ఎనిమిదో అడుగు – 25

Anguluri Anjani devi

Anguluri Anjani devi

‘‘కరక్టే ప్రభాత్‌! కానీ మన చుట్టూ వున్న గాలి, నీరు, నేలల్లో హానికారకాలు అసౌకర్యాన్ని, అనుకోని మార్పుల్ని కలగజేస్తే దాన్ని కాలుష్యం అంటున్నాం…. మనం చూస్తుండగానే పరిమితి లేకుండా పుట్టుకొస్తున్న వ్యర్థాలతో గాలి, నీరు, నేల కలుషితమవుతోంది.  దీని గురించి ప్రపంచంలోని అన్ని దేశాలు తర్జన,భర్జనలు పడటం తప్ప పరిష్కరించలేకపోతున్నాయి…. అలాగే కొన్ని  మెడికల్‌ షాపుల్లో కెమిస్ట్రీలు చేస్తున్న విపరీతాలు చూస్తుంటే, రోగులు పడ్తున్న ఇబ్బందులు చూస్తుంటే ఒక్కోసారి మేము ఏం చేస్తున్నాం! ఏం చెయ్యగలుగుతున్నాం అని బాదేస్తుంది.’’ అంది చేతన.

                                    ‘‘ఒక డాక్టరుగా నేను కూడా నీలాగే ఆలోచిస్తుంటాను. ఆలోచిస్తే తప్పులేదు కాని ప్రశ్నించుకోవద్దు.  మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తున్నాం.  అందుకే నువ్వు చెయ్యగలిగింది నువ్వు చెయ్యి.  అంతవరకే తృప్తిపడు. అంతకుమించి ఒన్‌పర్సంట్‌ ఆలోచించినా మైండ్‌ బ్లాకైపోతుంది.  అది గుర్తుంచుకో….’’ అన్నాడు

 చేతన మాట్లాడలేదు.

  ఏం మాట్లాడితే చేతన హుషారవుతుందో,  ఉత్సాహంగా వుంటుందో ప్రభాత్‌కి తెలుసు… ఆమెలో అలాంటి మార్పును ఒక్క ప్రభాతే తేగలడు. అది చేతనకి తెలుసు. అతను మధ్య, మధ్యలో నవ్విస్తూ మృదుగంభీరంగా  మాట్లాడుతుంటే ఆ మాటల ప్రవాహంలో ఆమె మనసు దూదిపింజలా తేలిపోతూ వినూత్న శక్తిని పుంజుకుంటోంది.

                 ***                                   ***                                         ***                                    ***

                                    ఆకాశంలోకి చూసినప్పుడు మేఘాలు వివిధ ఆకారాల్లో కన్పిస్తాయి.  ఏ రెండు మేఘాలు ఒకే ఆకారంలో వుండవు.  మరి వాటికి ఆ ఆకారాలు ఎలా వస్తున్నాయి.   అంటే కారణం వాటి చుట్టూ వున్న గాలి.  కానీ వాతావరణంలో గాలివాటం ఎప్పుడూ ఒకే రకంగా వుండదు.  వేడిగా, చల్లగా, వుదృతంగా వుండి అది పయనించే  వివిధ దశల్లో మేఘాలను లాగుతూ, తోస్తూ వుంటుంది.   ఇలా వాతావరణంలోని గాలి వల్ల మేఘాలు వివిధ ఆకారాలను పొందుతాయి. మనిషి కూడా అంతే! తన చుట్టూ వున్న పరిసరాలు ప్రభావాలతో మార్పు చెందుతాడు.

                                    హేమేంద్రకి కొడుకు పుట్టాడు.

                                    రోజులు గడుస్తున్నాయి…

                                    బాబు పుట్టిన రోజు సందర్భంగా హేమేంద్ర రిప్రజెంటేటివ్‌లకు పార్టీ ఇచ్చాడు.ఈ సారి పార్టీ చాలా గొప్పగా, ఖరీదైనదిగా వుంది.  వాళ్లు కూర్చున్న చోట డబ్బును పరిచనట్లు, డబ్బును శ్వాసిస్తున్నట్లు, డబ్బును తాగుతున్నట్లు వుంది.

                                    హేమేంద్ర తాము చూస్తుండగానే ఒక స్థాయికి ఎదగడం వాళ్లకి ఆశ్చర్యంగా, ఆనందంగా వుంది.  ఇంకా ఎదగాలని వుంది, హేమేంద్ర అలా సంపాయించటానికి కొరణం అతని షాపుకి పక్కనున్న క్లినిక్‌, పాలిక్లినిక్‌గా మారడమే అని వాళ్లకి తెలుసు.

                                    హేమేంద్ర కృతజ్ఞతతో చూస్తూ ‘‘మిారిచ్చిన అడ్వయిజ్‌తో నేనింతవాడ్ని అయ్యాను సర్‌! సరైన టైంలో నాకు మంచి జీవితాన్నిచ్చారు.’’ అన్నాడు.

                        ‘‘అసలు నీకు చెప్పాల్సింది ఇంకా వుంది హేమేంద్రా!’’ అన్నాడు ఈశ్వర్‌.

                        ‘‘ఏంటి సర్‌!’’ అన్నాడు హేమేంద్ర ఆత్రంగా ముందుకి వంగి.

                        ‘‘…. నువ్వొక ఫ్యాక్టరీ పెట్టి మందులు తయారు చెయ్యాలి హేమేంద్రా!’’ అన్నాడు ఈశ్వర్‌.

                        షాక్‌ తిన్నాడు హేమేంద్ర.  అతనలాషాక్‌లో వుండగానే….

                        ‘‘మేమంతావచ్చి నీ దగ్గర జాబ్‌ చేస్తాం.’’ అన్నాడు ఇంకో రిప్రజెంట్‌టివ్‌.

                        హేమేంద్ర ఇంకా షాక్‌ తిని అలాగే చూస్తుంటే భుజం తట్టాడు ఈశ్వర్‌.

                        హేమేంద్ర తేరుకొని ‘‘సర్‌ ! నేనెక్కడ? ఫ్యాక్టరీ ఎక్కడ?  ఇది సాధ్యమా సార్‌?’’ అన్నాడు నిద్రలోంచి అప్పుడే లేచినట్లు చూస్తూ.

                        ‘‘తప్పకుండా సాధ్యమవుతుంది హేమేంద్రా! దీనికి కావలసింది డబ్బు మాత్రమే. అది నీ దగ్గర వుంది.’’ అన్నాడు ఈశ్వర్‌.

                        ‘‘అయినా వద్దు సర్‌! నేనిప్పుడు తృప్తిగా వున్నాను.  నాకంటూ సొంత ఇల్లు, కారు, మెడికల్‌ షాపులు వున్నాయి.  నేను నా చిన్నప్పుడు అనుభవించిన జీవితం నా కొడుక్కి లేకుండా చెయ్యాలంటే ఇప్పుడు నాకున్న     ఈ పోజిషన్‌ చాలు…  నా కొడుకు పక్క పిల్లాడి కంపాస్‌ బాక్స్‌ చూసి, వాడు తింటున్న తిండి చూసి, వాడు వాడుతున్న రకరకాల పెన్సిళ్లు చూసి, వేసుకుంటున్న డ్రస్సుల్ని చూసి అలాంటివి నాకూ వుంటే బాగుండని, చివరకి వాటిని లాక్కుని  వాడిని కొట్టే స్థితికి రాకుండా చూసుకోగలను.  ఇంతకన్నా నాకేం వద్దు….’’ అన్నాడు హేమేంద్ర. అతని మాటల్లో జీవితానుభవం వుంది. 

                        కాని రిప్రజెంటేటివ్‌లకి ఆ మాటలు రుచించలేదు.  అందుకే మౌనంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.

                        వాళ్లలో అసంతృప్తిని పసిగట్టి తలవంచుకున్నాడు హేమేంద్ర.

                        ఈశ్వర్‌ హేమేంద్రనే సూటిగా చూస్తూ ‘‘ ఇంతవరకే వున్నాయి నీ ఆలోచనలు…ఇది చాలా నేరం హేమేంద్రా! పెరిగే మొక్కను కత్తిరించినట్లు, కూడే ధనాన్ని, నీలోని టాలెంట్‌ని కుదించుకొని చూడొద్దు. ఇల్లు అందరికి వుంటుంది.  అది వుండగానే సరిపోదు. ఆ ఇంటి ముందు స్విమ్మింగ్‌పూల్‌ కట్టుకోటానికి ప్రయత్నించాలి… ఫ్యామిలీతో పారిన్‌ టూర్‌ వెళ్లాలనుకోవాలి…. ఇప్పుడు నీకున్న కారు ఏపాటిది? ఇంకా ఖరీదైన కారులో తిరగాలి…. మన వరంగల్‌ సిటీ బయట పదెకరాల స్థలంలో ఫాంహౌస్‌, సిటీికి మధ్యన ఖరీదైన ప్రాంతంలో గెస్ట్‌హౌస్‌ కట్టాలి…వీకెండ్స్‌ లో అప్పుడప్పుడు నువ్వక్కడకెళ్లి గడపాలి…’’ అన్నాడు.

                        హేమేంద్ర తలెత్తాడు. అతని ముఖంలో అతనికి తెలియకుండానే ఓ వుదృతమైన, అనూహ్యమైనఆశ జ్వాలలా వ్యాపించింది. ఏమనిషికైనామెట్లు ఎక్కేకొద్ది ఇంకా ఎక్కాలని,  పైనున్న మెట్లు చేరుకోవాలని వుంటుంది…. అవకాశాలను జారవిడుచుకోకుండా సాగిపోవాలనిపిస్తుంది.

                        హేమేంద్ర మొదటి నుండి చేసింది అదే… డబ్బు కోసం అతను ఏమైనా చేస్తాడు. డబ్బుంటే ఏదైనా చెయ్చొచ్చనుకుంటాడు.  డబ్బే ధ్యేయమనుకుంటాడు. డబ్బే జీవితం అనుకుంటాడు.

డబ్బుతో సాదించలేనిది లేదనుకుంటాడు. డబ్బుండబట్టే ఇవన్నీ చెయ్యగలుగుతున్నాననుకుంటాడు.  అదే లేకపోతే తనకు తన తండ్రికి తేడా లేదనుకుంటాడు.

                        కొందరు ఎండకు ఎండిపోతుంటే తను ఎ.సి.లో పడుకునేది ఆ డబ్బువల్లనే… ఎందరో నేలమిాద నడుస్తుంటే తను కారులో తిరిగేది కూడా ఆ డబ్బువల్లనే. చాలామంది రేపు తిండి దొరకుతుందా లేదా అని ఆలోచిస్తుంటే తను ఏదైనా తినగలిగే స్థితిలో వుండేది ఆ డబ్బు వల్లనే…ఎవరైనా తన దగ్గరకి వచ్చి, పోతున్న ప్రాణాన్ని కాపాడుమని అర్థించినప్పుడు మంచి డాక్టర్‌ దగ్గరకి తీసికెళ్లి శాయశక్తుల పోరాడి బ్రతికించేది వాళ్చిచ్చే డబ్బు కోసమే….ఆ డబ్బే లేకుంటే ఏముందిక్కడ?  తిండి కోసం ఫ్రెండ్స్‌ని అడగడం, తాటిచెట్లుఎక్కడం,  ఈసురోమంటూ వీధుల్లో తిరగటం తప్ప అనుకుంటూ తన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు.

                        వెంటనే భార్య మాటలు గుర్తొచ్చాయి. ‘‘ఎందుకండి బాబు ముందు అన్నన్ని ఖరీదైన బొమ్మలు తెచ్చిపడేస్తారు. వాటి విలువ వాడికి తెలుసా?  అసలంత డబ్బు వాటి  మిాద పెట్టటం అవసరమా? ఆ డబ్బు కోసం   ఉన్న టైమంతా బయట గడిపి వాడు నిద్రపోయాక ఇంటికి వస్తున్నారు. నిద్రలేవక ముందే వెళ్లిపోతున్నారు. వాడు మిమ్మల్ని చూసేదెప్పుడు? మిాతో ఆడేదెప్పుడు? మిా సంతోషాన్ని పంచుకునేదెప్పుడు? కనీసం మీరు తెచ్చిన బొమ్మలతో వాడు ఆడుతున్నప్పుడు వాడికళ్లు ఎలా వెలుగుతాయో ఒక్కసారైనా మిారు చూస్తున్నారా? మిా అక్కయ్యల గురించి, మిా తల్లిదండ్రుల గురించి ఒక్కసారైనా ఆలోచించరెందుకు? వాడికి మిా వాళ్లను చూపించరా? ఎప్పుడు చూసినా ఈ బొమ్మలతో ఆడుకోవటమేనా వాడిపని? మానవ స్పర్శ, మానవ సంబంధాలు వాడికి అక్కర్లేదా?’’ అంటుంది.

                        పూర్‌ సిరి…. తనకేం తెలుసు జీవితం విలువ? ఎప్పుడు చూసినా ‘‘ మిాకు ప్రేమించటం రాదా? అనుభూతించటం రాదా? ప్రేమించాలని, ప్రేమను పొందాలని వుండదా?  ఎందుకండీ ఇంత ప్రేమరాహిత్యం? ఇది మిాకు బాగుందేమో కాని నాకైతే బాగలేదు.’’ అని అనటం తప్ప. అని హేమేంద్ర మనసులో అనుకుంటూ ఒక్కసారి…తలవిదిలించి ఈశ్వర్‌ వైపు చూస్తూ ‘‘కానీ సర్‌ ! నాకు మందుల షాపుల అనుభవం తప్ప ఫ్యాక్టరీ కి సంబంధించిన అనుభవం లేదు.’’ అన్నాడు.

                        ‘‘నీకు అందులో అనుభవం ఏమిా అవసరం లేదు హేమేంద్రా! అదంతా నేను చూసుకుంటాను. అదెలా అంటే నువ్వు కేవలం ఒక పదిరకాల మందులతోలోన్‌ లైసెన్స్‌ ద్వారా నువ్వు అనుకున్న ఫర్మ్‌తో వేరే కంపెనీలో మందులను తయారు చేయించి వ్యాపారం నడపవచ్చు’’ అన్నాడు ఈశ్వర్‌.

                        ‘‘ఓ.కె. సర్‌! మిారేది చెప్పినా నా మంచి కోసమే చెప్తారు కానీ మిారు కూడా నాతో కలసి ఈ బిజినెస్‌లోకి వస్తే బావుంటుంది.’’ అన్నాడు హేమేంద్ర.  ‘‘నో…నో… హేమేంద్రా!  నా దగ్గర అంత డబ్బు లేదు.  కావాలంటే నీ మందుల్ని నేను సరైన రీతిలో మార్కెటింగ్‌ చేసే ఏర్పాటు  చేస్తాను.’’  అన్నాడు.

                        ఒప్పుకున్నాడు హేమేంద్ర.

                        ఈ కొత్త వ్యాపారంలో కూడా హేమేంద్ర విపరీతంగా సంపాయించడం మొదలుపెట్డాడు.

                        ‘హేమేంద్రా డ్రగ్స్‌’ పేరు మిాద నడుస్తున్న ఈ వ్యాపారం ఆశ్చర్యపరిచే లాభాలను ఆర్జించటానికి కారణం ఈశ్వర్‌ యొక్క మార్కెటింగ్‌ మెళకువలు…

                        …మళ్లీ ఈశ్వర్‌ ఒకరోజు హేమేంద్రను కూర్చోబెట్టి. ‘‘మన మందులకు మార్కెట్‌లో డిమాండ్‌ ఎక్కువగా వుంది హేమేంద్రా! ఇప్పుడు మనం ఒక కంపెనీ పెట్టుకోవచ్చు.’’ అన్నాడు.

                         అందుకు హేమేంద్ర ‘‘ ఇప్పటికే నేను రిటైల్‌ బిజినెస్‌, హోల్‌సేల్‌ బిజినెస్‌తో బిజీగా వున్నాను సర్‌!   ఇంక కంపెనీ అంటే నా వల్ల కాదు.’’ అన్నాడు.

                        ఈశ్వర్‌ వదల్లేదు.  తన మాటల టాలెంట్‌తో  కంపెనీ పెట్టేందుకు హేమేంద్రను ఒప్పించాడు… హేమేంద్రకు కూడా అంచలంచలుగా ఎదగాలన్న కోరిక లోలోన బలంగా దహించి వేస్తోంది. అందుకే  ఒప్పుకున్నాడు.

                        ….. కంపెనీ పెట్టాక హేమేంద్ర బాగా బిజీ అయ్యాడు.  కంపెనీకి సంబంధించిన ప్రొడక్షన్‌ అంతా ఈశ్వర్‌కి అప్పజెప్పాడు.  కంపెనీ. సి Ê ఎఫ్‌.ను మాత్రం హేమేంద్ర చూసుకోవటం మొదలు పెట్టాడు.

                ***                             ***                                ***                                      ***

                        స్నేహిత కొడుకు అరోహ్ కి మూడు సంవత్సరాలు నిండాయి.  వయసుకి మించిన ఎత్తుతో వయసుకి మించిన మాటలతో, ఆటలతో ఇంట్లోవాళ్లను అబ్బురపరస్తూ, ఆనందపడేలా చేస్తున్నాడు.

                        అరోహ్ ని చూస్తుంటే నీలవేణమ్మకి గర్వంగా వుంది.   చిన్నప్పుడు తన నలుగురు కొడుకుల్లో లేని హుషారు, ప్రస్తుతం తన ఎనిమిది మంది మనవళ్లు, మనవరాళ్ళలో లేని తెలివితేటలు  చిన్న మనువడైన అరోహ్లో కన్పిస్తున్నట్లు నలుగురికి చెప్పుకొని మురిసిపోతుంది.  అరోమీ  చేసే అల్లరి, నవ్వు తెప్పించే సన్నివేశాలు తనకెంత ముద్దనిపిస్తున్నాయో కన్పించిన ప్రతి ఒక్కరికి చెప్పి నవ్వుకుంటూ, ‘హమ్మయ్యా’ దేవుడు నాకెంత మంచి మనవడ్ని ఇచ్చాడో అని అనుకుంటూ స్నేహిత చేత తను చేయించిన వ్రతాలను,పూజలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటోంది.

                        ఇదిలా వుండగా స్నేహిత తోడికోడళ్లు అరోహ్ లోని మెచ్యూరిటీని చూసి అప్పుడప్పుడు తమ పిల్లల్ని విసుక్కుంటుంటారు…. రెండో తోడికోడలు రత్నమాల అయితే మరీ ఎక్కువ.అరోహ్ ని చూసిన ప్రతిసారి ఆమె తన పిల్లలతో పోల్చుకొని….

                        ‘‘మిా కన్నా చిన్నవాడు అరోహ్ చూడండిరా! ఎంత బుద్ధిగా చెప్పిన మాట వింటున్నాడో..వాళ్లమమ్మీ నిద్రపోతుంటే ఏ మాత్రం డిస్టర్బ్‌ చెయ్యకుండా తనపాటికి తను ఓ చోట కూర్చుని ఆడుకుంటాడు.  నానమ్మను విసిగించకుండ ఏదైనా అడిగి పెట్టించుకొని తింటాడు. కథలు చెప్పమని నానమ్మని అడిగి కథలు చెప్పించుకొని వింటాడు.   టీ.విలో వచ్చే యానిమేషన్‌ బొమ్మల కథలు చక్కగా కూర్చుని వింటాడు.మిారెందుకలా వుండరు?

