లలిత గీతాలు – స్వాతి శ్రీపాద

తలపులు ప్రవహించే తలపండిన హృదయంలో

గడిచిన వసంతాల పరిమళాలు చిగురించే

శిశిరం విదిలించిన ఆకురాలు రంగుల్లో ఎప్పటివా ఉప్పొంగే

మధురోహల సరిగమలు

యౌవనాన రాసుకునే తొలి పలుకుల పుస్తకాన

వెన్నెలకే వేడెక్కిన

ఊహల చిరు మోహనాలు

చుట్టూ పరచుకున్న

పచ్చ పచ్చని జ్ఞాపకాలు

మనసున వెదజల్లినట్టు

మంచుపూల తొలి చినుకులు

దాగుడుమూతలాడుకునే

వెలుగు చెట్లనీడల్లో

వికసించే కొత్త కలల

గరికపూల సమూహాలు

ఎవరన్నారిది వ్యర్ధమనీ

వృద్ధాప్యపు నరకమనీ

సమయం వరమిస్తే

అచ్చంగా అణువణువూ నీదేగా 

– స్వాతీ శ్రీపాద

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

లలిత గీతాలు, , , , , , , , , , , , , , , , , , , , Permalink

One Response to లలిత గీతాలు – స్వాతి శ్రీపాద

 1. D.Venkateswara Rao says:

  ఎవరన్నా అనకున్నా
  వృద్ధాప్యపు నరకమేగా

  సమయం వరమిచ్చినా
  దేహం సహకరించినా
  నిజంగా క్షణ క్షణమూ
  ఊహల జ్ఞాపకాల మైకంలో

  కలల సౌందర్యంలో జీవించడం
  మానవ జన్మకు బరువేగా