స.వెం. రమేశ్ ‘కతల గంప’

IMG_2786ఒక దశాబ్దం క్రితం ప్రళయ కావేరి కథలు పేరుతో తెలుగు చదువరుల్ని   ఉర్రూతలూరించిన వారు  స.వెం.రమేశ్. ఆ కథలు వస్తున్నంత కాలం నెల్లూరు జిల్లా ప్రళయ కావేరి ప్రాంతపు మాట తీరుతో అతని బాల్యాన్ని కథలుగా  రాస్తూ కథల్ని ఉండేవాడు . అంతకు  ముందే ఒకటి అరా కథలు రాసినా  ప్రళయ కావేరి కథలతోనే ఆయనకి గుర్తింపు వచ్చింది . స.వెం.రమేశ్   భాషోద్యమ కార్యకర్త . తెలుగు భాషా లోకంలో అచ్చ తెలుగు పదాల వేట కొనసాగిస్తూనే ఉంటాడు . స . వెం . రమేశ్   చేసిన ప్రయోగాలు కొంత మందికి నచ్చాయి . మరి కొంత మంది గొంతుకకి అడ్డం పడ్డాయి . మనం తెలుగు అనుకుని అలవోకగా మాట్లాడుతున్న ఇతర భాషా పదాలకు బదులుగా ఎంత అందమైన తెలుగు పదాలున్నాయో ప్రయోగించి చూపిస్తాడు . తనని ఆదరించినా, ఆదరించక పోయినా తన రచనా వ్యాసంగాన్ని ఆపలేదు. భాషాపరంగా వెనుకబడిన ఎన్నో ప్రాంతాలలోను , దక్షిణ భారత దేశంలో ఎన్నో ప్రాంతాలు తిరిగి తెలుగు భాషపై ఉద్యమం నడిపి ఆయా ప్రాంతాల వ్యక్తులతో  వారి జీవితాలను వారి చేతే చిత్రింపచేసాడు .

మొరసునాడు కతలు , తొండునాడు కతలు ఈ రకంగా చదువరుల ముందుకు వచ్చినవే , వీటిలో ఎంతో మంది తమ తమ ప్రాంతీయ మాండలికాలను ఉపయోగిస్తూ   కతలను రాసారు .

చెట్లు చెప్పిన కత , అబ్బిళింత , పడి మందికి పెట్టె పడసాల , మీసర వాన , ఎందుండి వస్తీవి తుమ్మీదా, కతల గంప  వంటి కథలు తెలుగులో అచ్చమైన మానవ సంబంధాలను ఎత్తి చూపిస్తాయి. అర్ధం కాని పదాలకు చివర్లో అర్ధాలను ఇవ్వటం కూడా ఉపయోగకరంగా ఉంది .భావుకత్వాన్ని ప్రకటించడానికి అందమైన పర భాషా పదాలే వాడక్కర్లేద్దు . అచ్చమైన మట్టి వాసన పరిమళించే గ్రామీణ తెలుగు పదాలు కూడా మరింత కమ్మగా ఉంటాయని ఈ కథల్లో నిరూపించారు స.వెం.రమేశ్ . అందరు చదవదగిన పుస్తకం .

–  విహంగ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

 

పుస్తక సమీక్షలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)