                         మిాలో ఎప్పుడు చూసినా ఏడుపే.   ఎప్పుడు చూసినా గోలే, ఒక్క క్షణం కూడా కంటినిండా నిద్రపోనివ్వరు. మిాకు అన్నం తిపిపించాలన్నా, స్నానం చేయించాలన్నా, తలదువ్వాలన్నా, డ్రస్‌లువెయ్యాలన్నా, పెద్ద యజ్ఞంలా వుంటుంది నాకు…. ఏం పాపం చేశానో! అంతా నా ఖర్మ.   పిల్లలు పుట్టినా అదృష్టం వుండాలి.  అదేదో సామెత వుందిగా దానం కొద్ది పిల్లలని. పోయిన జన్మలో ఒక్క రూపాయన్నా దానం చేశానో లేదో! ఇలా అని తెలిస్తే అప్పుడే వున్నదంతా దానం చేసి చచ్చేదాన్ని…’’ అని తన పిల్లల మిాద చిరాకు పడ్తూ, ఒక్కోసారి వాళ్లు చస్తారో, లేదో తెలియనంతగా కొడుతుంది.

                        అలా రత్నమాల పిల్లల్ని కొడుతున్నప్పుడు స్నేహిత గనక చూస్తే…

                        ‘‘అయ్యో! ఎందుకు  అక్కయ్యా! వాళ్లను అలా కొడతావు?’’ అంటూ ఆమె చేతిలోంచి పిల్లల్ని దెబ్బలు తినకుండా తొలగిస్తుంది…

                        స్నేహిత లేనప్పుడు నీలవేణమ్మ చూస్తే ‘‘నువ్వలా కొట్టకమ్మాయ్‌ పిల్లల్ని.’’ అంటూ వడుపుగా వెళ్ళి రత్నమాలకి పిల్లలకి మధ్యలో నిలబడుతుంది. ఆమె కూడా కోడలి చేతిలో దెబ్బలు తింటుంది.  ఆ దెబ్బలు తనకి పొరపాటున తగులుతున్నాయి. అనుకుంటుందేకాని రత్నమాల కావాలనే పిల్లల్ని కొట్టబోయి ఆమెను కొడ్తున్నట్లు ఆమెకు తెలియదు.

                        పైగా ‘‘ఎన్ని దెబ్బలు, ఎన్ని దెబ్బలు… నేనే గనక సమయానికి లేకుంటే నేను తిన్న దెబ్బలన్నీ పిల్లలు తినేవాళ్లు. నేనుండబట్టే సరిపోయింది.’’ అంటూ జారిపోతున్న జుట్టు ముడిని సవరించుకొని, వూడిపోతున్న కొంగును సరిగ్గా నడుం దగ్గర, దోపుకుంటుంది.  యధాప్రకారం తన పనిలో తను మునిగిపోతుంది.

                        ఇంకో తోడికోడలు చూస్తే మాత్రం ‘‘ కొట్టుకోనియ్‌! నాకేం! తన పిల్లలు తన ఇష్టం. ఎంత కొట్టినా  ఆ పిల్లలేమైనా తిరిగి కొడతారా? పిల్లల్ని కొట్టడం పెద్ద హీరోయిజం అనుకుంటోంది…. ఆవిడలా కొడ్తుంటే చేతిలో పనులు పోగొట్టుకొని ప్రత్యర్థుల్ని కాపాడినట్లు వెళ్లి పిల్లల్ని విడిపించాలి.  ఇదోపెద్ద పని అవుతోంది రోజూ… అమ్మో! అమ్మో! పెళ్లయిన కొత్తలో ఈవిడగారే పెద్ద కలర్‌పుల్‌గా వున్నట్లు ఎంత పోజు కొట్టేది.   నన్ను కూడా చిన్న చూపు చూసేది. పిల్లలు తండ్రి రంగులో నల్లగా పుట్టారని చాటుగా కూర్చుని ఏడ్చి మొత్తుకుని చివరకి అడ్జస్టయిపోయింది. ఇప్పుడేమో పిల్లలు మాట వినట్లేదని కొట్టి చంపుతోంది….’’ అని మనసులో అనుకుంటూ ఇంచి కూడా కదలకుండా ఎక్కడ వున్న మనిషి అక్కడే నిలబడ్తుంది.

                        పిల్లల్ని చక్కదిద్దాలి అంటే తల్లి ఆ మాత్రం కొట్టాలి, తిట్టాలి అని ఇంట్లో ఎవరికి వాళ్లు అనుకుంటున్నారే కాని రత్నమాలకి అరోహ్ అంటే అసూయగా వుందని తెలుసుకోలేక పోతున్నారు.

                        చివరకి స్నేహితకి కూడా తెలియదు.  నువ్వు దేన్ని ప్రాణంగా అనుకుంటున్నావని స్నేహితను ఎవరైనా అడిగితే ‘అరోహ్ నా ప్రాణం’ అంటుంది. ‘అరోహ్ నా సర్వస్వం అంటుంది.’ కడుపులో వున్నప్పుడు కూడా అంతే!

అరోహ్ కదలికల్ని తన్మయత్వంతో  గమనించుకునేది. తనివితీరా పులకించేది.  అణువణువునా ఆనందాన్ని నింపుకునేది… ఇప్పుడు ఆ ఇంట్లో సూర్యోదయాన్ని ఒక్క స్నేహిత తప్ప ఎవరూ చూడలేరు. కారణం అరోహ్ ఐదున్నరకే నిద్రలేచి, తల్లిని లేపి పాలుకలిపించుకొని తాగుతాడు. అప్పటి నుండి ఆ ఇంట్లో ఆ ఇద్దరు పూలచెట్ల దగ్గర తిరుగుతూనో, మెట్లు ఎక్కుతూనో, పేపరబ్బాయి విసిరేసిన పేపరు అందుకుంటూనో, పాలు తీసుకుంటునో సందడి, సందడిగా తిరుగుతుంటారు…

అరోహ్కి ఆ ఇల్లే ఓ ప్లేగ్రౌండ్‌. తాతయ్య బామ్మలు లిటిల్‌ టాయ్స్‌!

                        ఒకసారి గుండెపోటు వచ్చి, డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటూ గత పదిరోజులుగా బెడ్‌మిాద వుంది నీలవేణమ్మ అత్తగారు  లక్ష్మీ దేవమ్మ…. ఆమె దగ్గరకి అప్పుడప్పుడుఅరోహ్ వెళ్లి, వచ్చీరాని మాటలు చెబుతూ ఆమె చేెతిమిాద తట్టి పరామర్శిస్తున్న వాడిలా చూస్తుంటాడు.  అరోహ్ అంటే ఆమెకు కూడా పంచప్రాణాలు, తనని  చూసివెళ్లటానికి ఎవరొచ్చినా ‘‘ఇప్పుడే అరోహ్వచ్చి, నన్ను పలకరించి, ఈ టాబ్‌లెట్‌ తీసి నా చేతిలో పెట్టి వేసుకొమని చెప్పి వెళ్లాడర్రా! వేలెడంతలేడు, వాడి తెలివితేటలు చూడండి.’’ అంటూ  గొప్పగా చెప్పుకుంటుంది.  ఆ మాటలు వింటున్న  మిగతా కోడళ్లు తమ పిల్లలు అలా చెయ్యట్లేదని, అందరి దృష్టిలో తెలివైన పిల్లలుగా నిరూపించుకోవటం  లేదని, ఎదురుగా వున్నఅరోహ్ను ముద్దుగా దగ్గరకు తీసుకోవటం మానేసి, ముక్కున వేలేసుకొని చూస్తుంటారు.

                        వియ్యపురాలిని చూసి వెళ్లాలని వరంగల్‌ నుండి గోమతమ్మ వచ్చినట్లు తెలిసి ఓల్డేజ్‌హోంలో వున్న కాత్యాయని, రామేశ్వరి వచ్చారు. తాము తెచ్చిన పండ్లను బెడ్‌పక్కన పెట్టి లక్ష్మిదేవమ్మ దగ్గర కూర్చున్నారు.  లక్ష్మిదేవమ్మ వాళ్లను చూడగానే ఆనందం పట్టలేక నెమ్మదిగా కబుర్లు చెబుతోంది. ఆమె చెప్పే కబుర్లు తన కోడళ్లు,     అల్లుళ్లు, మనవలు, మనువరాళ్లు గురించే కాక తనని చూడటానికి వచ్చిన బంధువుల గురించి కూడా సాగి ఎక్కువగా అరోమీ  దగ్గరకి వచ్చి ఆగుతున్నాయి. అరోప్‌ా గురించి చెప్పేటప్పుడు  అదేదో పెద్ద అద్భుతం, అబ్బురం చెబుతున్నట్లు ఆమె కంఠంలోంచి ఆనందం ఒలుకుతోంది.. అప్పుడు రామేశ్వరి చూపులు దూరంగా పిల్లలతో ఆడుతున్నఅరోహ్పై నిలిచాయి.

                        అంతలో వేరే బంధువులెవరో లక్ష్మి దేవమ్మను పరామర్శించటానికి రావటంతో కాత్యాయని, రామేశ్వరి లేచి పక్కనున్న సిట్‌ అవుట్‌ దగ్గరకి వెళ్లి అక్కడున్న కుర్చీల్లో కూర్చున్నారు.

                        లోగడ తామొచ్చినప్పుడు లక్ష్మి దేవమ్మ ఎంత బాగా చూసుకునేదో గుర్తు చేసుకుంటోంది కాత్యాయని….

                        ‘‘చూశావా కాత్యాయనీ! నా మాట ఎప్పుడూ తప్పిపోదు. ఆ రోజు హాస్పిటల్లో పిల్లాడు మారివుంటాడని చెప్పాను గుర్తుందా? ఇప్పుడది అక్షరాల నిజం… కానీ స్నేహిత ‘‘వీడు నాబిడ్డే బామ్మా!’’ అని ఆ రోజు అన్నది కాబట్టి మనం దీన్ని ఇంకో రకంగా ఆలోచించాల్సి వస్తుంది…’’ అంది.

                        కాత్యాయని అర్థం కాక ముందుకి వంగి  ‘‘ఏంటా రకం?’’ అంది

                        రామేశ్వరి కాత్యాయనిలోని ఆసక్తిని గమనించి, ఇంకాస్త దగ్గరకి జరిగి రహస్యాన్ని చెబుతున్నట్లు ‘‘ ఆ రోజుల్లో గోమతి స్నేహితను ఎంత కట్టడిలో పెట్టి పెంచిందో మనకి తెలుసు. అంత నిఘా అవసరమా అనికూడామనం అనుకునేవాళ్లం… రోజులు బాగలేవు.  ఆడపిల్లని భయంగా పెంచుకోవాలి అని అనేది గోమతి ఇప్పుడా భయం ఏమైంది?’’ అంది.

                        ‘‘అంటే?’ అంది కాత్యాయని.

                        ‘‘ అంటే ఏముంది? పిల్లల్లేరని లోకులు కర్రపుచ్చుకొని పిచ్చోడి వెంట పడ్డట్టు తన వెంటపడ్తుంటే   భరించలేక ఎవడితోనో శారీరక సంబంధం పెట్టుకొని

అరోహ్

ని కన్నది స్నేహిత.  ఎంత పిల్లలు లేకపోతే మాత్రం ఇలా చెయ్యొచ్చా?  ఇంట్లో వాళ్లను, భర్తను మోసం చేసి టెస్ట్‌ట్యూబ్‌ బేబీని కంటున్నట్లు నాటకం ఆడిరది.  ఇది తప్పుకాదా? అక్కడ ఆడుతున్న పిల్లలంతా ఈ ఇంటి పిల్లలే.  ఇంచుమించు అందరు ఒకేలా వున్నారు.  ఒక్క

అరోహ్

 తప్ప…’’ అంది రామేశ్వరి.

                        కాత్యాయని అశుద్దాన్ని చూసినట్లు రామేశ్వరి వైపు చూసి..

                        ‘‘నువ్వు మారవు రామేశ్వరి! ఎన్ని గుళ్లు తిప్పినా, ఎన్ని ఆధ్యాత్మిక మందిరాలకు  తిప్పినా నీ తత్వం ఇక ఇంతే! బాణాల్లా వదిలేస్తావు మాటల్ని. వదిలిన బాణం వెనక్కి వస్తుందా? కత్తితో పెట్టిన గాటు వల్ల మచ్చ పడితే దానివల్ల ఇబ్బంది వుండదు. మనసునుకోస్తున్నట్లు మాట్లాడతావు చూడు. ఆ గాయానికి మందుండదు.  పాపాలు ఎక్కుడో లేవు.  ఇదిగో ఇలాంటి మాటల వల్లనే చుట్టుకుంటాయి.  స్నేహిత వింటే తప్పకుండా నిన్ను తిడుతుంది. ఆ తిట్లకున్న శక్తి నిన్ను నరకానికి తీసికెళ్లి చిత్రహింసలు పెడుతుంది.  వృధాగాపోదు. ఒకవేళ జరిగితే ఆ టెస్ట్‌ట్యూబ్‌ బేబీ దగ్గరే గోల్‌మాల్‌ జరిగి వుండాలి.  అంతేకాని స్నేహిత ఎలాంటిదో మనకి తెలియదా? ఎలా మాట్లాడగలుగుతున్నావ్‌ ఆ నోటితో ఇలాంటి మాటలు?’’ అంది కాత్యాయని.

                        టక్కున నోరు మూసుకుంది రామేశ్వరి. కడుపు ఉబ్బినప్పుడు ఊపిరి బిగబట్టలేక ఏదో అంటుంది కాని తర్వాత కాత్యాయనికి భయపడ్తుంది. కాత్యాయని లేకుంటే తనకి జీవితమే లేదన్న విశ్వాసం వుంది రామేశ్వరికి…

                        కానీ అటువైపు వస్తున్న గోమతమ్మ, నీలవేణమ్మ రామేశ్వరి మాటలు విని నిశ్చేష్టులయ్యారు.  రత్నమాల కూడా ఆ మాటలు విన్నది.

                        తల్లి చెయ్యి గట్టిగా వడిసిపట్టుకొని ‘‘ నువ్విలారా? నీ పని చెబుతా!’’ అన్నట్లు బరబరా లాక్కెళ్లింది నీలవేణమ్మ.

                        గోమతమ్మకి భయంతో బి.పి. పెరిగి వణుకుతోంది. తల్లి చెయ్యి వదలి ‘‘నువ్వెందుకే వణుకుతున్నావ్‌? తప్పు చేసింది  అదికదా! నువ్వు నా కుటుంబానికి చేసిన ద్రోహం చరిత్రలో ఏ తల్లీ చేసివుండదు.  ఇప్పుడు సంతోషంగా వుందా నీకు? నీ చెవులతో నువ్వే విన్నావుగా! ఏదో ఇలా అన్నదని రామేశ్వరి పిన్నిని ఏమిా అనకు… మా చట్టు పక్కల వాళ్లు కూడా ఇదే అభిప్రాయాన్ని మింగలేక కక్కలేక సతమతమవుతున్నారు… నాకంతా తెలుసు. నేను పిచ్చిదాన్ని కాదు. నీ మనవరాలు తప్పు చేసి నన్ను పిచ్చి దాన్ని చెయ్యాలని చూసింది.’’ అంది నీలవేణమ్మ.

                        గోమతమ్మ కూతురి వైపు కోపంగా చూస్తూ…‘‘నీలాంటి ఆడది అమ్మగానే కాదు అత్తగాకూడా తగదు. పిల్లలు పుట్టకముందు దానికి గర్భసంచి లేదన్నావ్‌? ఇప్పుడేమో క్యారక్టర్‌ లేదంటున్నావ్‌! నేను ద్రోహం చేసింది నీకు కాదు. నీ ఇంటికి కోడల్ని చేసి దానికి చేశాను.  ఇన్నాళ్ల కాపురంలో అది తప్పు చెయ్యగా ఎప్పుడైనా చూశావా? అలాంటి అనుమానం నీకెప్పుడైనా వచ్చిందా?’’ అంది.

                        నీలవేణి ఒక్కక్షణం తలవంచుకొని, నిజమే అలాంటి అనుమానం తనకెప్పుడూ రాలేదు.  అనుకుంటూ వెంటనే తలెత్తి. ‘‘ కానీ ఆడది తప్పు చెయ్యాలనుకుంటే ఇంటి గడపకి కూడా తెలియకుండా చెయ్యగలదు. తప్పు చేసేముందు నా ముందుకొచ్చేమైనా చేస్తుందా నన్ను చూడమని… అలాంటప్పుడు నాకెలావస్తుంది అనుమానం?’’ అంటూ కోర్టులో ముద్దాయిని నిలదీస్తున్న లాయర్‌లా తల్లి వైపు చూస్తోంది నీలవేణమ్మ,

                        కూతుర్ని సమర్థించలేక మనవరాల్ని తప్పుపట్టలేక గిలగిల కొట్టుకొంటోంది గోమతమ్మ మనసు…. కూతురి కళ్లు తననే చూస్తూ నిప్పులు కురుస్తుంటే ఇక తట్టుకోలేక… ‘‘స్నేహిత తప్పు చేసిందో లేదో ఎవరికీి తెలియదు.  దేవతలు కూడా పిల్లల కోసం తప్పు చేసినట్లు మన పురాణాల్లో వుంది…. దీన్ని ఇక పెద్దది చేసి చూడకు నీలవేణి!’’ అంది గోమతమ్మ.

                        ‘‘ఎవరా దేవతలు?’’ నిలదీసింది నీలవేణమ్మ.

                        ‘‘ఎవరంటే! అంబిక, అంబాలిక….’’ అంది గోమతమ్మ.

                        వాళ్ల మాటలు కిటికీలోంచి విన్పిస్తుంటే ‘‘ ఏంటర్రా మిావాదన? లోపలకి రండి! మిా ఇద్దరు….’’ అంటూ పిలించింది లక్ష్మిదేవమ్మ.

                        ఆమె పిలవగానే కంగారుగా కూతురివైపు చూస్తూ ‘‘ఈ విషయాన్ని ఆవిడ చెవిన వెయ్యకు నీలవేణి నువ్వు ఏ మాత్రం ఆవేశపడినా పచ్చిక బయలుపై పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టినట్లు స్నేహిత బ్రతుకు కాలిపోతుంది. విచక్షణ పాటించు….’’ అంది.

                        తల్లివైపు ఉరిమి చూస్తూ, తల్లి చెయ్యి పట్టుకొని లోపలకి తీసికెళ్లింది నీలవేణమ్మ, వాళ్లు లోపలకి రాగానే అక్కడ కూర్చుని వున్నవాళ్లు బయటకెళ్లారు.

                        ఏమిటన్నట్లు వాళ్లిద్దరి వైపు చూసింది లక్ష్మిదేవమ్మ.

                        ‘‘ఏం లేదు అత్తయ్యా! పురాణాల్లో అంబిక, అంబాలిక పిల్లల కోసం తప్పు చేశారట…. మా అమ్మ చెబుతోంది.’’ అంది అక్కసుగా తల్లివైపు చూస్తూ.  ఆమెకు చెడ్డకోపంగా వుంది తల్లిపైన.  గోమతమ్మకు ఏం చేయాలో పాలుపోవటం లేదు.

                        ‘‘మిా వాదన చర్చలోకి మారకముందు మిా సందేహాన్ని నేను తీరుస్తాను.   ఇదిగో ఇలా నాకు దగ్గరగా వచ్చి కూర్చోండర్రా!’’ అంది లక్ష్మీదేవమ్మ.

                        డాక్టర్‌ మాట్లాడవద్దని ఎంత చెప్పినా ఆమెకు రోజంతా మాట్లాడుతూనే గడుపాలని వుంటుంది. అస్వస్థత వల్ల ఆమె స్వరం చిన్నగా విన్పిస్తుంటే వాళ్లిద్దరు వెళ్లి ఆమెకు చెరొకవైపున కూర్చున్నారు.

( ఇంకా ఉంది )

– అంగులూరి అంజనీ దేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

115

ధారావాహికలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో