ఢిల్లీ సునామీ

ఓటరు చేసాడు తిరుగు బాటు,
అసాధారణ తీర్పు ఏర్పాటు,
రాజధాని లో ఆమ్ ఆద్మీ ప్రభంజనం!
ఒకప్పుడైతే అది అఖండ విజయం,
ఇప్పుడది ఒక భూకంపం,
సామాన్యుడి సునామీ, తూఫాన్
అడ్డు పడింది నరేంద్రుడి దండయాత్రకి
వరస విజయాల బి.జే.పీ హవా కి,
కలుగుతోంది ఒక ఆశాభావం
సాధ్యమేనంటూ ఒక ప్రత్యామ్నాయం!
ఝాడూ చేసింది జాదూ
కాంగ్రెసు చిరునామా గల్లంతూ
సామాన్యులకు అతనొక క్రేజీ
అవుతాడా అవినీతి అంతానికి ఒక టెక్నాలజీ?

– లక్ష్మి రాఘవ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , , , , , , , , , , Permalink

Comments are closed.