గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహా లక్ష్మి(ఆత్మ కథ)

gouthami gangaవసంతరావు వేంకటరావు గారు అంతవరకూ గ్రంథాలకే పరమితమయిన విజ్ఞాన విషయాల్ని సామాన్యులకు సుబొధకంగా చెప్పేవారు. వేంకటానంద రాఘవరావు గారు ఎన్నెన్నో అద్భుతమైన ఖగోళ శాస్త్ర రహస్యాలను సుబోధకంగా హృద్యంగా తెలియజెప్పేవారు. ‘నక్షత్రముగల చిన్నది నక్షత్ర కులావతంశు నక్షత్రమునకు పిలిచి, అన్నది వారి చమత్కార పద్యాలలో ఒకటి. నక్షత్రము గల చిన్నది ఉత్తర నక్షత్ర కులావతంశు చంద్రవంశ శేఖరుడైన అభిమన్యుని నక్షత్రమునకు మూలకు పిలిచింది. మహాభారత సంగ్రామం జరుగుతోంది. పద్మవ్యూహాన్ని ఛేదించడానికి అభిమన్యుడు బయలుదేరుతున్నాడు. ఈ యుద్ధ పర్యవసానం ఎలా వుంటుందో తెలియదు. అతడితో ఏకాంతంగా సంభాషించగోరి క్రొత్త పెళ్లికూతురు ఉత్తర అతడిని చాటుకు పిలిపించి ఎంత హృద్యమైన పద్యమో చూడండి.

చిన్నది విరటుని కూతురు ఉత్తర (ఉత్తరా నక్షత్రం వుంది కదా) నక్షత్రకులావతంశుడు చుక్కలరేడు వంశశిరోభూషన అభిమన్యుడిని నక్షత్రమునకు మూల చాటుకు (మూల నక్షత్రం పిలచిందట) కొత్త పెండ్లి కొడుకు అభిమన్యుడు కాళ్ళ పారాణి ఆరకుండానే కదన రంగానికి తరలవలసి వచ్చింది. నూతన వధువు ఉత్తర భర్తకు వీడ్కోలు చెప్పగోరి నలుగురిలో మాట పెగలక చాటుకు రమ్మని సైగ చేసింది కాబోలును. ఒక విజ్ఞాన ఖనిలో ఎంతటి సాహితీ ప్రవీణ్యత వుందో చూడండి. పురుషోత్తంగారు నయాగరా జలపాతం వంటి వారి ఉపన్యాస రaరితో ఆర్షధర్మ విశిష్టతనీ సర్వులకూ ఆర్షధర్మాన్ని పాటించవలసిన ఆవశ్యకతనీ చాటి చెప్పేవారు. సత్యనారాయణగారు ప్రపంచ యుద్దం కారణంగా దేశంలో ఏర్పడుతున్న దుస్థితినీ, ద్రవ్యోల్పణాన్ని అరికట్టవలసిన ఆవశ్యకతనీ వివరించే వారు. ఆధునిక కవిపుంగవులు నాడు దేశంలో వికసిస్తున్న భావ కవిత్వాన్ని, వంగ భాషా సాహిత్యపు అనువాదాల మాధుర్యాన్ని సుమధుర శైలిలో సభ్యులకు పరిచయం చేసేవారు. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాన్ని కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఎంతో దక్షతతో నిర్వహించేవారు.

బ్రహ్మ మత ప్రభావం వలన మూఢాచారాలకు వ్యతిరేకులైన సీతా అనసూయలు సంప్రదాయానికి మాత్రం వ్యతిరేకులు కారు. మన సంప్రదాయాలపై వారికి విశేష మక్కువ. స్వగ్రామంలో కాకినాడలో జరిగే సంప్రదాయ వేడుకలలో, దేవతా ఉత్సవాలలో, దేవాలయోత్సవాలలో జాతరలలో నోములూ, వ్రతాలలో వారు ఎంతో ఆసక్తితో పాల్గొనేవారు. వానిలోని సహజ సౌందర్యానికీ మనోజ్ఞతకు ముగ్థులైన వారు వాటిని పాటించి ప్రచారం చేయడానికి నిశ్చయించుకున్నారు. పెళ్ళిళ్ళలో పాడే వరుస పాటలనెన్నో వారు మధురంగా పాడేవారు. తరువాతి కాలంలో ఆ సోదరీమణులు ఆ పాటలకు విశేష ప్రచారాన్ని కలుగజేసారు. అనసూయ గారు స్త్రీల సంప్రదాయపు పాటలు అనే పేరుతో ఎన్నో నోము పాటలు సంకలనం చేసారు. వాటిలో శ్రావణ మంగళవారం పాట, శ్రావణ శుక్రవారపు పాటలతో పాటు కొన్ని అరుదైన పాటలు కూడా వున్నాయి. సీతగారు జానపద గేయ సాహిత్యంలో విశేష కృషి చేసి ఎన్నో పాటల్ని ఆలిండియా రేడియో ద్వారా ప్రచారం చేసారు. చిన్న నాటి వారి స్వగ్రామంలోనూ, పిఠాపురంలోనూ, కాకినాడలోనూ ఉత్సవాలలో సంప్రదాయపు వేడుకల్లో విన్న ఎన్నో పాటలను సంస్కరించి ప్రచారం చేసారు. ‘అన్నాడే వస్త నన్నాడే నా నేస్తము విడువలే నన్నాడే. దస్తు మూటలు తెస్తనన్నాడే దోస్తీ ఇస్తారమ్మని చెప్పమన్నాడే॥ అన్న॥ వస్తువు లెడతా నన్నాడే ఎంతో ముస్తాబు చేస్తానన్నాడే। అన్న గేయం ‘మల్లీ నా బంగారు మల్లీ। పోదాము రాయే తిరునాళ్లకు॥ మల్లీ॥ గాజులు తొడిగిస్తా,

20వ శతాబ్ధపు ప్రథమార్ధం ముగిసే వరకూ నోములు, వ్రతాలు హిందూ స్త్రీల జీవితంలో ప్రముఖ స్థానం వహించాయి. ఆరోగ్యాన్ని కలిగించే కొన్ని అలవాట్లు అలవరచుకోవడానికీ, బాలికలలో అధ్యాత్మిక భావాన్నీ, ఆత్మ స్థైర్యాన్ని కలిగించడానికీ నోములు ఉద్దేశింపబడ్డాయి. సావిత్రీ, గాయత్రీ, సరస్వతులు సంధ్యావందన వేళ ఉపాసింపబడే సంధ్యాధిష్ఠాన దేవతలు ‘సవితురపత్యం సావిత్రీ’’ సూర్యపుత్రిjైున ఈ సావిత్రీ దేవి ఆది పరాశక్తి అంశ. ఈ సావిత్రి వరం వల్ల పుట్టిన అశ్వపతి అనే రాజు కూతురు మన కథలోని సావిత్రి గౌరీదేవి. తన ఆత్మ శక్తితో యముని మెప్పించి అల్ఫాయుష్కుడైన భర్తను దీర్ఘాయురోపేతుని చేసుకున్నది ఆమె. నన్నయ గారి భారతంలో సావిత్రి యముని మెప్పించిన తీరు హృద్యంగా చిత్రించబడిరది. ఆ పద్యాలు వేద ఋక్కులులా పవిత్ర భావాన్ని కలిగిస్తూ వేద ఋక్కులకు భాష్యాలలా వుంటాయి.

సంక్రాంతి పండుగ మూడు రోజులూ అయ్యాక నాలుగవ రోజు ముక్కనుమ. ఆనాడు సావిత్రీ గౌరీదేవి వ్రతం ప్రారంభం అవుతుంది. ఈ వ్రతం తొమ్మిది సంవత్సరాలు ఏటా తొమ్మిది రోజుల పాటు నియమ నిష్ఠలతో ఆచరించాలి. వ్రత దీక్షలో భంగం కలిగితే మరో ఏడాది ఈ వ్రతం ఆచరించాలి. ముక్కనుమనాడు ఉదయాన్నే నూతనంగా వివాహమైన బాలికలు బొమ్మల నోము పడతారు. ఉదయాన్నే తలంటు స్నానం చేసి, మడిగా ఆర వేసిన పట్టు చీరలు ధరించి నోము పట్టే వారింటికి పూజా ద్రవ్యాలతో నైవేద్యాలతో చేరుతారు. అక్కడ ఒక సావిడి శుభ్రంగా బూజులు దులిపి, అలికి ముగ్గులు పెట్టి, గడపలకు పసుపు కుంకాలు అలది, గుమ్మాలకు మామిడాకుల తోరణాలు కట్టి సిద్ధం చేసి ఉంచుతారు ఆ ఇంటి వారు గది మధ్యలో ఉయ్యాల గొలుసులు గట్టిగా అమర్చి ఓ నలు చదరపు పెద్ద సైజు పీటకు పసుపు పూసి, కుంకుమ, వరిపిండి, పసుపుతో పద్మాలు పెట్టి ఉయ్యాల ఏర్పరుస్తారు. బల్ల క్రింద సారవంతమైన పుట్ట మన్ను తెచ్చి పోసి నీటితో తడిపి పదును చేసి వుంచుతారు. సావిడిలో ఈశాన్యపు మూల గాలి తగలని చోట ఓ పెద్ద మట్టిమూకుడులో అఖండజ్యోతి వెలిగిస్తారు. ఈ జ్యోతి నోము తొమ్మిది రోజులు అహోరాత్రాలూ ఆరిపోకుండా వెలగాలి. ఇంటిలోని వృద్ధ ముత్తయిదువులు ఈ అఖండజ్యోతిని శ్రద్ధాభక్తులతో సంరక్షిస్తారు. నోము పట్టే ముత్తయిదువులు మంగళ వాయిద్యాలతో బయలుదేరి దేవాలయ ప్రాంగణంలో బొమ్మలతో నిరీక్షించే కుమ్మరివాని వద్దకు వెడతారు. బంకమట్టితో స్థూపాకారంగా బొమ్మలను తయారు చేస్తాడు కుమ్మరి. మధ్య మధ్య నొక్కులతో ఉన్న ఈ సావిత్రి గౌరీ దేవి ప్రతిమల్ని నోము పట్టే ముత్తైదువులంతా తలో ఐదు తెచ్చుకొంటారు. కుమ్మరి వానికి పారితోషికం చెల్లించి సావిత్రీ గౌరీ దేవిని కీర్తిస్తూ ఈ బొమ్మల్ని నోము పట్టే ఇంటికి తెచ్చుకొనే సరికి అయ్యవారు ( పూజ చేయించే పురోహితుడు) వచ్చి సిద్ధంగా వుంటారు.

