కవయిత్రి మహెజబీన్ కి అంతర్జాతీయ పురస్కారం

44583_103627759697887_4363698_nప్రముఖ స్త్రీవాద కవయిత్రి, మానవహక్కుల కార్యకర్త ,శాంతి కాముకురాలు, న్యాయవాది మహెజబీన్ కెనడా లో జరిగిన ప్రపంచ శాంతి కవితల సమ్మేళనం (World Poetry Canada International Peace Poetathon ) లో పాల్గొన్నారు .కెనడాలో భారత దేశపు శాంతి రాయబారిగా గౌరవం దక్కించుకున్నారు .జబీన్ రెండు దశాబ్దాలుగా వివిధ రంగాలలో – స్త్రీ పురుష సమానత్వం, స్త్రీ వాదం, శాంతి మరియు మానవ హక్కుల పరిరక్షణల కోసం కార్యక్రమాలు చేస్తున్నారు . దీని వల్ల గుర్తింపు రావడమే కాకుండా జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి . ఎన్నో ప్రపంచ అవకాశాలు తెచ్చి పెట్టాయి.

10402718_792666717460651_2064731848400932998_nభారతదేశం లో మైనారిటీ హక్కుల రక్షణకోసం, సామాజిక సంబంధాలను బలోపేతం చేయడం వారి విధి విధానాలలో ముఖ్యమైనవి. మత అల్లర్ల సమయంలో హైదరాబాద్ లోని పాత బస్తీలో శాంతి పరిరక్షణ కు అంతర్జాతీయం స్థాయి లో కృషి చేసారు.

10830624_792666820793974_4455033248953404850_oఈ సందర్భానికి స్పందిస్తూ మహె జబీన్ ఇలా అన్నారు. ” ఈ పురస్కారం వల్ల నాకు సామాజిక బాధ్యత పెరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం ఆంధ్ర జ్యోతి పత్రికలో ”ఒక అమావాస్య రాత్రి” అనే నా కవిత ప్రచురించబడింది. అది హైదరాబాద్ సిటీ లో ఉన్న లుంబిని పార్క్ లో జరిగిన బాంబు పేలుడు సంఘటన ఆధారంగా రాసాను .ప్రస్తుతం నేను దక్షిణ ఆసియాలో మానవ హక్కుల పరిరక్షణకై కృషి చేస్తున్నాను. ఇది నా ధీర్ఘకాల ప్రాజెక్ట్. నేను చేసే ఈ ప్రాజెక్ట్ కి మద్దతుగా రచయితలు, కార్యకర్తలు మరియు స్నేహితులతో సంప్రదింపులు చేశాను. నా జీవితంలో అతి సంతోషకరమైన క్షణం అంటే ….ఐక్యరాజ్యసమితి నా ప్రాజెక్ట్ ను అంగీకరించటమే . ” అన్నారు .
ప్రస్తుతం మహెజబీన్ విదేశీ పర్యటనలో వున్నారు .

కవయిత్రికి  విహంగ అభినందనలు !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

 

సాహిత్య సమావేశాలుPermalink

One Response to కవయిత్రి మహెజబీన్ కి అంతర్జాతీయ పురస్కారం