేమిటి? మిరొక్కరే ఈ ప్రకృతినంతా ఆస్వాదించి పారేయాలా?” తన నిర్లక్ష్యానికి నొచ్చుకుంటూ అపరాధమంతా కృష్ణ నెత్తిన రుద్దేసాడు. రహస్యంగా, చిలిపిగా తన కొఱకు మాత్రమే నిర్దేశించబడినట్లున్న అతని కళ్ళల్లోకి నిర్భీతిగా చూడలేక తల త్రిప్పేసుకుంది కృష్ణ. ఆమె హృదయంలో ఇంతవరకు అనుభవంగాని, అలజడిలాటిదేదో బయలుదేరి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

పదిహేడు కిలోమిటర్ల దూరం ప్రయాణం చేసి, చింతపల్లి ట్రావెలర్స్‌ బంగళా చేరుకుంది కారు. అక్కడ తమకై ఎదురు చూస్తున్న డివిజనల్‌ ఇంజనీరు రామమూర్తి ఘన సన్మానం చెయ్యకపోరునా, పరారు చోట మామూలు పల్లెలా అరుదుగా దొరికే సౌకర్యాలన్నీ కల్పించాడు.

అడవి మధ్యగా, నాలుగు గదులతో వున్న చిన్న బంగళా అది. చుట్టూ పొదలు,తుప్పలు అడవిచెట్లు. వాటిలో నిర్భయంగా తిరిగే పాములు, అడవి జంతువులు, వీటి మధ్యగా ఒక సుదీర్ఘమైన రాత్రి అంతా గడపాలంటె చాల భయంగా అన్పించింది అరుణకు. తలుపులు తీస్తున్న కృష్ణను వారిస్తు అంది.

”తలుపులు తీయకండి ప్లీజ్‌. భయమేస్తోంది.”
”ఎంత వెన్నెలో చూడు అరుణా! బయట” పుచ్చపువ్వులాటి వెన్నెలలో, మంచుతో కప్పబడి మసక మసగ్గా వున్న ప్రకృతిని చూస్తూ అంది కృష్ణ. అరుణ మాట్లాడలేదు. కృష్ణ నిశ్శబ్ధంగా కిటికీ తలుపులన్నీ వేసి వచ్చి కూర్చుంటూ అంది.
”పోనీ ఒక్క పాటపాడు అరుణా!” ప్రక్క రూమ్‌లోకి వెళ్ళబోతున్న చైతన్య భానుమూర్తి, రామారావు, ప్రసాదరావు ఆగిపోయారు. అరుణకు చెప్పలేనంత విసుగ్గా వుంది.

”నేనిప్పుడు పాడలేను” బ్లంట్‌గా చెప్పింది అరుణ. చైతన్య బలవంతం చెయ్యబోయాడు గాని భానుమూర్తి వారించడంతో ఆగిపోయాడు. అంత నిశ్శబ్ధంగా వున్న వాతావారణాన్ని భరించలేక ఆ మౌనాన్ని బద్దలుకొడ్తూ అంది కృష్ణ-
”పోనీ చైతన్య గారు పాడ్తారు” ఈ ప్రయాణాన్ని చాల అందమైన స్మృతిగా నిల్పుకోవాలని కృష్ణ ఆరాటం.
”పోనీ, ఆట’ చూడండి. నేనంటె అలుసుగా వుంది కృష్ణగార్కి. నాకు పాడాలనిపించాలే గాని బ్రహ్మాండంగా పాడేస్తాను.” ఉడుక్కుంటున్నట్టు నటిస్తున్న చైతన్యను చిరునవ్వుతో చూస్తూ అంది నిర్మల-

”కానీ వచ్చిన చిక్కల్లా మికు ఎప్పుడూ పాడాలనిపించదు అంతే కదూ!”
అంతా చిరునవ్వుతో వింటున్న డాక్టర్‌ యదునందన్‌ గారు,

”మీరు తొందరగా పడుకుంటె, ప్రొద్దున్నే లేచి చింతపల్లి పరిశ్రమలు కొన్ని చూడొచ్చు ” అన్నారు. అప్పుడే మొదటి మారుగా పరీక్షగా చూచింది కృష్ణ ఆయనవైపు. ముప్ఫై అరుదు సంవత్సరాలుండొచ్చు. కానీ కాయపారుగా వుండడం వల్ల, ఇంకా చిన్నగా అన్పిస్తున్నారు. కొనదేరిన ముక్కు తీక్షణమైన కళ్ళు, పట్టుదలను సూచించే పెదాలు, ముఖంలో కొట్టవచ్చినట్టుండే సమర్థత, ఎవరికైనా సరే ఆయనను చూడగానే మర్యాదివ్వాలనిపిస్తుంది. ఆయన బాధ్యతగా తీసుకుని చెప్పేవన్నీ శ్రద్ధగా వినాలనిపిస్తుంది.

ప్రక్కగదిలోకి వెళ్ళబోతూ, ఆగి తన చిన్న స్నేహితుణ్ణి ఎత్తుకుని ఎగరేసి దింపి ”ఏరా నాన్నా నువ్వు ఆడవాళ్ళతో వుంటావా? మగవాళ్ళతో వస్తావా?’ అన్నాడు తమాషాగా భానుమూర్తి.
వాడు వెంటనే జవాబిచ్చాడు.

”మీతోనే వస్తాను మామయ్యా. నేను మగవాణ్ణి కదా మరి !”
పూర్తిగా తెల్లవారక ముందే మురళి లేచి ‘అమ్మా !’ అంటూ రాగాలు మొదలు పెట్టడంతో ఉలిక్కిపడి లేచి వాడిని ఎత్తుకుని బయట కొచ్చాడు భానుమూర్తి. వాడిని వాళ్ళమ్మ కప్పగించి మరలా సుఖనిద్రలో మునిగి పోవాలనే ఉద్దేశంతో అలా బయటకొచ్చిన భానుమూర్తి చిత్రమైన సంఘటనను చూస్తున్నట్టు అక్కడే ఆగిపోయాడు.

వాళ్ళగదికి ఆడవాళ్ళ గదికీ మధ్యగా వున్న చిన్న వరండాలో వున్న విశాలమైన కిటికీలో కూర్చుని కమ్ములకు రెండు చేతుల మధ్యగా తల ఆన్చి, బయట ప్రపంచంలోకి తదేకంగా చూస్తోంది కృష్ణ.

ఎప్పుడూ ఏడుకాందే లేచే అలవాటు లేని కృష్ణ, ఇంత పొద్దున్నే లేవడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ‘అంతగా తన స్నేహితురాల్ని ఆకర్షించిన విషయమేమయ్యుంటుందా?’ అని బయటకు చూపులు విసిరిన భాను తన్మయుడై నిలబడిపోయాడు.

పూర్తిగా వెన్నెల కరిగి పోలేదింకా. బాలభానుడు తన వెలుగు కిరణాల్ని పైకి పంపే ప్రయత్నంలో వున్నాడు. రెండు విలక్షణమైన వెలుగుల వింత కలరుకలో, ప్రకృతి విన్నూతనమూ మనోహరమూ అరున కాంతిని పుంజుకుంటోంది. ఆ కనుచీకట్లో అడవి మనుష్యులు తమ దైనందిక కార్యాలు మొదలెడ్తున్నారు.

ఒక్కక్షణం తర్వాత అతని చూపులు స్నేహితురాలివైపు తిరిగారు. ఆమె కళ్ళు వింతతేజస్సుతో మెరిసిపోతున్నారు. ఆమె పెదవులు పరవశంతో విచ్చుకుంటున్నారు. అలా ఆమెనే తదేకంగా చూస్తున్న అతనికి తన స్నేహితురాలు ఈ రోజు ఈ పరారు ప్రదేశంలో చాలా క్రొత్తగా కన్పిస్తోంది.

”పట్నంలో పెరిగిపోతున్న నాగరికతతో సరి సమానంగా ఎదిగిపోతూ పరిసరాలకు తనను తానే మలచుకుంటూ పోయే ఈ స్నేహితురాలేనా? ఈ రోజు ఈ ఝాములో- ఒంటరిగా కూర్చుని పచ్చని చెట్లనూ, ఆ అనాగరిక ప్రజలనూ పరిశీలనగా పరవశంగా చూస్తున్నది! జీవితాన్ని నిర్లక్ష్యంగా తీసుకునే ఈ కృష్ణేనా అడవి మనుష్యుల జీవితాల్ని సానుభూతిగా అర్థం చేసుకుంటున్నది!”

(ఇంకా ఉంది )

– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

49
ధారావాహికలు, , , , , Permalink

Comments are closed.