అసూయ

 

అక్కరకు రానిదని తెలిసినా….

అగ్నిలా లోలోన మండుతూ ఉంటుంది..అసూయ…

 

ఆత్మ నోరును మూయిస్తూ..

అంతర్మదనంలో ఆవిరై…బయిటికి వచ్చి..

ఎదురుగా ఉన్న పచ్చని చెట్టునయినా..

బూడిద చెయ్యగలదు ..అసూయ…

 

ఆకలితో కాలే కడుపుల కేకలు

ఎండిన డొక్కల అరుపులు

వినిపించుకొనక …

వాడు బాగున్నాడు…

వీడు బాగున్నాడు..అనుకుంటూ…

రౌద్రమనే రంగు పూసుకొని…

వికటాట్టహాసం చేస్తుంది…అసూయ…

 

ప్రేమతత్వం..అమాయకత్వాన్ని…

అణగారినతనంగా …మార్చి..

తనదారిలో తను వెళుతూ…

ఎదురోచ్చినవారిని చూపుల బాకులతో…

తెగనరుకుతూ…శూన్యప్రదేశంలో..

తను… సువిశాల రాజ్యమేలుతుంది..అసూయ…!!

– సుజాత తిమ్మన

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

One Response to అసూయ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో