పేజీలు
లాగిన్
వర్గాలు
జోగిని
ఆమె గొణుగుడూ ఆమెనీ అర్థమయీ అర్థం కానట్లు … చూస్తూ…
ఏమిటి అసలు ఇతను ఏమనుకొంటున్నాడు. ఆరేళ్ళ పిల్లాడి నుండి అరవై ఏళ్ళ ముసలి వాడి దగ్గర వరకూ ఆడపిల్ల అంటే అందరికీ లోకువే.. చులకనే… అవకాశం ఎలా దొరుకుతుందా… ఎప్పుడు దొరుకుతుందా… అని ఎదురు చూస్తుంటారు. అందుకు రంగం సిద్ధం చేసుకుంటారు. అనుకొని అతని కేసి ఒక చూపు విసిరింది.
”ఎక్కడి వరకూ…?” పుస్తకం మూస్తూ తానే అడిగింది.
‘ఈ వ్యవస్థ ఇలా కొనసాగాల్సిందేనా..?, మధ్యలో ప్రశ్నించింది. అప్పటి వరకూ శ్రద్ధగా విన్న విద్య.
”మరి ఇన్ని చట్టాలు ఉన్నా ఈ వ్యవస్థలో జోగినీ ఆచారం, దేవదాసీ వ్యవస్థ ఇంకా ఎలా నిలబడగలిగింది..? ఎలా సజీవంగా ఉంది?” సమాజంలోని స్త్రీ పురుష తారతమ్య భావనలు, ఆర్థిక అసమానతలు, కుల మత ఛాందస భావాలు, తరిగిపోతున్న మానవతా విలువలు, పెరిగిపోతున్న స్వార్థ చింతనలు, చట్టాలలో ఉన్న లొసుగులూ, లోపాలు, రోజు రోజుకీ హెచ్చవుతున్న యాంత్రికత అన్నీ కూడా కావచ్చు” చక్కగా విశ్లేషించారాయన.
”ఇఫ్ యు డోంట్ మైండ్, లైట్ ఆఫ్ చేయొచ్చా” అడిగింది. ఏమనుకున్నారో అతను. ఓ క్షణం అలా కన్నార్పకుండా చూసి పుస్తకం మూసేసి పక్కనే ఉన్న బ్యాగ్‌లో పెట్టేశాడు. థ్యాంక్స్ చెప్పి తనూ నిద్రకుపక్రమించింది విద్య.
‘మనిషి సూర్యలోకాన్ని చేరుకోవడానికి ఉత్తమ మార్గం కొందరు బాలికలను దేవాలయానికి అంకితం చేయడం అని భవిష్యపురాణం అంటుందని శ్రీమతి జె. వరలక్ష్మి గారు రాసిన ”యుగయుగాల్లో భారతీయ మహిళలో చదివాను.
తనకు దేవదాసీల గురించి తెల్సిన విషయాలన్నీ చక్కగా చెప్పింది వలసమ్మ. ఆమె చెప్పిన దాంట్లో ఎక్కడా జోగిని, బసివి, శివసతి, మాతంగి, మాతమ్మ, పార్వతి వంటి పదాలు దొర్లలేదు. అంటే ఆ కాలంలో ఉండే దేవాలయ కాంతలే దేవదాసీలు అయి ఉంటారనీ వారే వేశ్యా వృత్తిలో ఉండి ఉంటారు. లేకపోతే వేశ్యలు వేరుగా ఉండేవారా…? వలసమ్మ చెప్పింది ఎంతో శ్రద్ధగా విన్న విద్య మనసులో ఎన్నెన్నో సందేహాలు. అయితే జోగినిల గురించి వలసమ్మకి ఏమీ తెలియదని మాత్రం అర్థం అయింది. ‘వేమన్న వాదం’లో చదివినట్లు శైవ మతం ప్రచారంలోకి వచ్చాకే బసివి, జోగినీలు వచ్చారన్నమాట అనుకుని, మరోసారి వలసమ్మతో నిర్ధారించుకుందామని” వలసమ్మా మరి జోగిని గురించి…” అంటూండగానే వలసమ్మ అందుకుని ” నేనెప్పుడూ జోగిని గురించి వినలేదు. విద్యా” మళ్ళీ తనే నీకేమన్నా వారి గురించి అయిడియా ఉందా” అని అడిగింది.
