పునరాగమనం

1

పాలతో కడిగినా మసిపోలేదు –

ఇంతేకదా !

సమసిపోని

మనిషి నైజం

పాలసీసాలో పచ్చి విషం –

2

వక్రీకరించి

చిత్రీకరించి

ముమ్మాటికీ తుంటరితనం కానేకాదు –

కుట్రకు ముందు కవ్వించడం

కుత్తుక కోయడానికి ముందు కత్తి నూరడం –

నెపానిదేముంది ?

నీడను చూపి

నమ్మించి

నరకవచ్చు –

3

కపట మిత్రుడా ! కాటి చోరుడా !

వ్యంగ్య ప్రతీకలు

హృదయ భాషకు వొదగవూ  శోభించవు !

అత్యంత అందమైనదైనా

శ్వేతీయ అబద్ధం సత్యంగా రాణించదు –

4

శిలువ నీంచి దించుతూ

మరణ నిర్ధారణకు

బరిసె తో  పొడిచి పరీక్షించే

అవిశ్వాసుల అమానవీయమిది –

కుంచించుకొని పోయిన

పాప లోకాన్ని

పరిశుద్ధ పరచడానికి

వొక్క జన్మ సరిపోదు –

5

మహా ప్రవక్తా !

ఈసారి క్షమించడానికి కాదు .

శిక్షించడానికే

నీ ఆగమనం

ఇప్పుడు చాలా అవసరం !

– ఇక్బాల్ చంద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~“

కవితలు, , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో