కాలాతీత వ్యక్తులు

రచయిత్రి: డా. పి.శ్రీదేవి

మాలా కుమార్

మాలా కుమార్

కథా రచయిత్రిగా, గేయ రచయిత్రిగా, సాహిత్య విమర్శకురాలుగా పేరు తెచ్చుకున్న రచయిత్రి, డా. పి.శ్రీదేవి.అతి పిన్నవయసులోనే కన్ను మూసిన వీరు నవలగా వ్రాసింది,”కాలాతీత వ్యక్తులు” ఒక్కటే.గోరాశాస్త్రి గారి సంపాదకత్వం లో వెలువడిన తెలుగు స్వతంత్ర లో 7-9-1957 నుండి 25-1-1958 వరకు ధారావాహికగా వెలువడి పాఠకుల మన్ననలను అందుకున్నదీ నవల.

ఇందిర ఈ నవలకు నాయిక. ఒక విశిష్టమైన స్త్రీ. బలమైన వ్యక్తిత్వము కలది. ఎవరికీ జడవదు.హాయిగా బతకాలి అనుకునే స్త్రీ.తన లక్ష్యం చేరుకోవటం లో ఏది అడ్డువచ్చినా లెక్క చేయదు. పక్కకు తోసేసి ముందుకు వెళ్ళిపోతుంది. పురుషాదిక్య సమాజం ఏర్పరిచిన చట్రాలలో ఇమడటానికి ఇష్ట పడదు.పాతివ్రత్యం, ప్రేమ, అర్పించుకోవటాలు అన్నీ లెక్క చేయదు. నచ్చదు. “ఏ పని చేసినా నేను కళ్ళు తెరిచి చేస్తాను.ఏడుస్తూ ఏదీ చేయను.ఏం జరిగినా ఏడవను.నాకూ తక్కిన వాళ్ళకూ అదే తేడా.”అంటుంది ఇందిర! ఇదీ ఆమె వ్యక్తిత్వము!

unnamed (1)ఇందిరకు పూర్తి వ్యతిరేకము రెండో నాయిక కళ్యాణి. చాలా సున్నితమైన మనసు. అభిమానవంతురాలు.అందం ఆత్మాభిమానం వున్న అమ్మాయి. జబ్బుపడ్డ తండ్రి, చాలా కష్టాలు , డాక్టర్ చదువుదా మనుకొని చదవలేక పోవటం లాంటి వాటి తో గంభీరంగా మారిపోతుంది.టైఫాయిడ్ వచ్చి నప్పుడు సేవ చేసిన ప్రకాశం ను ఇష్టపడుతుంది. అతనూ ఇష్టపడతాడు. కాని తండ్రి పోయి కష్టాలల్లో వున్నప్పుడు సాయం రాడు.కళ్యాణి కి దూరం జరుగుతాడు.ప్రకాశాన్ని తన వైపు తిప్పుకొని ,తనకు అన్యాయము చేసి ఇంట్లో నుంచి వెళ్ళ గొట్టిన ఇందిర మీద కోపం తెచ్చుకోదు. తన దురదృష్టం అనుకుంటుంది అంతే.అన్ని విధాలా నష్టపోయాను అనుకొని దిగులుగా పక్కకు తప్పుకుంటుంది.అంతటి సుకుమారమైన మనస్తత్వం కలది కళ్యాణి!

ప్రకాశం కు ఉద్దేశాలు , ఇష్టా ఇష్టాలు వుంటాయి కాని అవి బయట పెట్టే ధైర్యం లేదు.చిన్నతనము లో నే తండ్రి చనిపోతే మామ  ప్రాపకం లో పెరుగుతాడు. తనను మామ డాక్టర్ చదివించటమే ఎక్కువ అనుకుంటాడు.మామ మాటను కాదనే ధైర్యం లేదు. చాలా బలహీనుడు.కళ్యాణికి సన్నిహితుడై సాయం చేస్తానని చేయలేక పోతాడు. ఏమాత్రం కష్టపడకుండా జీవితం చేతిలోకి రావాలి అనుకునే అవకాశవాది.

 ప్రకాశం స్నేహితుడు కృష్ణమూర్తి.తండ్రి పంపుతున్న డబ్బు తో ఖుషీ గా కాలం గడిపేస్తూ వుంటాడు.పెద్ద ఆదర్శాలు లేవు.ఎవరి మీదా కోపం లేదు . అందరినీ ప్రేమించగలడు.హాయిగా గడిపేయటమే అతని పద్దతి.

ఇంకా ,ఇందిర తండ్రి ఆనందరావు, డా;చక్రవర్తి, రామినాయుడు, వసుంధర మొదలైనా పాత్రలు వున్నా ఈ నలుగురి చుట్టూ అల్లిన అందమైన కథ నే “కాలాతీత వ్యక్తులు.”ఇది చాలా సాధారణమైన కథ . ఎలాంటి మలుపులు లేవు. ముఖ్యంగా ఇందిర, కళ్యాణి లు ఎలా ప్రయాణించారు అన్నదే కథ. కళ్యాణి లాంటి సుకుమారమైన అమ్మాయిని ఆదరించగలరు ఎవరైనా కాని ఇందిర లాంటి వ్యక్తిత్వం కల అమ్మాయిని ఈ కాలం లో కూడా సమాజం అంతగా హర్షించదు.ఇందులో కాలాతీత వ్యక్తులు ఎవరు? ఏమో అది పాఠకులకే తెలుసుకోవాలి.

– మాలా కుమార్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక పరిచయం, , , , , , , , , , , , , , , , , , , , , Permalink

7 Responses to కాలాతీత వ్యక్తులు

 1. తల్లాప్రగడ మధుసూదన రావు says:

  రచయిత్రి శ్రీ దేవి గారి ఫొటో ఎక్కడ లభ్యమౌతుంది? దయచేసి చెప్పగలరా?

 2. కాలాతీతవ్యక్తులు సమీక్ష(?) చదివాను. పరిమితుల దృష్టితో రాసినట్లో, హడావిడిగానో రాసినట్లున్నారు. మరలా ఒకసారి నవలను గుర్తుచేశారు. 1951లోనే ఒక ఇందిరను శ్రీదేవిగారు సృష్టించగలిగారు. ఆపక్కనే సున్నితమైన కళ్యాణినీ ( ఎప్పుడూ చిన్నదానికీ, పెద్దదానికీ భయపడుతూ, ఏడుస్తూ ఉంటుంది కదూ…), అలాగే తనని కూడా తానే మోసం చేసుకోవడానికి వెనుకాడని ఆనందరావుల్ని మనం నిత్యం మన చుట్టూ చూస్తుంటాం. వీళ్ళంతా కాలానికి అతీతమైన వ్యక్తులే. మంచి నవల. మరలా ఒకసారి పెద్ద వ్యాసం రాయదగిన నవల.. శుభాకాంక్షలు

 3. మాల గారూ ..
  మీ కున్న పరిమితుల లో చేసినట్టున్నారు ..ఈ నవల పరిచయం ..ఇందిర, కల్యాణీ ,ప్రకాశం ..ఇందిర తండ్రి ..వీరందరూ మన చుట్టు కనిపిస్తునే ఉంటారు ..పరిస్తితుల కి లొంగిపోయి తమ ఆశ లని వదిలేసుకునే వారు ఒకరు ..ఐతే ..ఎలాంటి ప్రతికూల పరిస్తితుల లో ఐనా తను బ్రతకాలి జివించాలి అని పట్టుదల తో నా సుఖం ..నా స్వార్ధం అంటూ నేల కి కొట్టిన బంతి లా పైకి ఎగిరి తన్నే వారూ ..మన చుట్టూ అందరూ కనిపిస్తూనే ఉంటారు ..శ్రీదేవి గారు రాసిన కాలాతీత వ్యక్తులు ..నా కు నచ్చిన నవల లో ఒకటి ..ఎన్ని సార్లు చదివానో ఎప్పుడూ ఏదో కొత్త కోణం కనిపిస్తుంది ..
  మంచి పుస్తకం పరిచయం చేసినందుకు ధన్యవాదాలు …

  వసంత లక్ష్మి .

 4. Krishna Veni Chari says:

  మాలగారూ, ఈ పుస్తకం చదివేను. మీ సమీక్షతో దాన్ని గుర్తొచ్చేలా చేసేరు.

 5. mala kumar says:

  వనజగారు,
  మీ స్పందనకు థాంక్స్ అండి. నిజమే ఇంకా చాలా రాద్దామనుకున్నాను . ముఖ్యంగా ఈ మహిళాదినోత్సవ సంధర్భంగా వుంటుందని ఇందిర గురించి రాద్దామని చాలా అనిపించింది. ఇందులో నాకు నచ్చిన పాత్ర ఇందిర. స్చప్ . . . కాని ఎందుకో కర్సర్ ముందుకు సాగలేదు . మిమ్మలిని నిరాశ పరిచినందుకు సారీ అండి.

 6. కాలాతీత వ్యక్తీ … ఇందిర యే కదా… కల్యాణి ని ఏ యుగంలోనైనా ఆదరించి అక్కున చేర్చుకుంటారు . “ఇందిర ” అనగానే ముఖం చిట్లిస్తారు . అంతే !

  మీనుండి ఇంకా బాగా సమీక్ష ని ఆశించాను . మీరు నన్ను నిరాశ పరిచారు . 🙂