ఉయ్యాల చుట్టూత నేల మీద నోము పట్టే ముత్తయిదువులంతా తడి చేత్తో అలికి వరి పిండితో తలో 9 పద్మాలు పెట్టుకొంటారు. ఆ పద్మాలపై పసుపూ కుంకుమ అక్షతలూ, పూలు జల్లుతారు. తొమ్మిది పోగులు కల వత్తిని ఆవు నేతితో తడిపి ఆ కుందెలో వుంచి బల్లపై వుంచుతారు మంత్రయుక్తంగా బొమ్మలలో సావిత్రి గౌరీ దేవిని ఆవాహన చేసి బల్లపై వేంచేపు చేయిస్తారు. పసుపు, కుంకుమలతోనూ, పూలతోనూ వీటిని అలంకరించాక వ్రతం నిర్విఘ్నంగా కొనసాగటానికి విఘ్నేశ్వరుని పూజించి ఉద్వాసన చెప్పాక నవ ధాన్యాలను పాలతో తడిపి బల్ల క్రింద సిద్ధంగా వున్న పుట్ట మట్టిలో వీటిని అంకురారోపణ చేస్తారు. గోధుమ, వరి, బొబ్బర్లు, ఉలవలు, శనగలు, కందులు, నువ్వులు, మినుములు, పెసలు, నవధాన్యాలు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు అను వారు నవగ్రహాలు. ఈ నవగ్రహాలకు ప్రీతికరమైన ఈ నవధాన్యాలు నవగ్రహాల ఆనుకూల్యం కోసం మంత్రయుక్తంగా చల్లి మొలకెత్తింప చేస్తారు. సారవంతమైన పుట్ట మట్టిలో ముత్తయిదువుల సంరక్షణలో ఈ మొక్కలు ఏపుగా పెరిగి నయనానందకరంగా వుంటాయి. మూడవ నాటి నుంచి నోము ముగిసే వరకూ. శ్రీ సూక్త విధిగా సావిత్రీ గౌరీ దేవికి అర్చన జరుగుతుంది. నైవేద్యాలకు కూడా ఓ ప్రత్యేకమైన విధానం వుంది. ఆ ప్రకారం తొమ్మిది రోజులూ తొమ్మిది రకాల దినుసులు నైవేద్యం చేయాలి. తరువాత వారు ముత్తయిదువులకు వాయనం ఇవ్వాలి. ఈ వాయనం అందుకోవడం మహాఫలప్రదమని భావించి 9 మంది పెద్ద ముత్తయిదువులు మడి కట్టుకొని సిద్ధంగా వుంటారు. పూజ ముగిసాక నోము నోచే ముత్తయిదువులు ఎదురుగా కొన్ని బియ్యం పోసుకొని సావిత్రీ గౌరీదేవి ఎదుట నేలపై కూర్చొంటారు. రెండు ముంజేతులనూ ఒక దానిపై ఒకటి వుంచి ఆ గుప్పెళ్లలో బియ్యాన్ని తీసుకొని వాటిని కొద్ది కొద్దిగా క్రిందకు వదులుతూ తల్లి దండన, తండ్రి దండన, అత్త దండన, మామ దండన, పురుషదండన, పుత్ర దండన సావిత్రి గౌరీ దేవమ్మా! తల్లీ! ఏ దండనా లేకుండా చూడు అని సావిత్రీ దేవిని ప్రార్థిస్తారు.

( ఇంకా ఉంది )

– కాశీచయనుల వెంకట మహా లక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
244
ఆత్మ కథలు, గౌతమీగంగ, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో