ఆ చుక్కల వెలుగులో ఆ జాబిలి జిలుగులో
వొలికినవా నీ చిరునవ్వులు
కురిసెనుగా కెంపులు సంపెంగలు
విరజాజులు పరిమళాల జడివానలు
లోలోపల ఎద గది లోలోపల ఓ మూలన
తియతియ్యని తేనెల కలలవాకలు
తనువంతా తొణికిసలై తొంగి చూసె
ఆశలు ఆకొండపైనవిరిసిన బొండుమల్లెలు
పదిలంగా నును వెచ్చని భావాలను
జ్ఞాపకల తెర వెనుకన కాంతిరేఖ నాజూకు నాట్యాన
సజీవమై సలలితమై సాగిపోవు సెలఏళ్ళను
గలగలమను పలవరింత ఓ మూలన
అసంపూర్తి చిత్రంలా ఉలితాకిడి స్పర్శకై
అవనతమై అభిసారికగా ఎదురుచూసె జీవనాన
చుక్కమొలిచినట్టు చుక్కపొడిచినట్టు
పెదవి నింగి నీడన చిరుమసక చంద్రవంకై
– స్వాతీ శ్రీపాద
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
One Response to లలిత గీతాలు