పదకొండు గంటలు కావస్తోంది. గబగబ లేచి హ్యూమానిటీస్ బిల్డింగ్ వైపు నడక సాగించారు.
”విద్యా ఏం చేయాలనుకుంటున్నావ్? నీ భవిష్యత్ ప్రణాళిక ఏమిటి..? ప్రశ్నించారావిడ. ”ఇంట్లో వాళ్ళు పెళ్ళి చేస్తామంటున్నారనీ, తనకి మాత్రం పిహెచ్‌డి చేయాలని ఉందనీ చెప్పింది. ”మంచి సంబంధం కుదిరితే పెళ్ళి చేసేస్తాం అంతవరకూ చదువుకో, కావాలంటే పెళ్ళి తర్వాత కంటిన్యూ చేయి అంటున్నారు” నాన్న. మొదలు చేరిపోతే ఆ తర్వాత చూసుకోవచ్చని సరే అన్నాను. అంటూ ఇంట్లో జరిగిన విషయాలు చెప్పింది విద్య.
”గుడ్… మంచి సబ్జక్ట్” ”మేడం, చిత్తూరు జిల్లాలో ఉన్న మాతమ్మలు నిజామాబాద్ జిల్లాలోని జోగినిలు ఒకటేనా?” తన సందేహం వెలిబుచ్చింది. ”ఒకటేనమ్మా, ప్రాంతాన్ని బట్టి పేర్లు మారుతున్నాయి. సంస్కృతీ ఆచార వ్యవహారాల్లో కొద్ది తేడాలు ఉన్నట్లే ఈ విధానంలోనూ” అంటూ ఆవిడ టైం చూసుకున్నారు. 12 గంటలు కావస్తుంది. ”ఉంటున్నావ్ కదా విద్యా” అంటూ లేచారు. ఆవిడ క్లాస్‌కి వెళ్ళడానికి. ఏ విషయాన్నయినా చక్కగా విశ్లేషించి మాట్లాడుతుందనో, బాగా చదువుతుందనో, తెలివిగలదనో గానీ విద్య అంటే ఆవిడకి ప్రత్యేకమైన అభిమానం. అందుకు విద్య క్లాస్‌మేట్స్ లీల, సురేఖ ఎప్పుడూ కొద్దిగా జెలసీ ఫీలయ్యేవాళ్ళు. డిపార్టుమెంటులో మిగతా లెక్చరర్స్‌ని పలకరించి లంచ్ టైం అవుతుండగా లైబ్రరీలో ఉన్న వలసమ్మతో లంచ్‌కి బయలుదేరింది.
ఈ బ్లాక్‌లోనే.. సెకండ్ ఫ్లోర్‌లో.. తన రూమ్‌లోంచి చూస్తే… దూరంగా కొండ కన్పిస్తూ… ఎంత అద్భుతమైన దృశ్యాలో… వాటిని అలా చూస్తూ… రెండేళ్ళు గడిపేసింది. మనసులో అనుకొని. ”వలసమ్మా.. అటుచూడు ఆ కిటికీ లోంచి చూస్తూ ఉంటే అసలు టైమే తెలీదు. అదిగో… ఆ దృశ్యం చూడు, కొండ దిగువ భాగానికి ముసుగు వేస్తున్న మేఘం. ఆ పైకి చూడు మబ్బుతునకలతో మేలి ముసుగు వేసుకోవడానికి ఇబ్బంది పడ్తూ… మధ్యలోంచి మెలికలు తిరుగుతూ.. భక్తులు గోవింద నామ స్మరణతో ముందుకు కదిలే బస్సులు… ఈ దృశ్యమే నాకు అంత్యంత అద్భుతంగా కన్పిస్తుంది. సాయంకాలం పడమటి దిక్కున అస్తమించే సూరీడు… అరుణారుణ కిరణాలు…
ఎప్పుడూ పుస్తకాల్లో మునిగితేలే వలసమ్మ విద్య చెప్పిన అద్భుతమైన ఆ ప్రకృతిని ఎప్పుడూ ఆస్వాదించలేదు. అందుకు ప్రయత్నించనూ లేదు. అసలు ఆమె ఎప్పుడూ గమనించనేలేదు. అంతలో పక్క రూంలోంచి కవిత ”నేనొచ్చేశా… మీరెంత సేపయిందీ వచ్చి” అంటూ లోనికి వచ్చింది. అంతా భోజనానికి కదిలారు. ”కవితా రేపు కొండకెళ్దాం. ముందుగానే వార్డెన్‌కి చెప్పి పర్మిషన్ లెటర్ తీసుకో” అంది విద్య భోజనం చేస్తూ. ”కొండకా… నేనూ వస్తాను” వలసమ్మ అంతలో కవిత ఫ్రెండ్ సరస్వతి వచ్చి ‘నడిచి వెళ్ళేట్లయితే నేనూ వస్తాను’ అంది.
”తిరుపతిలో అంతా మోసమే. మన అవసరాన్ని ఆసరాగా చేసుకుని నకిలీవి అమ్ముతారు. వీళ్ళ మీద కంప్లైంట్ చేయాల్సిందే” అంది సరస్వతి. అప్పటికే పాతిక మెట్లు పైకి వచ్చేశారు. ఆ కల్తీ పాకెట్ తీసుకున్న దగ్గర నుండి.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ధారావాహికలు'బొంబాయి దేవదాసి చట్టం, 1929, 1934, 1940, 1947, 1988, 64 కళ, అభిమానం, అమ్మాయి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆకలి, ఆచారం, ఆడపిల్ల, ఆమె, ఆర్థిక అసమానతలు, ఉదయం, ఉమెన్ స్టడీస్, కరీంనగర్, కరువు, కవులు, కాధలిక్‌నన్స్, కామ వాంఛలు, కామకలాపాలు, కుల మత, కూల్‌డ్రింక్స్ స్టాల్స్., కేరళ, గజనీ మహ్మదు, గణిక, గాయకులూ, గుడి, గౌరవం, గ్లూకోజు పాకెట్స్, చారిత్రక ఆధారాలు, చిత్తూరు, ఛాందస భావాలు, జైన, జోగిమర, డిపార్ట్‌మెంట్, తిరుపతి, దండయాత్రలు సోమనాధ దేవాలయం, దైవ, దైవ సన్నిధి, దేవత, దేవదాసి చట్టం, దేవదాసీ వ్యవస్థ, దేవదాసీలు, ధనికులు, నక్షత్ర బలం, నాయిక, నృత్యం, నెల్లూరు, పురుష, పుస్తకం, పెద్దలు, పెళ్ళి, ప్రాంతం, ప్రాచీన, ప్రొఫెసర్ భారతి, ప్లీజ్, బసివిలకు, బాలికల రక్షణ చట్టం, బిస్కెట్లు, బోర్ కొట్టి, భగవంతుని, భావనలు, భిక్కులు, భూస్వాములు, మజ్జిగ, మదరాసు, మధ్యయుగాల, మళయాళీ, మహిళ, మాతంగులు, మానవతా విలువలు, ముసలి, మూఢ విశ్వాసాలు, మైసూరు, రీసెర్చ్, రోమన్, లీల, వలసమ్మ, విదుషీమణి, విద్య, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, వేమలవాడ, వ్యభిచార నిరోధక చట్టం, వ్యభిచార వృత్తి, శతాబ్దాల, శివ సతులు, శ్రీకాకుళం, సంగీతం, సంప్రదాయం, సంస్కృతీ, సన్యాసినులు, సాయంత్రం, సురేఖ, స్త్రీ, స్వార్థ చింతనలు, హిందూPermalink