సింహమైనా సరే.” అరచేతిని కత్తిలా చేసి తన ధైర్యం సాహసాలు చూపిస్తున్నాడు మురళి.
కొంతదూరం పోయాక, కారు కడ్డంగా పరుగెట్టిన ముంగీసను, కొండముచ్చును చూసి పులిని చూచినంత సంబరపడ్డారంతా.
అడవి మనుష్యులు కొందరు ఆ దారంబడే నడిచిపోతున్నారు. చీకట్లో కనీసం కాగడా అరునా లేకుండా నడచిపోతున్నారు.
”వీళ్ళకు త్రోవెలా తెలుస్తుంది బాబాయ్! ఈ చీకట్లో ఎలా నడవగలరసలు?”
”వాళ్ళకది అలవాటరుపోయుంటుందమ్మా.”
బాబాయ్ మాటలకు తృప్తి పడలేకపోరుంది కృష్ణ. ఆ అడవి మనుషుల పట్ల జాలితో ఆమె హృదయం ఆర్ద్రమరుంది. జానెడు కడుపు కొఱకు ఎన్ని తిప్పలు!” కృష్ణ తన ఆలోచనల్లో తను వుండగానే ప్రసాదరావు చెప్పాడు.
”మనం కొండ ఎక్కడం పూర్తరుంది. కొండపైకి వచ్చేసాం.”
”అప్పుడే వచ్చేసామా?” అని కృష్ణ నిరుత్సాహంగా అంటే
”హమ్మయ్య” అని గుండెలమీద చెర్యువేసుకుంది అరుణ.
అప్పుడే ఎక్కడ? ఈ శిఖరాగ్రాన ఇంకా పదకొండుమైళ్ళు ప్రయాణం చేస్తేగాని చింతపల్లి రాదు. భూమి మిద వెళ్ళినట్టె కొండమిద సాఫీగా కారువెళ్తుంటె చాలా థ్రిల్లింగ్‌గా అన్పించింది కృష్ణకు. చీకటిని చీల్చుకుని లోయలోకి చూద్దామని తాపత్రయ పడ్తోందామె. ఇంతవరకు ప్రగల్భాలు పలికిన మురళి భానుమూర్తి ఒడిలో నిద్రపోయాడు. నిర్మల, చైతన్య అరుణ తూగుతున్నారు. భానుమూర్తి కృష్ణ తమకు ఎదురువచ్చే దృశ్యాల్ని తాము ఎదుర్కోబోయే అందాల్ని చూస్తూ తన్మయత్వంలో మునిగిపోయారు.
చంద్రుడు పైపైకి ఎగబ్రాకుతున్నాడు. చీకటి చెల్లా చెదరైపోతోంది. మంచుతో తడిసిన చెట్లు మనోహరంగా మెరుస్తున్నారు. రోడ్డు ప్రక్కగా వెదురు పొదలు ఫౌంటెన్‌లా విచ్చుకుని ఆకాశాన్ని చుంబిస్తున్నారు. వెన్నెలలో క్రొత్త అందాల్ని సంతరించుకుంటున్న వెదురు పొదల్ని చూస్తుంటే, కృష్ణకు చటుక్కున యశోదానందుడు, చిలిపి కృష్ణుడు గుర్తుకొచ్చాడు.
మృదుల మనోహర చక్రవర్తి గోపికా మనోరంజకుడు రసికాగ్రేసరుడు అరున మురళీ మోహనుడు గుర్తుకు రాగానే కళ్ళు విప్పార్చుకుని పొదలలో తన ఊహాజనితమైన మూర్తి కొఱకు వెతికింది.
”వెదురుపొదలలో, చీకటి కాదది శ్యామలదేహము…” ఆ భావగీతమంటె మహా ఇష్టం కృష్ణకు. దాని మొదలు తుది ఆమెకు గుర్తులేదు. అరుణను తట్టిలేపి, ఆ పాట పాడించుకోవాలనీ తన ఆనందానుభూతిని పంచుకోవడానికి, తనతోపాటు అందమైన ప్రకృతిని ఆరాధించడానికి మరో వ్యక్తి కావాలనీ గాఢమైన కోరిక కలిగింది.
”భానూ ! ఈ వెదురు పొదలు చూడు. ఎంత బాగున్నాయో!” తన స్నేహితుడి చేతి మిద తన చెర్యు వేస్తూ అంది. ఇంతవరకు మౌనంగా వాటినే చూస్తున్న భానుమూర్తి తన స్నేహితురాలితో పూర్తిగా ఏకీభవించాడు.
”చూస్తున్నాను కృష్ణా. చాలా అందంగా వున్నారు.”
ఆ నిశ్శబ్ధ నిశీధిలో అరుదుగా దొరికే ఈ ప్రకృతి తాలూకు అందాల్ని, నిద్రాదేవి కిలాడితనానికి లొంగిపోరు, పోగొట్టుకుంటున్న చైతన్యను కూడా లేపి నిద్రపోతున్న వాతావారణాన్ని చైతన్యవంతం చేయాలనిపించింది కృష్ణకు. కానీ ఒకరకమైన జంకు. ఎప్పుడూ భానుమూర్తి దగ్గర అనుభవం కాని బెదురువల్ల ఆమె ఆ పని నుండి విరమించుకుంది. కానీ కృష్ణలో చెలరేగే భావాల్ని ఇట్టే గ్రహించినట్టు ఎవరో తట్టిలేపినట్టు ఉలిక్కిపడి లేచిన చైతన్య, కారు అద్దంలో నుండి ముందుకు చూచి ”అబ్బ ! ఇంత వెన్నెలెప్పుడొచ్చిందీ!” అన్నాడు సంబరంగా.
”మికు నిద్రే పరమావధిలా వుంది” ఎందుకనో ఆ మాటలు అనాలనుకున్నంత ఫ్రీగా అనలేకపోరుంది కృష్ణ. ఆమె మాటలతో వెనక్కు తిరిగి-
”ఛీ,ఛీ నిద్ర వచ్చేసింది. అరునా మిరు లేపకూడదేమిటి? మిరొక్కరే ఈ ప్రకృతినంతా ఆస్వాదించి పారేయాలా?” తన నిర్లక్ష్యానికి నొచ్చుకుంటూ అపరాధమంతా కృష్ణ నెత్తిన రుద్దేసాడు. రహస్యంగా, చిలిపిగా తన కొఱకు మాత్రమే నిర్దేశించబడినట్లున్న అతని కళ్ళల్లోకి నిర్భీతిగా చూడలేక తల త్రిప్పేసుకుంది కృష్ణ. ఆమె హృదయంలో ఇంతవరకు అనుభవంగాని, అలజడిలాటిదేదో బయలుదేరి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
పదిహేడు కిలోమిటర్ల దూరం ప్రయాణం చేసి, చింతపల్లి ట్రావెలర్స్ బంగళా చేరుకుంది కారు. అక్కడ తమకై ఎదురు చూస్తున్న డివిజనల్ ఇంజనీరు రామమూర్తి ఘన సన్మానం చెయ్యకపోరునా, పరారు చోట మామూలు పల్లెలా అరుదుగా దొరికే సౌకర్యాలన్నీ కల్పించాడు.
అడవి మధ్యగా, నాలుగు గదులతో వున్న చిన్న బంగళా అది. చుట్టూ పొదలు,తుప్పలు అడవిచెట్లు. వాటిలో నిర్భయంగా తిరిగే పాములు, అడవి జంతువులు, వీటి మధ్యగా ఒక సుదీర్ఘమైన రాత్రి అంతా గడపాలంటె చాల భయంగా అన్పించింది అరుణకు. తలుపులు తీస్తున్న కృష్ణను వారిస్తు అంది.
”తలుపులు తీయకండి ప్లీజ్. భయమేస్తోంది.”
”ఎంత వెన్నెలో చూడు అరుణా! బయట” పుచ్చపువ్వులాటి వెన్నెలలో, మంచుతో కప్పబడి మసక మసగ్గా వున్న ప్రకృతిని చూస్తూ అంది కృష్ణ. అరుణ మాట్లాడలేదు. కృష్ణ నిశ్శబ్ధంగా కిటికీ తలుపులన్నీ వేసి వచ్చి కూర్చుంటూ అంది.
”పోనీ ఒక్క పాటపాడు అరుణా!” ప్రక్క రూమ్‌లోకి వెళ్ళబోతున్న చైతన్య భానుమూర్తి, రామారావు, ప్రసాదరావు ఆగిపోయారు. అరుణకు చెప్పలేనంతవిసుగ్గా వుంది.
”నేనిప్పుడు పాడలేను” బ్లంట్‌గా చెప్పింది అరుణ. చైతన్య బలవంతం చెయ్యబోయాడు గాని భానుమూర్తి వారించడంతో ఆగిపోయాడు. అంత నిశ్శబ్ధంగా వున్న వాతావారణాన్ని భరించలేక ఆ మౌనాన్ని బద్దలుకొడ్తూ అంది కృష్ణ-
”పోనీ చైతన్య గారు పాడ్తారు” ఈ ప్రయాణాన్ని చాల అందమైన స్మృతిగా నిల్పుకోవాలని కృష్ణ ఆరాటం.
”పోనీ, ఆట’ చూడండి. నేనంటె అలుసుగా వుంది కృష్ణగార్కి. నాకు పాడాలనిపించాలే గాని బ్రహ్మాండంగా పాడేస్తాను.” ఉడుక్కుంటున్నట్టు నటిస్తున్న చైతన్యను చిరునవ్వుతో చూస్తూ అంది నిర్మల-
”కానీ వచ్చిన చిక్కల్లా మికు ఎప్పుడూ పాడాలనిపించదు అంతే కదూ!”
అంతా చిరునవ్వుతో వింటున్న డాక్టర్ యదునందన్ గారు,
”మిరు తొందరగా పడుకుంటె, ప్రొద్దున్నే లేచి చింతపల్లి పరిశ్రమలు కొన్ని చూడొచ్చు ” అన్నారు. అప్పుడే మొదటి మారుగా పరీక్షగా చూచింది కృష్ణ ఆయనవైపు. ముప్ఫై అరుదు సంవత్సరాలుండొచ్చు. కానీ కాయపారుగా వుండడం వల్ల, ఇంకా చిన్నగా అన్పిస్తున్నారు. కొనదేరిన ముక్కు తీక్షణమైన కళ్ళు, పట్టుదలను సూచించే పెదాలు, ముఖంలో కొట్టవచ్చినట్టుండే సమర్థత, ఎవరికైనా సరే ఆయనను చూడగానే మర్యాదివ్వాలనిపిస్తుంది. ఆయన బాధ్యతగా తీసుకుని చెప్పేవన్నీ శ్రద్ధగా వినాలనిపిస్తుంది.
ప్రక్కగదిలోకి వెళ్ళబోతూ, ఆగి తన చిన్న స్నేహితుణ్ణి ఎత్తుకుని ఎగరేసి దింపి ”ఏరా నాన్నా నువ్వు ఆడవాళ్ళతో వుంటావా? మగవాళ్ళతో వస్తావా?’ అన్నాడు తమాషాగా భానుమూర్తి.
వాడు వెంటనే జవాబిచ్చాడు.
”మితోనే వస్తాను మామయ్యా. నేను మగవాణ్ణి కదా మరి !”
పూర్తిగా తెల్లవారక ముందే మురళి లేచి ‘అమ్మా !’ అంటూ రాగాలుమొదలు పెట్టడంతో ఉలిక్కిపడి లేచి వాడిని ఎత్తుకుని బయట కొచ్చాడు భానుమూర్తి. వాడిని వాళ్ళమ్మ కప్పగించి మరలా సుఖనిద్రలో మునిగి పోవాలనే ఉద్దేశంతో అలా బయటకొచ్చిన భానుమూర్తి చిత్రమైన సంఘటనను చూస్తున్నట్టు అక్కడే ఆగిపోయాడు.
వాళ్ళగదికి ఆడవాళ్ళ గదికీ మధ్యగా వున్న చిన్న వరండాలో వున్న విశాలమైన కిటికీలో కూర్చుని కమ్ములకు రెండు చేతుల మధ్యగా తల ఆన్చి, బయట ప్రపంచంలోకి తదేకంగా చూస్తోంది కృష్ణ.
ఎప్పుడూ ఏడుకాందే లేచే అలవాటు లేని కృష్ణ, ఇంత పొద్దున్నే లేవడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ‘అంతగా తన స్నేహితురాల్ని ఆకర్షించిన విషయమేమయ్యుంటుందా?’ అని బయటకు చూపులు విసిరిన భాను తన్మయుడై నిలబడిపోయాడు.
పూర్తిగా వెన్నెల కరిగి పోలేదింకా. బాలభానుడు తన వెలుగు కిరణాల్ని పైకి పంపే ప్రయత్నంలో వున్నాడు. రెండు విలక్షణమైన వెలుగుల వింత కలరుకలో, ప్రకృతి విన్నూతనమూ మనోహరమూ అరున కాంతిని పుంజుకుంటోంది. ఆ కనుచీకట్లో అడవి మనుష్యులు తమ దైనందిక కార్యాలు మొదలెడ్తున్నారు.
ఒక్కక్షణం తర్వాత అతని చూపులు స్నేహితురాలివైపు తిరిగారు. ఆమె కళ్ళు వింతతేజస్సుతో మెరిసిపోతున్నారు. ఆమె పెదవులు పరవశంతో విచ్చుకుంటున్నారు. అలా ఆమెనే తదేకంగా చూస్తున్న అతనికి తన స్నేహితురాలు ఈ రోజు ఈ పరారు ప్రదేశంలో చాలా క్రొత్తగా కన్పిస్తోంది.
”పట్నంలో పెరిగిపోతున్న నాగరికతతో సరి సమానంగా ఎదిగిపోతూ పరిసరాలకు తనను తానే మలచుకుంటూ పోయే ఈ స్నేహితురాలేనా? ఈ రోజు ఈ ఝాములో- ఒంటరిగా కూర్చుని పచ్చని చెట్లనూ, ఆ అనాగరిక ప్రజలనూ పరిశీలనగా పరవశంగా చూస్తున్నది! జీవితాన్ని నిర్లక్ష్యంగా తీసుకునే ఈ కృష్ణేనా అడవి మనుష్యుల జీవితాల్ని సానుభూతిగా అర్థం చేసుకుంటున్నది!”
*** *** *** ***
”అరుతే ఈ రోజు మనం వెళ్ళినట్లే” అందరూ తయారరు అరగంటగా ఎదురు చూసాక, తన టాయలెట్ పూర్తి చేసుకుని ఇవతల కొచ్చిన అరుణ ముఖం చైతన్య వ్యంగ్యబాణానికి నల్లగా అరుపోరుంది.
గులాబి రంగు మెటల్‌షిఫాన్ చీర కట్టుకుని, అదే రంగు ‘టుబైటు’ జాకెట్టు వేసుకుంది. కుడి చేతికి ‘పింక్’ గాజులు వేసుకుంది. ఎడమ చేతికి నల్ల స్ట్రాప్‌తో రిస్ట్‌వాచ్ పెట్టుకుంది. మెడలో పింక్‌మణులు, ఆరురోస్ ట్విస్ట్ చేసి మెడచుట్టూ అలంకరించుకుంది. పొట్టి జుట్టును ముంగురులు చెంపల మిద అందంగా ఎగిరేలా దువ్వుకుని ఒక్క జడ కుదురుగా అల్లుకుంది. గులాబిరంగు గులాబి నొకదాన్ని ‘టి.బి.’ ముంగిట వున్న గులాబి మొక్కనుండి తుంచుకొచ్చుకొని ఆ జడ మొదలులో ఓ ప్రక్కగా పిన్ను వేసి పెట్టుకుంది. తన పెద్ద పెద్ద కళ్ళకు నిండుగా కాటుక పెట్టుకుని ఐ షేడ్ వేసుకుంది.
ఎంతో సామాన్యంగా వున్నా, ఆర్టిస్టిక్‌గా అందంగా అలంకరించుకున్న అరుణను తదేకంగా చూస్తున్న కృష్ణకాంతి ఆమె ముఖం ఒక్కక్షణంలో ముడుచుకు పోవడంతో గబగబ అరుణ దగ్గరగా వచ్చి ఆమెను పట్టుకుంటూ అంది.
”మా ఇష్టం. మేమెంతసేపరునా అలంకరించుకుంటాం. అలంకరణ మా జన్మహక్కు. మిరూ మాలా తయారవండి చూద్దాం. చస్తే మా ఆర్టిస్టిక్.. మైండ్ మికు రమ్మన్నా రాదు.” అలా అనేసి అరుణను గబగబ లాక్కుంటూ బయటకొచ్చేసింది. సిగ్గుతో కుంచించుకపోరున అరుణకు ఆ క్షణంలో కృష్ణ ఎంతో ఆత్మీయురాలుగా అన్పించింది. చిరుకోపంగా అన్న కృష్ణ మాటలకు చైతన్య చిన్నబుచ్చుకోలేదు. అరుణ ప్రక్కనే తన సౌందర్యాన్ని అట్టె పట్టించుకోకుండా, చలాకీగా నడచిపోతున్న కృష్ణను రెప్పవెయ్యకుండా చూస్తున్నాడు. కోరా రంగుకు సన్న పచ్చ రిబ్బన్ బార్డర్ సౌత్ కాటన్ చీర మిద, కోరా రంగు జాకెట్టు వేసుకుని పొడవాటి జడతో వెళ్తున్న నల్లటి కృష్ణ అతని హృదయంలో చోటుచేసుకుని ఆగిపోయిందక్కడే.
కొండమిద పాములా మెలితిరిగిన రోడ్డు మిదుగా రామారావుగారి వెనగ్గా ఒక్కొక్కరే నూతనోత్సాహంతో నాగరికతకు దూరంగా నడిచిపోతున్నారు. చుట్టూ పొదల్ని, పుట్టల్ని ఆకాశాన్నంటే చెట్లనీ చూస్తూ వెనకబడిపోరుంది కృష్ణ. తెలివిగా అందరిలో నుండి తప్పించుకుని ఆమె ప్రక్కగా నడుస్తున్నాడు చైతన్య.
”అబ్బ! ఆ పూలెంత అందంగా వున్నాయో! తలపైకెత్తి ఆకాశాన్ని చుంబిస్తున్న చెట్ల నిండా విరగబూసిన ఎఱ్ఱగుత్తుల పూవులను చూచి, తనను తను అదుపులో పెట్టుకోలేనట్టు చేతులు రెండూ, గుండెల కదముకుంటూ, మెరిసే కళ్ళతో అంది కృష్ణ.
”వాటినే మంటారో తెలుసా? అంతవరకు తన ప్రక్కన నడుస్తున్న చైతన్యను గుర్తించలేదామె. ఉలిక్కిపడి ‘ఏమంటార’న్నట్లు చూచింది.
”ఫ్లేమ్ ఆఫ్‌ది ఫారెస్ట్’ అంటారు.”
”’క్వీన్ ఆఫ్‌ది ఫారెస్ట్’ అనొచ్చు” తన్మయత్వంతో గొణిగింది. దారి పొడుగునా ఆమెకు అలాటి చెట్లు చాలా కన్పించారు. కన్పించినప్పుడల్లా తన పరవశాన్ని అదుపులో పెట్టుకోలేక పోయేది. చిన్న పిల్లలా గెంతుతున్న ఆమెను ఆసక్తిగా చూస్తూ నడుస్తున్న చైతన్య వున్నట్టుండి అడిగాడు.
”కోసివ్వనా?”
”ఊహు” తల అడ్డంగా తిప్పింది కృష్ణ. ఆ పూలను విడిచి వెళ్ళాలని లేదు ఆమెకు. అలా అని ఆ పూలను కోసి నలిపేయాలని లేదు. నాలుగు అడుగులేశాక ఎక్కడనుండో అడవి మల్లెల వాసన గుప్పున కొట్టింది.
”అది దిల్ బహారా అయ్యుండాలి” అంటూ పొదల్లోకి దూరి ఒక గుత్తి కోసుకొచ్చాడు చైతన్య. ఆమె కళ్ళల్లోకి ఆశగా బెరుగ్గా చూస్తూ అన్నాడు-
”మికు అభ్యంతరం లేకపోతే తీసుకోండి.”
అతని కళ్ళల్లోకి సూటిగా చూచిన ఆమెకు తన కింతవరకు అనుభవం కాని అపూర్వభావమేదో కన్పించి ఒక్కక్షణం తటపటారుంచింది. మరు క్షణంలో నవ్వేస్తూ అంది;
”ఇందులో అభ్యంతర మేముంది? ఇవ్వండి చాలా అందమైన పూలు” ఆ పూల గుత్తిని అందుకుంటున్నపుడు ఆమెకు అతని కళ్ళల్లో సంతృప్తికొట్టవచ్చినట్లు కనిపించింది. అంతవరకు ‘టెన్షన్’ లో వున్న అతను హారుగా గాలి పీల్చుకోవడం కూడా ఆమె గమనించింది. అంతవరకు తను పరారు మగవాడి ప్రక్కన ఒంటరిగా నడుస్తున్నాననే భావం ఆమెకు మధురమైన భయాన్ని కలిగించి అడుగులు త్వర త్వరగా వేసేలా చేసింది. నాలుగు అడుగులు ముందు నడుస్తున్న నిర్మల భానుమూర్తి అరుణలతో కలసి పోరుంది. మురళి కన్పించినపొద దగ్గరకల్లా వెళ్ళి మంచిపూలు ఏరితెచ్చి వాళ్ళమ్మకిస్తున్నాడు.
”అమ్మా ఇది పెట్టుకో” అంటూ విరామం లేకుండా తల్లిని తన చిన్నారి ప్రేమతో ముంచెత్తుతున్నాడు.ఆమె కొడుకు వంక ఆపేక్షగా చూస్తోంది. ఆమె ఎక్కువగా మాట్లాడదు. ఆసక్తిగా వింటుంది. తను సరదాగా ఎవ్వరినీ నవ్వించలేదు. ఇతరుల హాస్యానికి మనస్ఫూర్తిగా ఆనందిస్తుంది. ఆమె మంచి ప్రేక్షకురాలు అంతకంటె మంచి శ్రోత.
ఇంత దిల్బహారా పూల గుత్తి తెచ్చి అమ్మ చేతికిస్తున్న చిన్న మురళిని ఆసక్తిగా చూస్తూ హాస్యానికి అన్నాడు భానుమూర్తి-
”ఏరా నాన్నా ! అన్నీ మి అమ్మకేనా? అత్తయ్య కేమి ఇవ్వవా?” అతని సున్నితమైన హాస్యోక్తి అరుణ లేత గుండెల్లో మల్లె పందిరి వేసింది. వెనగ్గా నడుస్తున్న చైతన్య తొందర తొందరగా ముందుకు వచ్చేసి, తన కెమెరా తీసి ముందుకు నడుస్తున్న వాళ్ళ ఎదురుగా వచ్చి ఫొటో తీయబోయాడు. అంతవరకు పొదల్లో వున్న మురళి గబగబ వచ్చి అమ్మ చెర్యు పట్టుకుని, ”నన్ను కూడా తియ్యాలి అంకుల్” అన్నాడు. వాడి మాటలకు ముచ్చటపడి వాడిని ఇంత ఎత్తుకు ఎత్తి
”ఇక్కడ కాదురా నీ ఫొటో. నిన్ను పులిమిద ఎక్కించి తీస్తాను. సరా?” అన్నాడు భానుమూర్తి.
”ఓకె నాకేం భయమా?”
ఈ గొడవల్లో అరుణ ఒక ప్రక్కగా వెళ్ళి నిల్చుంది. ”ప్లీజ్! ఫీల్డులోకి రండి.”