గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహా లక్ష్మి(ఆత్మ కథ)

gouthami gangaగ్రంథాల నుండి అనేక వ్రత విధులను సేకరించి స్త్రీల వ్రతాల కథలు అనే గ్రంథాన్ని మూడు సంపుటాలుగా వెలువర్చారు. సీతమ్మ గారు ఆ పుస్తకం కొనుక్కున్నారు. బాలాది వారాలు, బాగ్యాదివారాలు, తరగనాదివారాలు అన్నవి సూర్యదేవుని అనుగ్రహం చేకూర్చే వ్రతాలు. రథసప్తమి నాడు కాని, మహాశివరాత్రి నాడు కాని కర్మసాక్షి సూర్యదేవునికి ప్రీతిగా పాలు పొంగించి, ఈ వ్రతాలుపట్టి కథ చదువుకొని అక్షతలు శిరస్సుపై ధరించాలి. వ్రతంలో చెప్పిన విధంగా ఆచరించాలి. బాలాది వారాలు, భాగ్యాధివారాలకు ఆదివారం ఉదయమే తలార స్నానం చేసి గౌరీ దేవిని, సూర్యునీ ఆరాధించి కథ చెప్పి అక్షతలు వేసుకోవాలి. రాత్రి ఏకభుక్తం చేయాలి. ఓ ఏడాదిపాటు ఆ విధంగా చేయాలి. ఉద్యాపన 5 శేర్ల పాలలో 5 సోలల బియ్యం పరమాన్నం వండాలి. ఆ పరవాన్నం అడుగట్టూపై అట్టు తాను వుంచుకొని మధ్య పరమాన్నం దక్షితాంబూలాదులతో బ్రాహ్మణునికి వాయనం ఇవ్వాలి. తరగనాది వారాల నోము చిత్రమైనది. ‘‘తరుగు తరుగనరాదు, తరగరాదు, తరిగిన కూర తినరాదు’ అన్నది తరగనాదివారాల నోము కథ. ఏడాది పాటు ప్రతి ఆదివారం ఎవరినీ కూడ తరగమని చెప్పరాదు.

తాను కూర తరగరాదు. తరిగిన కూరలు తినరాదు. వీరి అవసరం గ్రహించి, ఎవరైనా కూర తరిగి పెడితే ఆమె వండవచ్చు. ఈ విధంగా చేస్తే సంతానం బ్రతికి కడుపు చలవకలుగుతుందట. పొట్ట విచ్చని గౌరీదేవి లేక కడుపు చెదరని గౌరీదేవి అని ఓ నోము. 5 శేర్ల బియ్యం నూక విసరాలి. 5 కొబ్బరి కాయలు కొట్టి బెల్లం కలిపి లస్కోరా చేయాలి. శేరు పిండికి ఓ వుండ్రం చొప్పున పూర్ణం వుండ్రాలు 5 తయారు చేయాలి. వాటిని జాగ్రత్తగా ఆవిరిపై వుడకబెట్టాలి. అలా ఉడికేటప్పుడు అవి విచ్చిపోకుండా జాగ్రత్త వహించాలి. ఆ ఉండ్రాళ్లు ముత్తయిదువుకు ఒకటి చొప్పున 5గురికి వాయినం ఇవ్వాలి. నందికేశ్వరుడి నోము కథ ఈ విధంగా వుంటుంది.

ఓ రోజున కైలాసంలో పార్వతీదేవి శివునికి పాదసంవాహం చేస్తూంది. ఫక్కున నవ్వాడాయన. ఎందుకు నవ్వుతున్నారు అందామె. ఇంత త్రిలోక సుందరివే నీ అరచేతులు ఎంత గరుగ్గా వున్నాయ్‌ అన్నాడాయన. వచ్చిన ఉక్రోషాన్ని తమాయించుకొని ఈ చేతులు మెత్తబడే మార్గం ఏదో మీరే చెప్పండి అంది భార్య. నీవు కాశీ పోయి అక్కడ గంగ ఒడ్డున పొయ్యి పెట్టి వేడి నీళ్లు కాస్తూ గంగా స్నానానికి వచ్చిన వారందరికీ తలంటు పోయి అన్నాడు పెనిమిటి. నిత్యం వెన్న కాని, నూనె కాని మర్దనా చేస్తుంటే చర్మం మెత్తబడుట అనూచవైక వేద్యం తలంటు ఐశ్యర్యప్రదం. అందులో జగన్మాత చేతుల మీదుగా ఇంకేముంది గంగా స్నానానికి వచ్చిన వారంతా మహదైశ్వర్యవంతులౌతున్నారు. ఓ పేదరాలు చినిగిన బట్టలతో, నలుగురు పిల్లలతో గంగా స్నానానికి వచ్చి బెదురు చూపులతో దూరంగా నిలిచి వుంది. పార్వతీ దేవి ఆమెను దగ్గరకు పిలిచి తలంటు పోసింది. ఆమెకు సర్వైశ్యర్యాలు సిద్ధించాయి. కొన్నాళ్లు గడిచాయి.

తాను తలంటు పోసిన స్త్రీ ఎలా వుందో చూద్దామని స్వయంగా బయలుదేరింది పార్వతి. ఆమె ఒక భవనంలో ఊగుటుయ్యాలపై ఊగుతూంది. పట్టుచీర కట్టి, ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించి వుంది. గుమ్మం వారగా నిలిచి చూస్తోంది పార్వతీదేవి ఆమెను గుర్తించని ఇల్లాలు, అమ్మా! పొయ్యి మీద పాలు పొంగుతున్నాయి. ఓ నీళ్ల చుక్క చిలకరించి వెడుదూ అంది. పట్టరాని కోపం వచ్చింది పార్వతికి నాకు పని చెప్పే పాటి దానివయ్యావా? అనుకుంటూ గిర్రున తిరిగి వెళ్లిపోయింది. ఇల్లు చేరి పెద్ద కొడుకును పిలిచి అబ్బాయి భూలోకంలో ఓ గర్విష్టి వుందిరా! నీవు వెళ్లి దాని ఐశ్వర్యం ఊడబీకిరా! అంది. పరుగున వెళ్ళాడు బొజ్జ గణపయ్య, బ్రాహ్మణి అతడిని చూస్తూనే ఐదు శేర్ల బియ్యంతో ఉండ్రాళ్ళు వండి పెట్టింది. గణపతి సంతోషించి, దీవించి రెట్టింపు ఐశ్వర్యం ఇచ్చి వెళ్లాడు. పార్వతి నందికేశుణ్ణి పంపింది. ఆమె ఐదు శేర్ల శనగలు నానబెట్టి పెట్టింది. హరునికి అప్పాలు, కాలభైరవుడికి గారెలు, గౌరీదేవికి అట్లు, చంద్రునికి చలిమిడి. నాగేంద్రుడికి చిమ్మిలి, సూర్యునికి పరమాన్నం, వండి పెట్టింది. వీరంతా సంతుష్టులై ఆమెకు మరిన్ని ఐశ్వర్యాలు ఇచ్చారు.

ఈ సారి పార్వతే మళ్ళీ వచ్చింది. ఆమెను గుర్తించిన బ్రాహ్మణి, పసుపు, కుంకుమలతో పూజించి 5 శేర్ల బియ్యం, పులగం వండి పెట్టింది. పార్వతీ దేవి ప్రసన్నురాలై ఆమెకు వరాలు ఇచ్చింది. ఈ నోము కథలో చెప్పిన తొమ్మిది దినుసులు, రకానికి 5 శేర్లు చొప్పున తయారు చేసి, ఆయా దేవతలను పూజించి నివేదన చేసి బ్రాహ్మణులను ఇంటికి పిలిచి తృప్తిగా భుజింప చేయాలి. పదార్థాలు గడపదాటించరాదు. సూర్యాస్తమయంలోగడ సరుకు చెల్లిపోవాలి. దానికి ఉద్యాపన వడుగులో వటువుకు నాందీ ముఖం వేళ 5 శేర్ల పెసరపప్పు నానబెట్టి ఓ ఇత్తడి పాత్రలో పోసి క్రొత్త పట్టు పంచ వాసెన కట్టి బంగారు నంది, వెండి నంది, దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. పెదతల్లి సీతమ్మ గారి చేత ఈ నోము పట్టించింది. ఈ విధంగా రోజూ ఓ నోముతో ఇరుగు పొరుగు వారికి విందులు జరిగేవి.

ఏడుకొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు త్రేతాయుగంలో ఆంధ్రుల ఇలవేలుపు. కొండల రాయునికి మ్రొక్కుకొని నెలలో శుక్ల, కృష్ణ పక్షాలలో వచ్చే రెండు ఏకాదశులకు వేంకటేశ్వరునికి రాగి డబ్బు ముడుపు కట్టి మా సంతతి నిలచాక ఆ శిశువుకు వేంకటేశ్వరస్వామి పేరు పెట్టుకొని ఏడాది నిండకుండా శ

చిరంజీవి అవుతుంది. మా పెద్దాడిని అలాగే మా ఊళ్లో పదిమంది బిడ్డలుకల తల్లికి దత్తత ఇచ్చాం. మావాడు మొన్న మొన్నటి వరకూ మీ పిన్నిని అత్తా అని ఆమెను అమ్మా అని పిలిచేవాడు. అలాగే నామకరణంలో వ్రాసిన పేరు కాకుండా ఏదైనా గ్రామ్యానామంతో కాని, హాస్యస్పోరకమైన నామంతో కాని పిలవాలి. వెర్రయ్య, వెర్రమ్మ, చిట్టెమ్మ, చిట్టయ్య, పిచ్చమ్మ, పిచ్చయ్య వంటివి అందులో కొన్ని, మరికొందరైతే పెంట కుప్పపై పడుకో బెట్టి బిడ్డను పెంటయ్య అని అన్నం తిని పారేసిన విస్తరి (పులి విస్తరి)లో పడుకోబెట్టి పుల్లమ్మ అని పిలిచేవారు. సుబ్బమ్మగారు కూతురికి నెలలు నిండినప్పటినుంచీ తాను తిన్న ఎంగిలి విస్తరి పుట్టబోయే బిడ్డను పడుకోబెట్టడానికి శాస్త్రి గారు చూడకుండా దాచి వుంచేవారు. ఈ బిడ్డను ఆ విధంగా అమ్మమ్మ పులి విస్తరిలో పడుకోబెట్టి తల్లీ, అమ్మమ్మ పుల్లమ్మా! అని పిలచేవారు కొంతకాలం.

శాస్త్రిగారికి ఒక ప్లీడరు గారి కుటుంబంతో సన్నిహిత పరిచయం వుండేది. శాస్త్రి పురిటి స్నానం రోజున తాను బిడ్డకై చేయించిన మూడు కాసుల మామిడి పిందెలు, సిగ్గు బిళ్ళా 3 కాసుల ఆంజనేయులు బిళ్ళకల గొలుసు 3 కాసులతో చేసిన 3 జతల బుల్లి గాజులు ఆమె చేతికి ఇచ్చి, అమ్మా! ఈ రోజునుండి నా పిల్ల మీపిల్ల మీ ఒడిలో చేర్చుకొని ఈ నగలు దానికి మీ చేత్తో పెట్టండి అన్నారు. ఆ ఇల్లాలు చిరునవ్వుతో అలాగే లెండి అంది ఇక మీదట నా పిల్లే అన్నారు ఆమె. పురిటి స్నానం రోజున ఆమె వీరింటికి వచ్చి పసిబిడ్డను ఒడిలో పెట్టుకొని, ఆ నగలు అలంకరించి దీవించి వెళ్ళారు. ఆమె పచ్చని దబ్బ పండు చాయలో 6 అడుగుల అజానుబాహులైన కాయపారు మనిషి. కాటుక కళ్లు, దీర్ఘ నాసిక, ఉంగరాల జుట్టూ ఆమెకు పెట్టని ఆభరణాలు. చక్కని లేతరంగు జరీ అంచు చీరలు గోచి పోసి కట్టుకొని చేతులకు 5,6 జతల బంగారు గాజులు, మెడలో కుంకుడుకాయ సైజు పగడాలు, 3 పేటల గోలుసులు 2 చెవులకు, ముక్కులకు వజ్రాల ఆభరణాలు దాల్చి, గులాబిరంగు కుంకుమ దాల్చి ఆమె లక్ష్మీ కళతో వుండేవారు. నాటి నుండి ఈ పిల్లను వారి బిడ్డగానే భావించారు ఆ దంపతులు.

సుబ్రహ్మణ్యం దంపతులు కుమారులిరువురికి పేర్లు కాసులే. ఆ ప్రకారంగానే శాస్త్రి దంపతులు కూడా తమ పిల్లను కాసులు అని పిలవసాగారు. ఆ ఇంటిలో బిడ్డ పుట్టగానే పొత్తుబట్టలకు తమ ఇంటిలోని పాత బట్టలు కాకుండా కడుపు చలవఅయినా వారి బట్టలు వాడటం ఆచారం. ఆ ప్రకారంగా సీతమ్మ గారికి ప్రసవించే రోజులు దగ్గర పడగానే ప్లీడరు గారి భార్య తనది ఓ గ్లాస్కో చీర, ప్లీడరు గారి గ్లాస్కో పంచ తెచ్చి సీతమ్మ గారికిచ్చారు. ఆ ప్రకారంగా ఆమె కాసులుకే కాక తరువాత పిల్లలకు కూడా తన బట్టలే పిల్లలు పుట్టగానే పొత్తుబట్టలుగా వాడమని ఇచ్చారు. తనకు సంతు కలిగి బాగున్నాక సీతమ్మగారు తెలిసిన స్త్రీలందరకూ పొత్తుబట్టలూ, బాలింతరాలికి పాత బియ్యం, పత్యపు ఊరగాయలు తానే స్వయంగా పట్టుకెళ్లి ఇచ్చేవారు. నాటి కాలం వారి నమ్మకాలు ఆ విధంగా వుండేవి. శాస్త్రి దంపతులకు కానక కలిగిన సంతానాన్ని బంధుమిత్రులంతా కూడా అపురూపంగా చూడసాగారు.

– కాశీచయనుల వెంకట మహా లక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

257
ఆత్మ కథలు, గౌతమీగంగPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో