ఎపుడైనా ఆదమరచి
నీ ఉనికిని మరచానా
ఎద వాకిట క్షణమైనా
ఆలసించి నిలిపానా ………..
పెదవులపై తొణికిసలై
విరబూసిన తలపులలో
పరవశించి మేను మరచి
నీ అడుగుల సడి వినలేదా?
చిరునవ్వుల వెన్నెలలో
తడిసి తడిసి తమకాన్నై
మసక వెలుగు మలుపులోన
నిలచిన నీ రూపం గమనించలేదా
ఎపుడైనా ఎక్కడైన
లోలోపలి పొరబాటైనా
ఒక్కమాట క్షణమైనా
నీవులేని నేనెక్కడ
– స్వాతీ శ్రీపాద
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~