పేజీలు
లాగిన్
వర్గాలు
బెంగుళూరు నాగరత్నమ్మ
త్యాగరాజు సమాధి మిద గుడి కట్టాక నాగరత్నమ్మ జీవితం తిరువయ్యారుతో మరింత ముడిపడింది. ఆరాధన ఖర్చులకోసం కచేరీలు ఇస్తూ వుండే నాగరత్నమ్మ కొంచెం ఖాళీ దొరికితే తిరువయ్యారు వచ్చేసి సమాధి దగ్గర గడిపేది. నాగరత్నమ్మ వారసురాలు బన్నీబాయి బాధ్యత తంజావూరులో ప్రముఖుడు, తననేస్తం టి.ఎ రామచంద్రరావు తీసుకున్నాడు(1931). బన్నీబాయి తంజావూరులో రామచంద్రరావు సాయంతో వివిధ శిక్షకుల దగ్గర హరికథల మెళకువలు నేర్చుకుంది.
ఆరాధన దగ్గరవుతున్నకొద్దీ తిరువయ్యారు లో ఏర్పాట్లు ముమ్మరంగా జరిగేవి. చిన్నకచ్చి వాళ్ళు అయిదు రోజులు ముందు వచ్చి పనులు మొదలెట్టడంతో మరింత హడావుడిగా వుండేది. నాగరత్నమ్మ దగ్గర పనివాళ్ళు సమాధి వెనకాలంతా శుభ్రం చేస్తారు. ఆరాధన రోజున త్యాగరాజు విగ్రహానికీ, స్మారకచిహ్నానికి మూడు సార్లు అభిషేకం, పూజలు జరుగుతాయి. ముందుగా వేకువన 4.30కి నాగరత్నమ్మ, మిగిలిన స్త్రీలు సమాధి దగ్గరకి వచ్చేవారు. తన గురువు రామనాథపురం ‘పూచి’ శ్రీనివాసయ్యంగార్ త్యాగరాజుని ప్రశంసిస్తూ రాసిన రీతిగౌళరాగకృతి ‘సద్గురుస్వామికి’ నాగరత్నమ్మ పాడేది. అప్పుడు రాముడు భాగవతార్ పూజ చేస్తాడు. ఆడవాళ్ళందరూ నాగరత్నమ్మ త్యాగరాజు మిద కట్టిన అష్టోత్తర నామావళి పఠించి తమకి వచ్చిన కీర్తనలు పాడతారు. దేవదాసి అమ్మపెట్టెచెల్లమ్మాళ్ ఆరాధనకి తనవంతుగా సమర్పించిన పూలతో రాముడు భాగవతార్ విగ్రహాన్ని అలంకరిస్తాడు. పద్మాసినీ బాయి పంపిన పూలు, పళ్ళు సమర్పిస్తారు. 6 గంటలకి తమ పూజ మొదలు పెట్టేందుకు పెరియకచ్చివాళ్ళు అక్కడికి చేరుకుంటారు. తర్వాత గంటలకి చిన్నకచ్చి వాళ్లు పూజ చేస్తారు.
ధనం చనిపోయాక నాగరత్నమ్మ జార్జిటౌన్, శ్రీనివాసయ్యర్ వీధిలో వున్న తన ఇంటిని అమ్మేసింది. అత్యవసరమైన సామగ్రి కొద్దిగా మాత్రం వుంచుకుని మిగిలిన వాటిని అమ్మేసింది. పూజ సామగ్రి తిరువయ్యారు తీసుకెళ్ళి భక్తి శ్రద్ధలతో త్యాగరాజ సమాధి ఆలయంలో ఎడమపక్కన వుంచింది. రాముడు భాగవతార్ వాటిని పూజకి వాడేవాడు. తన పూజ గదిలోని దీపాన్ని తిరువాయూరు తీసుకొస్తూ ఆరిపోకుండా దారి పొడుగునా నూనె పోస్తూ జాగ్రత్తగా తెచ్చింది.
కుంభాభిషేకం నిర్మాణ పరిసమాప్తి
అని చెక్కారు. దీంతో త్యాగరాజు అవశేషాలకి ఒక ఆలయం ఏర్పడింది. కాని ఇన్ని ఏర్పాట్లు త్యాగరాజుకి చక్కగా చేసినావిడ, తనుమాత్రం మంగళవారం సత్రంలో వుండకుండా తిరువయ్యారు ప్రధాన వీధిలో అద్దె ఇంట్లో దిగింది.
– వి.శ్రీరాం
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ధారావాహికలు1927, 1930, 1931, 1935-36, అంకితం చేసిన వారు ఆయన, అజగనంబి పిళ్ళైల, అభిషేకం, అమృతాంజనం, అమ్మాళ్ అగ్రహారం, అమ్మాళ్ పుత్రిక . కుంభాభిషేకం, ఆంధ్రపత్రిక, ఆజ్ఞ, ఆరాధన, ఆశ్రమం ప్రఖ్యాత సంగీతకారుడు, ఆహ్వాన పత్రాలు, ఇన్‌చార్జి డిప్యూటీ, ఈ ఆలయం, ఉంగరం, కచేరీలు, కలెక్టరు, కల్యాణ మహల్, కాశీనాథుని నాగేశ్వర్రావు పంతులు, కుంకుడుకాయంత, కుంభకోణం, క్షయ, గణపతి అగ్రహారం, గృహలక్ష్మి, గోవిందస్వామి పిళ్ళై, చెందిన పుట్టలక్ష్మీ, టి. బాల సరస్వతి, టి.ఎ రామచంద్రరావు, డా|| కె.ఎన్. కేసరి 1929, డిసెంబరు, తంజావూరు, తంజావూరు రంగనాయకి, తిరుప్పళనం, తిరువయ్యారు, తోట, త్యాగరాజు విగ్రహానికీ, త్యాగరాజు సమాధి, దక్షిణామూర్తి పిళ్ళై, దేవదాసీల, నవరాత్రివుత్సవాలు, నాగరత్నమ్మ, నాట్యకళాకారిణి, పాటలు, పుదు అగ్రహారం, పురుషుడి, పూజ, పెరట్లో, ప్రెసిడెంటు, బన్నీబాయి, బి.ఎస్. రాజయ్యంగార్, బెంగుళూరు నాగరత్నమ్మాళ్, భక్తుడు, భక్తురాలు విద్యాసుందరి, భారతీయ, మధుమేహం, మనుమరాలు, మైసూరు, మేజస్ట్రేటులు, యువకళాకారుడు, రాజలక్ష్మి, రామకృష్ణ, లక్ష్మీరత్నం, వజ్రం, వాలాడి రుక్మిణి, వి. సరస్వతి, విధేయురాలు, వీణధనం, శ్రీ త్యాగరాజ స్వామి, శ్రీ రాజారాం, శ్రీరామజయం, సద్గురువు, సాయంత్రం, సాహెబ్, సూపరింటెండెంట్, సూరజ్‌మల్, స్త్రీ కళాకారుల, స్థలం, స్మారకచిహ్నాని, హంసగీతం, హరికథ, హిందుస్తానీPermalink