సంపాదకీయం

Beautiful-Happy-New-Year-2014-HD-Wallpapers-by-techblogstop-6పాఠకుల ఆదరాభిమానాలతో విహంగ ఐదవ సంవత్సరంలోకి అడుగు పెట్టింది . ఈ విజయానికి వెన్నుదన్నుగా ఉండి ముందుకు నడిపిస్తున్న రచయిత్రులకు , రచయితలకు , సంపాదక వర్గానికి సాంకేతిక సహాయక బృందానికి ధన్యవాదాలు .

2014 వ సంవత్సరం ఎన్నో విజయాలను ఇచ్చింది . చేదు జ్ఞాపకాలనూ మిగిల్చింది . అత్యున్నత హిమాలయాల్ని ఆనంద్ తో పాటు అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు 14 ఏళ్ల మాలావత్ పూర్ణ సాధించిన విజయం వెలకట్టలేనిది . క్రీడా రంగంలో గ్రాండ్ టోర్నీ గెలుచుకున్న సానియా మీర్జా , వివిధ ఈ ప్రక్రియల్లో ప్రగతిని సాధించి పురస్కారాలు అందుకున్నరచయిత్రులు సి . భవానీ దేవి ,అల్లూరి గౌరీ లక్ష్మి , కన్నె గంటి అనసూయ , సమ్మెట ఉమాదేవి మొదలైనవారికి విహంగ అభినందనలు . వారు మరింత మంచి రచనలతో ముందుకు సాగాలని అభిలషిస్తున్నాను .

ఇంత మంచి అనుభూతులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా స్త్రీల పై జరిగిన దాడులు , అత్యాచారాల విషయానికి వస్తే సభ్య సమాజం తలవంచుకోక తప్పదు . దేశంలో వరకట్న చావులు , హత్యలు , గృహ హింసలు సర్వ సాధారణంగానే పతాక స్థాయిలో ఉన్నాయి . ముక్కు పచ్చలారని బాలికల్ని సాముహిక అత్యాచారాలు చేయటం నిత్యం వింటున్న వార్తలే . ఇది ఇలా ఉంటే ఇరాక్ లో ఈ మధ్యే జరిగిన సంఘటన అత్యంత పాశవిక మైంది . మతం సంరక్షణ పేరిట ఉగ్రవాదులు చేసిన మారణ కాండ కళ్లలో కన్నీటికి బదులు రక్తాన్ని స్రవించేలా చేసింది . ఉగ్రవాదులతో పెళ్లిళ్లకు ఒప్పుకోలేదని వారి శారీరిక వాంచలు తీర్చలేదని ౧౫౦ మందికి పైగా మహిళల్ని కాల్చి చంపి సామూహికంగా ఖననం చేసారు . వీరిలో గర్భిణి స్త్రీలు , చిన్నారులు కూడా ఉన్నారు . ముస్లిమేతర మహిళల్ని బానిసలుగా , లైంగిక సాధనాలుగా అభివర్ణిస్తూ వారు జరిపిన మారణ కాండ ప్రపంచ దేశాలను వణికించింది . స్త్రీలపై దాడులు ఏ దేశంలోనైనా ఏ సంస్కృతిలో నైనా పెరుగుతూనే ఉండటం గమనార్హం .
ప్రకృతి వైపరీత్యాలకు , అనుకోని సంఘటనలకు గురై ప్రాణాలు పోగొట్టుకోవడం ఒక ఎత్తు అయితే ఉగ్రవాదానికి బలవ్వటం స్వయంగా పులి పంజాకి చిక్కినట్టే . 2 0 1 4 జూలై మెదక్ లో జరిగిన రైలు ప్రమాదం లో స్కూల్ పిల్లల అకాల మరణానికి, మానవ నిర్లక్ష్యానికి అది నిలువెత్తు సాక్ష్యం . భవిష్యత్తులో గొప్ప వారు కావాల్సిన ఎంతో మంది చిన్నారులు కళ్ళ ముందే మొగ్గల్లా రాలి పోవడం హృదయ విదారక సంఘటన అయింది .

పెషావర్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో నారా మేధం సాగించిన ఉగ్రవాదులు 1 5 0 మందికి పైగా పసి బాలల్ని పొట్టన పెట్టుకున్నారు . మానవ హక్కులు , ఐక్య రాజ్య సమితి ఒప్పందాలు ఉద్యమాలు … ఏది ఎలా ఉన్నా మహిళలకి , బాల బాలికల ప్రాణాలకి రక్షణ లేదనే విషయం అర్ధమవుతూనే ఉంది . పై సంఘటనల పై ప్రభుత్వం ఉద్యమ కారుల చర్యలతో పాటు రచయితలకు కూడా బాధ్యత ఉంది . ప్రపంచ రచయితలంతా ఏకమై తమ రచనల ద్వారా చైతన్యం తీసుకురావాలి . అది మన రచయిత్రుల బాధ్యత కూడా ….

                       2015 ఆ దిశగా సాగుతుందని ఆశిస్తున్నాను .

                                                                    అందరికీ హృదయ పూర్వక

                                                                                                   నూతన సంవత్సర శుభాకాంక్షలు !

 – హేమలత పుట్ల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయంPermalink

2 Responses to సంపాదకీయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో