నువ్వు అనుకున్నావు (కవిత ) – కవిని ఆలూరి

అమ్మా !నువ్వు అనుకున్నావు!
నేను రచయిత్రిని కావాలని

పేద ప్రజల ఆక్రందనలే
నా రచనా విషయాలుగా రాయాలని ,

నేను
వంటగత్తె నయ్యాను

రుచికరమైన వంటలతో
అందరినీ మెప్పించటానికి ఆరాటపడ్డాను!
నువ్వు అనుకున్నావు!నేను పంతులమ్మను కావాలని
అక్షర జ్ఞానంలేని ప్రజలకు ఆదర్శంగా చదువు చెప్పాలని
నేను పంతులమ్మనైతే అయ్యాను

కానీ ఆర్ధిక
లాభాపేక్షే ధ్యేయంగా విద్యాదానం సాగించాను!
నువ్వు అనుకున్నావు!నేను లాయర్ను కావాలని
న్యాయం,ధర్మం నా మార్గాలుగా ఉండాలని
నేను బిడ్డల తల్లి నయ్యాను

బిడ్డల పెంపకంలో
భర్త సేవల తో తరించి పోయాను !
నువ్వు అనుకున్నావు!స్త్రీ సమస్యల సాధనకై నేను
పోరాడాలని!

నేను మాతృమూర్తి నయ్యాను

భార్యగా
పిల్లలకు తల్లిగా, నా పరిధులను పరిమితం చేసుకున్నాను!
నువ్వు అనుకున్నావు!స్త్రీల అభివృద్దే నా లక్ష్యం కావాలని
నేను నా భర్త అభివృద్దే నా లక్ష్యం అనుకున్నాను
కనీస గుర్తింపైనా ఇవ్వకపోతాడాని ఎదురు చూసాను !
నువ్వు అనుకున్నావు!సమాజం కేంద్ర బిందువు కావాలని
సామాజిక స్థతులను నేను అధ్యయనం చెయ్యాలని

నాకు కుటుంబం
కేంద్ర బిందువయ్యింది

భర్త గుర్తించే భార్యగా ఉండాలని తపన పడ్డాను!
నువ్వు అనుకున్నావు! పోరాటం నా మార్గంగా ఉండాలని
ప్రజల హక్కుల కోసం పోరాడాలని,

నేను నా కుటుంబంలో
కనీస హక్కుల కోసం అనుక్షణం,అహర్నిశలు పోరాడాను!
అమ్మా ! ఇప్పుడు నువ్వు అనుకున్నవన్నింటినీ సాధించే క్రమంలో
నా జీవితాన్నే సవాలు చేస్తూ మున్ముందుకే వెళుతున్నాను !

– కవిని ఆలూరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , , , Permalink
0 0 vote
Article Rating
6 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
దడాల వెంకటేశ్వరరావు
దడాల వెంకటేశ్వరరావు
5 years ago

అమ్మా !
నువ్వనుకున్నావ్
నే రచయిత్రినై పేద ప్రజల ఆక్రందనలే విషయాలుగా వ్రాయాలని
కానీ నే వంటలతో ఇంటి అందరిని మెప్పించే వంటగత్తెనయ్యా

అమ్మా !
నువ్వనుకున్నావ్
నే పంతులమ్మనై జ్ఞానంలేని ప్రజలకు ఆదర్శంగా నిలవాలని
పంతులమ్మనై కూడా లాభాపేక్ష లేకుండా విద్యాదానం చేయలేకపోయా

అమ్మా !
నువ్వనుకున్నావ్
నీ లాయర్నై న్యాయం,ధర్మాలకు మార్గదర్సకమై నిలవాలని
కాని నేను నా బిడ్డలను పెంచే తల్లినై భర్త సేవలకే అంకితమయ్యా

అమ్మా!
నువ్వనుకున్నావ్
నే స్త్రీల సమస్యలు పరిష్కరింఛి వారి అభివృద్ధి సాధనకై నే పోరాడాలని
కానీ నే మాత్రుమూర్తినై నా పరిధులను పరిమితం చేసుకున్నా
నేను భర్త అభివృద్దే లక్ష్యంగా పెట్టుకుని గుర్తింపుకోసం ఎదురుచూస్తున్నా

అమ్మా !
నువ్వనుకున్నావ్
నే సమాజ కేంద్ర బిందువై సామాజిక స్థతులను అధ్యయనం చెయ్యాలని
కాని కుటుంబానికి కేంద్రభిందువై భర్త గుర్తించే భార్యలా ఉండడానికే సిద్దపడ్డా

అమ్మా !
నువ్వనుకున్నావ్
పోరాటమే నా మార్గమై ప్రజల హక్కులకోసం అనుక్షణం తపిస్తూ ఉండాలని
కాని నా కనీస హక్కులకోసం అహర్నిశలు పోరాడుతున్నాను

అమ్మా!
నువ్వు అనుకున్నవన్ని సాధించే క్రమంలో
నా హక్కులను పరిరక్షించుకుంటూ నావాళ్ళన్దరిని కలుపుకుంటూ
జీవితాన్నే సవాలుచేసి ముందుకు వెళుతున్నా
నువ్వు నే కావాలునుకున్న దానికన్నా గొప్పగా తిరిగిరావాలని ఆశిస్తున్నా

దడాల వెంకటేశ్వరరావు
దడాల వెంకటేశ్వరరావు
5 years ago

కవిని గారు నన్ను క్షమించాలి
మీ కవితనే మళ్ళీ ఇలా వరుస క్రమం మార్చుతూ ప్రస్తుత పరిచాను
ఇప్పుడైనా ,నీరజ, గారు మీ కవితను కవితగా ఒప్పుకున్తారనుకుంటాను

neeraja
neeraja
5 years ago

కవిత్వ౦ కానిదాన్ని కవిత్వ౦ పేరిట ప్రచురిస్తే అసలు కవిత్వానికి అన్యాయ౦ చేసినట్టవుతు౦ది. జాగ్రత్త వహి౦చాల్సిన అవసర౦ వు౦ది.

Neela
Neela
5 years ago

అక్కా! మీ కవిత చాలా బాగుంది

Delhi Subrahmanyam
Delhi Subrahmanyam
5 years ago

చాలా బాగా రాసారు కవిని గారూ. చక్కటి కవిత.

subburu bhaskar
subburu bhaskar
5 years ago

మేడం hats off to యు……….గాడ్ బ్లెస్స్ యు…………….