సంపాదకీయం

DSC_0125_2277729fకొన్నేళ్ల క్రితం ‘లజ్జ’ నవల రాసినందుకు తస్లీమా నస్రీన్ అనే రచయిత్రి పై ఒక వర్గం ఫత్వా ప్రకటించింది . తన వర్గానికి సంబంధించిన జీవితాన్ని నవలలో చిత్రీకరించినందుకు వారి ఆగ్రహానికి ఆమె గురైయ్యింది . ఎన్నో ఏళ్లు గృహ నిర్బంధాన్ని అనుభవించింది . అయినా రచయితకి మరణం లేదని నిరూపించింది . తన రచనలతో తన భావాల్ని ప్రకటిస్తూనే ఉంది .
మళ్లీ ఇప్పుడు చరిత్ర తిరగబడింది అంతే అప్పుడు తస్లీమా అయితే ,ఇప్పుడు బాధితుడు పెరుమాళ్ మురుగన్…….
“మాధోరుబాగన్” నవల రచయిత పెరుమాళ్ మురగన్ ఇవాళ ఒక ఉద్యామానికి కేంద్ర బిందువు అయ్యాడు . నిజానికి ఈ నవల 2010 లోనే రాసాడు . ఈనవలని 2014 లో పెంగ్విన్ సంస్థ ఆంగ్లలోకి అనువదించి ప్రచురించింది . దీనికి ప్రపంచ వ్యాప్తంగా పేరు రావడంతో ఆ నవలా వస్తువుతో విమర్శకుల చర్చ ప్రారంభమైయింది. కొన్నేళ్ల క్రితం తమిళనాడు లోను ఒక ప్రాంతంలో జరిగిన ఆచార వ్యవహారాలను తన నవలలో చిత్రించినందుకు ఒక వర్గం వారు వివాదానికి తెర తీసారు . దాంతో ఊరుకోకండా ప్రచురించిన పుస్తకాలన్నింటిని వెనకకు తెప్పించుకునేలా చేసారు . తాను రచనను ఉపసంహరించుకుంటున్నానని ఇక పై అటువంటి రచనలు చేయనని చెబుతూ మన్నింపుకోరాల్సింది గా అతని పై ఒత్తిడి చేసారు .
ఏ రచయితకైన ఈ పరిస్థితి అత్యంత క్లిష్టమైనదే . తన భావ ప్రకటనా స్వేచ్చ పై గొడ్డలి పెట్టుగా మారే ఇటు వంటి సందర్భాలు రాకుడదని .
పెరుమాళ్ మురుగన్ కి దేవుడి పై నమ్మకం లేదు . అందుకని మరణం తరవాత పునర్జన్మ ఉంటుందనే నమ్మకం కూడా లేదు . “ రచయిత మురుగన్ చనిపోయాడు . పునర్జన్మ పై నమ్మకం లేదు కాబట్టి తిరిగి పుట్టే ప్రసక్తి లేదు . ఇక నుంచి పెరుమాళ్ మురగన్ ఒక ఉపాధ్యాయుడిగా మాత్రమే మిగిలిపోతాడు . ఇక నుంచి నన్ను ఎవ్వరు ఏ సభలకి రమ్మని ఆహ్వానించ వద్దు .ఇక నేను ఏమి రచనలు చేయను “ అని తనకు తానుగా ప్రకటించుకున్నాడు .
ఆ తర్వాత పత్రికలు , రచయిత్రి నయన్ తార సెహగల్ బాహాటంగా ఒక సభలో పెరుమాళ్ కు మద్దతుగా నిలవాలని రచయితల సంఘాలకు పిలుపు ఇవ్వటంతో ఈ సంఘటన ఒక ఉద్యమ రూపాన్ని దాల్చింది .ఈ సంఘటన తర్వాత రచయితలంతా తమ ప్రాంతాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని భావ ప్రకటనా స్వేచ్చ పై చర్చలు జరుపుకోవటం మురుగన్ కి తోడుగా నిలవడం గొప్ప విషయం .

– హేమలత పుట్ల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

సంపాదకీయంPermalink

One Response to సంపాదకీయం

 1. దుగ్గిరాల రాజకిశోర్ says:

  భావప్రకటన స్వేచ్ఛకు హద్దులు ఉన్నాయి
  ————————————————-

  భావప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరి ప్రాధమిక హక్కుగా భారత రాజ్యాంగం కల్పించింది. అయితే అది ఎంత వరకు ? దానికి పరిమితులు లేవా?

  ప్రతి రంగంలో లాగే రచనా రంగంలో కూడా భావప్రకటన స్వేచ్ఛ అవసరమే. కానీ ఈ స్వేచ్ఛ అనేక రకాలుగా దుర్వినియోగం అవుతోంది.

  ప్రపంచంలో కెల్లా అతి ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలకు నిలయం మన భారతదేశం. భావ స్వేచ్ఛ పేరుతో దీనిని విమర్శించడం, అవహేళన చేయడం నేడొక ఫ్యాషన్ అయిపోయింది. రచనా రచ్గంలో అయితే ఇది వెర్రితలలు వేస్తోంది. “మురుగన్” సంఘటన ఒక తాజా ఉదాహరణ మాత్రమే. అతడు తన పుస్తకంలో మన సంస్కృతిని ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తూ వ్రాసేడు . ఇది క్షమించరాని నేరం.

  అలాంటి రచయితలను రచనా రంగం నుండి బహిష్కరించాలి.