ఆంద్ర నాట్యకారిణి డా.కాశి సువర్చలా దేవితో ముఖాముఖి

నర్తన కేళి – 25

తెలుగు రాష్టాలలో ఉన్న నాట్యాలలో ఆంద్ర నాట్యం ఒకటి . ఆలయాలలో ఆగమ సాంప్రదాయంలో నర్తించే నర్తనం ఆంద్ర నాట్యం . ఆ నాట్యం పై పరిశోధన చేసి పిహెచ్.డి పట్టా అందుకున్న తొలి పరిశోధకురాలు శ్రీమతి డా.కాశి సువర్చలా దేవి గారితో ఈ నెల నర్తన కేళి ……..

hyf27ranee-dance_GT_911633g*మీ పూర్తి పేరు ?
డా . కె .వి . యల్ . ఎన్ . సువర్చలా దేవి

*మీ స్వస్థలం ?
జడ్చర్ల మహబూబ్ నగర్ జిల్లా , తెలంగాణ రాష్త్రం .

*మీ తల్లి దండ్రుల గురించి చెప్పండి ?
మా నాన్న గారి పేరు కాశీ భాస్కర మూర్తి , అమ్మ పేరు కాశీ శారదా దేవి .

*మీకు నాట్యం పై ఆసక్తి ఎలా కలిగింది ?
ఒకసారి ఆలయ నర్తకి శ్రీమతి సరిదే మాణిక్యమ్మ గారు మా ఊరు జడ్చర్లల్లో ఆమె నృత్య శిక్షణ ఇచ్చారు . నా స్నేహితురాలికి శిక్షణ ఇస్తుండగా చూసిన ఆ అభినయం నా మనసులో ముద్రించుకు పోయింది .

*వైదిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన మీరు నాట్యం నేర్చుకుంటాను అని చెప్పగానే మీ ఇంట్లో ఏమన్నారు ?
ముందు ఒప్పుకోలేదు . నేను ఎంతో ప్రయాస పడి మొండికేసి పట్టుపడితే గాని నేను నాట్యం నేర్చుకోవటానికి ఇంట్లో ఒప్పుకోలేదు .

*మీ తొలి గురువు ఎవరు ?
శ్రీమతి సరిదే మాణిక్యమ్మ గారు . చిన్నతనంలో నా ఐదవ ఏట నాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టాను .

*మీ తొలి ప్రదర్శన ఎప్పుడు ?ఎక్కడ జరిగింది ?
మా గ్రామం జడ్చర్లలో 1980 చేసాను . అప్పుడు పుష్పాంజలి , కౌతం మొదలైన చేసాను .

*మరి డా .నటరాజ రామకృష్ణ గారివద్ద శిష్యరికం గురించి ?
మాణిక్యం గారిని నేను అవ్వా అని పిలిచేదాన్ని . అవ్వా ద్వారానే నేను మా గురువు డా. నటరాజ రామకృష్ణ గారి వద్ద నాట్యంలో శిక్షణ తీసుకోవడం మొదలైయ్యింది .

* మీరు గురువు గారు డా. నటరాజ రామకృష్ణ గారి గురించి ?
అసలు నృత్యం అంటే ఏమిటి ? ఆగమాలు , వాటిలో ఉన్న విశేషాలతో పాటు ఆలయ నృత్యాల విశిష్టతను , శాస్త్రాన్ని , సంప్రదాయాన్ని అన్వయించి చెప్పిన వారు మా గురువుగారు . ఆయన ఒక నాట్య విజ్ఞాన సర్వస్వం .

*ఆలయ నాట్యం ఆగమ సాంప్రదాయం లో సాగుతుంది కదా ? ఆగమాలు ఎన్ని రకాలు ?
ఆగమాలు ముఖ్యంగా మూడు రకాలు . శైవాగమాలు శివునికి సంబంధించిది , వైఖానస పాంచ రాత్ర ఆగమాలు విష్ణువుకు సంబంధించినది , శక్తికి సంబంధించినది శాక్తేయాలు .

*దేవ గణిక అంటే ఎవరు ?
ఆలయ నర్తకినే దేవగణిక అంటారు .గుడిలో దేవ గణిక తెల్లవారు ఝామున గుడిలో దేవుణ్ణి నిద్ర లేపిన దగ్గర నుండి తిరిగి దేవుని పవ్వళింపు సేవ చేసే వరకు కొన్ని చోట్ల నృత్త , నృత్యాలను , నృత్యాభినయాలను చేస్తూ పాటలు పాడుతూ నాట్యం చేయడమే దేవ గణిక రోజూ చేసే పని .

*మీరు అందుకున్న పురస్కారాలు ?
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ఉగాది విశిష్ట పురస్కారం , పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ధర్మనిధి పురస్కారం , ఆరాధనా కల్చరల్ అసోసియేషన్ వారి ఆరాధనా యూత్ అవార్డ్ అందుకున్నాను .

*ఆంద్ర నాట్యం పై మీరు రాసిన వ్యాసాలూ గురించి ?
నాట్యానికి సంబంధించి ఇప్పటి వరకు 16 వ్యాసాలు వివిధ పత్రికలలో , సంచికలలో ప్రచురించబడ్డాయి .

*మీరు ఆంద్ర నాట్యం లో పరిశోధన చేసిన మొట్ట మొదటి వారు కదా ?
అవునండి . నేను ఆంద్ర నాట్యం – డి లాస్య డాన్స్ ట్రెడిషన్ ఆఫ్ ఆంధ్రాస్ అంశంపై పరిశోధన చేసాను . నాయికాస్ ఆఫ్ క్షేత్రయ్య పదమ్స్ , ఆంద్ర నాట్య వికాసం పుస్తకాలు రాసాను .

*మీ నృత్య శిక్షాణా సంస్థ ఎప్పుడు ప్రారంభించారు ?
1997 లో కూకట్ పల్లి హోసింగ్ బోర్డ్ ఎదురుగా విహార్ లో లాస్య అకాడమీ ఆఫ్ ఆంద్ర నాట్యం పేరుతో శిక్షణా సంస్థను స్థాపించాను .

*మీరు మీ శిష్యులకి ఏ విధంగా శిక్షణ ఇస్తారు ?
ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ని అంశాలతో పాటు , ప్రదర్శనలకు అనువైన ఇతర అంశాలను వారి వారి వయస్సులను బట్టి శిక్షణ ఇస్తాను .

మీ భావాలను , అనుభవాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు

-అరసి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~“

ముఖాముఖిPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో