చౌరస్తాలో చెల్లాయ్

GOURILAXMI

GOURILAXMI

ఎటు పోవాలి ? ముందుకా ? వెనక్కా ?  ఆలోచించు !

రాక్షస రూపాలు వెంటాడినా,

పిశాచాలై అనాదిగా నిను వేటాడినా

నువు నిత్య చైతన్యం తెచ్చుకు ఓపిగ్గా పోరాడుతూనే ఉన్నావ్

మనువాదాలు మెల్లగా గతించాయ్,

మూడాచారాలు మందగించాయ్

కన్యాశుల్కాన్ని చంపాక వరకట్నం పుట్టింది,

రెంటిలోనూ నువ్వే నష్టపోయావ్

కట్నాల నోరు మూత పడేలా,

వంటిల్లు వదిలి చదువుల తల్లైనావ్

పోటి పరీక్ష నెగ్గి ఉద్యోగస్తురాలివైనాక,

రాక్షస స్వరూపాలు రూపు మార్చుకున్నై

పీడించే భర్తకు విడాకులిచ్చి వడ్డునపడి,

పిల్లల్తో సింగల్ పేరెంట్ గా  శభాషనిపించుకున్నావ్

వాణిజ్యానికి యాడ్ ప్రాణంగా నిలబడ్డావ్,

సినిమా ప్రమోషన్ నూ నువ్వే ముందున్నావ్

బ్యాంకు సీఈఓ వైనా ఐటెం సాంగ్ వి నువ్వే అన్నా,

నీ పోరాటం ఆపి వెన్ను చూపలేదు

రెక్కల స్వేఛ్చ కోసం కఠిన శ్రమ కోరుస్తూ,

మంచి రోజు కోసం ఎదురుచూపు కన్నార్పలేదు

ప్రేమ ముష్కరుల యాసిడ్ దాడైనా,

కెమెరా  క్రూరత్వమైనా పంటి బిగువున భరిస్తున్నావ్

ఇదంతా నీ పెనుగులాట,

అస్తిత్వానికై   వెతుకులాట,

తరతరాల పీడనకు తిరుగుబావుటా

స్కూల్ మాష్టర్, కాబ్ డ్రైవర్ కీచకుల మధ్య,

దిన దిన గండమైనా సాగిపోతూనే ఉన్నావ్

షాదీ పేరుతొ అరబ్ షేక్ కి పనిమనిషివై ,

అందాల పోటీలో అవయవ తూకమై   

అడుగడుగున దగా పడినా

పోరాట పటిమతో మొక్కవోని ధైర్యం చూపిస్తున్నావ్

ఈ స్పూర్తి ఈ ఓర్పు  వదలకెన్నడూ,

వెనకడుగు ఊహే రానీయ కెప్పుడూ  

కలనైనా విసిగి కలుగులోనే సుఖమని కుంపటి ముందు కూచోకు

గమ్యం మరిచి పక్క దారులు చూడకు,

నీ పయనం మును ముందుకే  మరి

అదరక, బెదరక  నీ రెక్కల్ని కత్తిరించుకోక ఏమరపాటు లేక సాగిపో

నీ దీక్షయే త్రిశూలమై,

ధైర్యమే నీ కవచమై నువ్వే ఓ కొరకంచు గా మారిపో 

సమూహంగా కదిలి నిప్పు రవ్వ లెగరేస్తూ,

రాక్షస జాతిని పారద్రో లు

పౌరుష మైన పురుష లోకం,

అర్ధ భాగాల్ని,అమ్మ చెల్లెళ్ళని గౌరవించే దాకా

మొక్కవోని దీక్షతో నిబ్బరాన్ని వదలక సాగి పోతూనే ఉండు 

మానవత్వం పరిఢవి ల్లే నవలోకపు భావికై

నీ ఉజ్వల నేత్రం తెరిచే ఉంచు…

– అల్లూరి గౌరీలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
6 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
gouri lakshmi alluri
gouri lakshmi alluri
5 years ago

థాంక్స్ బాలాజీ , మణి అండ్ మణి

మణి వడ్లమాని
మణి వడ్లమాని
5 years ago

గౌరీ నీ కవిత సందేశాత్మక చాలా inspiringఉంది

V Bala Murthy
V Bala Murthy
5 years ago

చాలా బాగుంది గౌరీ! మహిళా దినోత్సవ శుభాకాంక్షలు !

nandoori sundari nagamani
nandoori sundari nagamani
5 years ago

‘మానవత్వం పరిఢవి ల్లే నవలోకపు భావికై
నీ ఉజ్వల నేత్రం తెరిచే ఉంచు…’
వాట్ పవర్ ఫుల్ లైన్స్? గౌరీ ఎంత మంచి కవితను అందించావు?
మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో పాటుగా ఇంత మంచి కవితను
అందించినందుకు నా ధన్యవాదాలు కూడా !

alluri gouri lakshmi
alluri gouri lakshmi
5 years ago

థాంక్స్ వనజా !

వనజ తాతినేని

చాలా చాలా బాగుంది . మనం ఇలా ఉద్భోదిస్తూనే ఉన్నాం ఉంటాం .. అనిపించే సమాజంలో ఉన్నాం . అదే విచారం . విలాపం … విషాదం కూడా !.

అభినందనలు.