21,22న 3వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

ఈ నెల 21,22 తారీఖుల్లో విజయవాడ పటమటలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూలులోని కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ సభాప్రాంగణంలో కృష్ణాజిల్లా రచయితల సంఘం, ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో 3వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను నిర్వహిస్తున్నట్లు కృష్ణాజిల్లా రచయితల సంఘం గౌరవాధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి.వి.పూర్ణచందులు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. తెలుగు భాష, సంస్కృతి, చరిత్ర, సాంకేతిక రంగాలలో రేపటి అవసరాలు, రేపటి మనుగడ, రేపటి స్థితిగతులు దృష్టిలో పెట్టుకుని, ప్రాంతాల కతీతంగా తెలుగు రచయితలందరినీ సమావేశపరిచే లక్ష్యంతో ఈ సభలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో 2007లో జరిగిన తొలి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు తెలుగు ప్రజలలో భాషాచైతన్యాన్ని కలిగించటానికి తోడ్పడగా, 2011లో జరిగిన రెండవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు సమాచార సాంకేతిక రంగంలో తెలుగు వినియోగానికి ప్రభుత్వ పరంగా పటిష్టమైన చర్యలు తీసుకోవటానికి తోడ్పడ్డాయి. దేశ, విదేశాల నుండి ఎందరో ప్రముఖులు ఈ మహాసభలలో పాల్గొన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత దేశవ్యాప్తంగా వేలాదిమంది రచయితలు ఈ మహాసభల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఈ మహాసభల ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని సాహితీ ప్రముఖులు, పాత్రికేయ ప్రముఖులు ఎందరో ఈ మహాసభలు ఒక తక్షణావసరంగా భావిస్తున్నారు. నవ్యాంధ్రప్రదేశ్‘లో జరుగుతున్న తొలి భారీ సాహిత్య కార్యక్రమం ఇది. ప్రాంతాల కతీతంగా ప్రపంచంలో ఎల్లెడలా విస్తరించి, ప్రతిభా పాటవాలతో రాణిస్తున్న తెలుగు భాషాభిమానులు, సాహితీమూర్తులందరూ ఈ వేడుకలో పాల్గొని విజయవంతం చేయవల్సిందిగా వారు కోరారు.

మరిన్ని వివరాలకోసం:
గుత్తికొండ సుబ్బారావు : 9440167697,
డా. జి వి పూర్ణచందు: 9440172642
శ్రీ గోళ్ళనారాయణరావు; 9246476677
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సుందరి: 9440174797
శ్రీ టి శోభనాద్రి: 9440524305
శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ 9989066315
శ్రీ చింతపల్లి వెంకటనారాయణ 9441091692
డా. గుమ్మా సాంబశివరావు: 9849265025
డా. పాలపర్తి శ్యామలానందప్రసాద్: 9440346287
డా. వెన్నా వల్లభరావు: 9490337978
శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి: 9885628572
శ్రీ తూములూరి రాజేంద్రప్రసాద్: 9490332323
శ్రీ గాజుల సత్యనారాయణ: 9848687652
శ్రీ చలపాక ప్రకాశ్: 9247475975
కరెడ్ల సుశీల 9440330500
శ్రీ కె. వి ఎల్ ఎన్ శర్మ: 9963668247
డా. గుడిసేవ విష్ణుప్రసాద్ 9441149608
శ్రీ విడియాల చక్రవర్తి: 9440139025
శ్రీ శిఖా ఆకాశ్ 9298901571
శ్రీ రఘునందన్ 9440848924
శ్రీమతి పి నాగలక్ష్మి 9849454660
శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి 9395379582
డా. ఘంటా విజయకుమార్ 9948460199
శ్రీ మహమ్మద్ శిలార్: 9985564946
శ్రీ జి. వి రాములు: 9848622521
శ్రీ ఎస్ వి రత్నారావు 9441305468
శ్రీ జె వి సాయిరాం ప్రసాద్: 9490742807
శ్రీమతి కోకా విమలకుమారి: 9885676531
డా. రెజీనా 0866-2470522
శ్రీమతి కావూరి సత్యవతి. 9912340962

http://tnilive.com/

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~“

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)